Viral Video : వీడికి రెండు గుండెలున్నాయా భయ్యా.. ప్రాణం పోతున్నా వీడియో తీశాడు

Viral Video : గాఢ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మీ శరీరంపై ఏదో పాకుతున్నట్లు అనిపిస్తుంది. నిద్ర లేవగానే కళ్ళు తెరవగానే గుండెను అదిరేసే దృశ్యం కనిపిస్తుంది… ఒక భారీ కింగ్ కోబ్రా (King Cobra) నెమ్మదిగా మీపైకి పాకుతోంది.. ఇలా ఎవరికైనా జరిగితే, భయంతో గొంతులోంచి మాట కూడా బయటకు రాదు. ఎందుకంటే అరిస్తే పాము కోపంతో కాటేయవచ్చు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఉత్తరాఖండ్‌లో ఒక వ్యక్తికి ఎదురైంది. కానీ ఆ వ్యక్తి భయపడకుండా పామును వీడియో తీయడం మొదలుపెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది.
గుండె వేగంగా కొట్టుకునే అలాంటి పరిస్థితిలో ఆ వ్యక్తి ఏ మాత్రం భయం లేకుండా కింగ్ కోబ్రా కదలికలను ఆసక్తిగా చూడడం మొదలుపెట్టాడు. వైరల్ అవుతున్న వీడియోలో ఆ వ్యక్తి ప్రశాంతంగా ఉండి, తన శరీరంపై, మంచంపై అటు ఇటు తిరుగుతున్న కింగ్ కోబ్రాను తన ఫోన్లో రికార్డ్ చేయడం చూడొచ్చు.
Read Also:iPhone Users: ఐఫోన్ వినియోగదారులకు అలర్ట్.. కీలక సమచారం లీక్
చివరికి భయంతో దూకేసిన వ్యక్తి
అయితే, కోబ్రా అతని తల దగ్గరకు వచ్చి అతని కళ్ళలోకి చూసినప్పుడు ఆ వ్యక్తికి భయం పట్టుకుంది. వీడియోలో చూస్తే ఆ వ్యక్తి భయంతో వెంటనే మంచంపై నుంచి దూకేశాడు. అదృష్టవశాత్తూ పాము కోపగించుకోలేదు. లేకపోతే ఏదైనా జరిగి ఉండవచ్చు.
సోషల్ మీడియాలో వైరల్
రెండు నిమిషాల 16 సెకన్ల నిడివి గల ఈ వీడియో క్లిప్ రెడిట్‌లో షేర్ అయింది. దీనికి ఇప్పటివరకు 27 వేలకు పైగా అప్వోట్లు, రెండు వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగిందని యూజర్ క్యాప్షన్‌లో పేర్కొన్నారు.
Read Also:Actress Tamanna : జాక్ పాట్ కొట్టిన తమన్నా.. ఆ బ్రాండ్ కు ఏకంగా రూ. 6.20 కోట్లు!
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక నెటిజన్.. “మరణం కళ్ల ముందు ఉన్నా కెమెరానే గుర్తుకొచ్చిందా?” అని కామెంట్ చేయగా, మరొక నెటిజన్ “ఇది ఏదో పీడకలలా ఉంది” అని రాశారు. ఇంకొక నెటిజన్ “తెలివితక్కువ పనులకు ఇది పరాకాష్ట” అని అభిప్రాయపడ్డారు.
-
Kangna Sharma : “బట్టలు విప్పే పోటీ జరుగుతోందా?”.. కంగనా శర్మపై నెటిజన్ల ట్రోలింగ్!
-
Viral Video : రోడ్డుపై విచిత్ర స్టంట్లు.. యమరాజుకు మేనల్లుడే వీడు అంటున్న నెటిజన్లు
-
Viral Video : కర్మ అంటే ఇదే.. గాడిద కొట్టిన దెబ్బకు జీవితాంతం మర్చిపోలేడు
-
Viral Video : రీల్స్ పిచ్చితో ప్యాంట్‌కు నిప్పంటించుకుని స్టంట్లు.. చివరకు ఏమైందంటే ?
-
Viral Video : డ్రైనేజీ అనుకున్నాడు.. కానీ మరో లోకంలోకి వెళ్లిపోయాడు.. అదో భయానక ప్రపంచం
-
Viral Video : పిచ్చి పనికి పరాకాష్ట.. సింహం నోట్లో వేలు పెట్టిన యువకుడు.. తర్వాత ఏమైందంటే ?