iPhone Users: ఐఫోన్ వినియోగదారులకు అలర్ట్.. కీలక సమచారం లీక్
ఐఫోన్ అనేది చాలా మంది కల. కష్టపడిన డబ్బులను సేవ్ చేసి మరి ఐఫోన్‌ను కొనుగోలు చేస్తారు. ఇంతకు ముందు రోజుల కంటే ఇప్పుడు చాలా మంది ఐఫోన్ వాడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చాలా మంది ఐఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారు.

iPhone Users:ఐఫోన్ అనేది చాలా మంది కల. కష్టపడిన డబ్బులను సేవ్ చేసి మరి ఐఫోన్‌ను కొనుగోలు చేస్తారు. ఇంతకు ముందు రోజుల కంటే ఇప్పుడు చాలా మంది ఐఫోన్ వాడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చాలా మంది ఐఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారు. ప్రతీ ఏడాది ఒక కొత్త సిరీస్ మార్కెట్‌లోకి వస్తుంటుంది. ఇందులో ఫొటోలు బాగా రావడంతో పాటు కాస్త సెక్యూరిటీ ఉంటుందని చాలా మంది వాడుతారు. ఐఫోన్ అయితే ఎవరూ కూడా మీ డేటాను హ్యాక్ చేయలేరు. అందులోనూ ఇప్పుడున్న రోజుల్లో ఎక్కువగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది సేఫ్టీ కోసం కూడా ఐఫోన్ వాడుతున్నారు. అయితే ఐఫోన్‌లో బ్రౌజర్ వాడేవారికి బిగ్ షాక్ తగలనుంది. సాధారణంగా ఏ ఫోన్ వాడినా బ్రౌజింగ్ తప్పకుండా చేస్తారు. కానీ ఐఫోన్‌లో బ్రౌజింగ్ వాడేవారికి పెద్ద రిస్క్ ఉందని నిపుణులు అంటున్నారు. ఎందుకు ఐఫోన్ వాడే వారికి రిస్క్.. బ్రౌజింగ్ వాడటం వల్ల ఏమవుతుంది? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
Read Also: జాక్ పాట్ కొట్టిన తమన్నా.. ఆ బ్రాండ్ కు ఏకంగా రూ. 6.20 కోట్లు!
ఐఫోన్‌లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉపయోగిస్తున్న వారికి పెద్ద షాక్ తగిలింది. వినియోగదారుల సమాచారం లీక్ కావడంతో పాటు వారి బ్యాంకు వివరాలు వంటివి కూడా లీక్ అయ్యే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అయితే అన్ని బ్రౌజర్లు కాకుండా కొన్ని బ్రౌజర్లు వాడటం వల్ల రిస్క్ ఉందని అంటున్నారు. సాధారణంగా అందరూ కూడా గూగుల్ క్రోమ్ వాడుతారు. దీనివల్ల కూడా డేటా లీక్ అవుతుందని హెచ్చరిస్తున్నారు. బ్యాంకుకు సంబంధించిన అన్ని వివరాలను కూడా ట్రాక్ చేస్తారని అంటున్నారు. బ్యాంకు డిటైల్స్ వెళ్తే.. చాలు ఇక అకౌంట్‌లోని డబ్బులు అన్ని కూడా ఖాళీ అయిపోతాయి. కాబట్టి మీరు ఏ బ్రౌజింగ్ వాడుతున్నారో కాస్త జాగ్రత్త. అయితే గూగుల్ క్రోమ్‌లో కుక్కీస్ వస్తాయి. వీటివల్ల కూడా వ్యక్తిగత డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
Read Also: భగవద్గీత శ్లోకంతో రెడ్ కార్పెట్‌పై ప్రత్యేక ముద్ర.. కేన్స్‌లో మెరిసిన అందాల తార ఐశ్వర్య
వ్యక్తిగత డేటా లీక్ కాకుండా ఉండాలంటే క్రోమ్ బౌజర్‌ను వాడకుండా సురక్షితమైన వేరే బ్రౌజర్ వాడటం మంచిది. అయితే ఆపిల్ కంపెనీ సఫారీని ప్రైవేట్, సురక్షితమైన బ్రౌజర్‌గా భావిస్తుంది. వీటితో పాటు ఫైర్‌ఫాక్స్, డక్‌డక్‌గో, అవాస్ట్ సెక్యూర్ బ్రౌజర్ కూడా వాడటం మంచిదే. దీనివల్ల మీ వ్యక్తిగత డేటా లీక్ కాదు. కాబట్టి మీరు ఇప్పటికీ గూగుల్ క్రోమ్ వాడుతున్నట్లయితే మానేయండి. ఒకవేళ వాడితే మాత్రం ఐఫోన్ ఉన్నవారి వ్యక్తిగత డేటా లీక్ కావడం పక్కా అంటున్నారు నిపుణులు
-
Obesity in India : పిల్లలను కూడా వదలని ఊబకాయం.. వచ్చే 25 ఏళ్లలో అందరికీ పొట్టలుంటాయట
-
Vastu Tips: ఇంట్లో వీటిని పెడితే.. సంపద పెరగడం ఖాయం
-
Rice Water: బియ్యం వాటర్‌తో ఫేస్ గ్లో.. ఎలాగంటే?
-
North America: ఉత్తర అమెరికాలో భూగర్భ చినుకులు ఎందుకు వస్తున్నాయో తెలుసా?
-
Woman : మన ఇంటిని చక్కదిద్దే మహిళకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి?