Rice Water: బియ్యం వాటర్‌తో ఫేస్ గ్లో.. ఎలాగంటే?
అమ్మాయిలు అందానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో ఎక్కువగా చిట్కాలు పాటిస్తారు. ఇవే కాకుండా బ్యూటీ ప్రొడక్ట్స్ వంటివి కూడా వాడుతారు. వీటివల్ల చర్మం మెరవడం అనేది పక్కన పెడితే.. తర్వాత అనారోగ్య సమస్యలు వస్తాయి.

Rice Water: అమ్మాయిలు అందానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో ఎక్కువగా చిట్కాలు పాటిస్తారు. ఇవే కాకుండా బ్యూటీ ప్రొడక్ట్స్ వంటివి కూడా వాడుతారు. వీటివల్ల చర్మం మెరవడం అనేది పక్కన పెడితే.. తర్వాత అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ముఖంపై మచ్చలు, మొటిమలు వంటివి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకుండా ముఖం అందంగా మెరవాలంటే మాత్రం తప్పకుండా కొన్ని హోం రెమిడీస్ వాడాలని నిపుణులు అంటున్నారు. వీటివల్ల చర్మం మెరిసిపోతుంది. అలాగే ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు అన్ని కూడా తగ్గుతాయి. వయస్సు పెరుగుతున్నా కూడా యంగ్ లుక్‌లో కనిపిస్తారు. అయితే డైలీ మనం తినే బియ్యంతోనే చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే బియ్యం నీరును ముఖానికి ఎలా అప్లై చేయాలి? దీనివల్ల చర్మానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం.
Read also: బీఎస్‌ఎన్‌ఎల్ బెస్ట్ ప్లాన్.. బెనిఫిట్స్ తెలిస్తే రీఛార్జ్ చేయకుండా ఉండలేరు
ట్యాన్ క్లియర్
ముఖానికి బియ్యం నీరు అప్లై చేస్తే చర్మంపై ఉన్న ట్యాన్ అంతా కూడా పోతుంది. ఇందులోని పోషకాలు ముఖాన్ని తెల్లగా మారుస్తాయి. వంట చేసేటప్పుడు బియ్యం కడిగిన నీటిని ముఖానికి అప్లై చేస్తే మొటిమలు, మచ్చలు అన్ని కూడా తగ్గుతాయి. ముఖంపై ఉండే ముడతలు అన్ని కూడా తగ్గిపోతాయి. ఈ బియ్యం వాటర్ వల్ల ముసలితనం పోయి యంగ్ లుక్‌లో కనిపిస్తారు. డబ్బులు పెట్టి బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం కంటే బియ్యం వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. కాబట్టి బియ్యం వాటర్‌ను వారానికి ఒకసారి లేదా రెండుసార్లు అయినా ముఖానికి అప్లై చేయండి. చాలా మంది బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ పెద్దగా వాడరు. అలాంటి వారికి ఈ బియ్యం వాటర్ బాగా ఉపయోగపడతాయి. వీటిని డైలీ బయటకు వెళ్లినప్పుడు అప్లై చేస్తే సూర్య రశ్మి నుంచి రక్షణ కలుగుతుంది. అలాగే ఎలాంటి మొటిమలు లేకుండా ముఖం మెరిసిపోతుంది. దీంతో పాటు పొడిబారడం వంటి సమస్య కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
Read also: తక్కువ బడ్జెట్‌లో సందర్శించాల్సిన అందమైన దేశాలివే
ఎలా బియ్యం వాటర్ తయారు చేయాలంటే?
బియ్యం వాటర్‌ను ఈజీగా తయారు చేయవచ్చు. ఒక కప్పు తెల్ల బియ్యం తీసుకొని, బాగా కడిగి, అందులో రెండు కప్పులు వాటర్ వేసి మరిగించాలి. ఆ తర్వాత ఈ బియ్యాన్ని వడకట్టి ఆ నీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. దీన్ని మీరు ఐస్ క్యూబ్స్ లేదా డైరెక్ట్‌గా అయినా కూడా వాడుకోవచ్చు. డైలీ ఈ వాటర్‌ను లేదా వారానికొకసారి అయినా కూడా అప్లై చేయవచ్చు. అప్లై చేసిన తర్వాత కొన్ని నిమిషాల పాటు వదిలేసి ఆ తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది. ఎలాంటి మచ్చలు, మొటిమలు అయినా కూడా తగ్గుతాయి. వయస్సు పెరిగినా కూడా కనిపించకుండా యంగ్ లుక్‌లో ఉంటారు. అందరిలో మీ చర్మమే మెరిసిపోతుంది. ఎలాంటి మచ్చలు లేకుండా ఉంటారు. అయితే ఒక్కోక్కరి చర్మాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని అప్లై చేసే ముందు వైద్యు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
North America: ఉత్తర అమెరికాలో భూగర్భ చినుకులు ఎందుకు వస్తున్నాయో తెలుసా?
-
Beauty Tips : స్టీమ్ ఫేషియల్‌తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
-
Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు
-
Woman : మన ఇంటిని చక్కదిద్దే మహిళకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి?
-
Beauty Tips: సన్‌స్క్రీన్ లేదా మాయిశ్చరైజర్ ముందుగా దేన్ని అప్లై చేయాలి?
-
Beauty Tips : అకాల వృద్దాప్యంతో బాధ పడుతున్నారా? మొహం మీద ముడతలు వచ్చేశాయా? జస్ట్ ఈ ఫేస్ ప్యాక్ లు ట్రై చేయండి..