Viral Video : రోడ్డుపై విచిత్ర స్టంట్లు.. యమరాజుకు మేనల్లుడే వీడు అంటున్న నెటిజన్లు

Viral Video : సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ఫేమస్ కావడం కోసం ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు యువత. వాటిలో బైక్ స్టంట్ల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా యువతలో దీని క్రేజ్ బాగా పెరిగిపోయింది. అయితే కొంతమంది కేవలం లైక్‌లు, వ్యూస్ సంపాదించుకోవాలనే ఆశతో తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అంతేకాదు, ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగిస్తున్నారు. తాజాగా, అలాంటి ఓ స్టంట్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రోడ్డుపై ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ వీడియో తీయించుకుంటున్న ఆ వ్యక్తికి తన ప్రాణం పట్ల కూడా భయం లేదని స్పష్టమవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు హాఫ్ ప్యాంట్, టీ-షర్ట్‌లో బైక్ వేగంగా నడుపుతున్నాడు. రోడ్డు మధ్యలో బైక్‌పై అతను అద్భుతమైన స్టంట్లు చేస్తున్నాడు. ఒక్కోసారి బైక్ ముందు చక్రం పైకి లేపి నడుపుతున్నాడు. ఇంకోసారి జిగ్-జాగ్ స్టైల్లో బైక్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. ఒక చోటైతే చేతులు వదిలేసి మరీ నడపడం చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఇదంతా చూసిన నెటిజన్లు “వీడేమైనా యమరాజు మేనల్లుడా?” అంటూ కామెంట్ చేస్తున్నారు.
Read Also:Viral Video : వీడికి రెండు గుండెలున్నాయా భయ్యా.. ప్రాణం పోతున్నా వీడియో తీశాడు
ఈ బైకర్ స్టంట్లు చేస్తున్నప్పుడు బైక్ అదుపుతప్పితే చేతులు, కాళ్లు విరిగిపోతాయని, లేదా తన ప్రాణాలకే ప్రమాదం అని కొంచెం కూడా భయం ఉన్నట్లు కనిపించడం లేదు. అంతేకాదు, అతను తనతో పాటు రోడ్డుపై ఉన్న ఇతర వ్యక్తుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నాడు. ఇలాంటి స్టంట్లు రోడ్డు భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తాయి. ఈ బైక్ స్టంట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @raj_mafiya_007_sad3 అనే అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 93 వేల మందికి పైగా లైక్ చేయగా, కామెంట్ల వర్షం కురుస్తోంది.
ఒక నెటిజన్ “వీడికి యమరాజుతో మంచి సాన్నిహిత్యం ఉన్నట్లుంది” అని కామెంట్ చేయగా, మరొక “నేనైతే కెమెరామెన్‌కు పేటీఎం చేయాలనుకుంటున్నా. భయ్యా కూడా బాగా రికార్డు చేశాడు” అని వ్యంగ్యంగా రాశారు. ఇంకొక నెటిజన్, “మా దగ్గర ఇలాంటి ‘ఛప్రి’ గాళ్లు ఇప్పటికైతే ఐసీయూలో ఉండేవాళ్ళు” అని రాశారు. మరొక నెటిజన్ “యమరాజు సెలవులో ఉన్నాడా ఏంటి?” అని ప్రశ్నించారు. ఈ వీడియో చూసి చాలా మంది నెటిజన్లు ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also:Miraculous Surgery: తాత పిత్తాశయంలో 8వేల రాళ్లు.. ఇంతకాలం ఎలా బతికావయ్యా ?
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు