Obesity in India : పిల్లలను కూడా వదలని ఊబకాయం.. వచ్చే 25 ఏళ్లలో అందరికీ పొట్టలుంటాయట

Obesity in India : భారతదేశానికి రాబోయే 25 ఏళ్లలో ఒక పెద్ద ఆరోగ్య ముప్పు పొంచి ఉంది. నిపుణులు హెచ్చరిస్తున్న దాని ప్రకారం.. దేశంలో ఒక భయంకరమైన వ్యాధి సునామీలా వ్యాపించనుంది. ఈ వ్యాధి కారణంగా అనేక ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. భారతదేశంలో 35 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఇంతకీ ఆ వ్యాధి ఏమిటి? అది ఎందుకు అంత వేగంగా వ్యాప్తి చెందుతోంది? దాని నుండి తప్పించుకోవడానికి ఏమి చేయాలి? అనే విషయాలను ఈ వార్తలో తెలుసుకుందాం.
ఈ వ్యాధి అనేక ఇతర రోగాలకు మూలంగా చెబుతున్నారు. టైప్ 2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, కొవ్వు పేరుకుపోయిన కాలేయం (ఫ్యాటీ లివర్), హార్మోన్ల అసమతుల్యత, సంతానం కలగకపోవడం, కొన్ని రకాల క్యాన్సర్లు పెరిగేందుకు కూడా ఈ వ్యాధికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఇది దేశంలో ఒక పెద్ద సంక్షోభంగా మారుతోంది. ఈ వ్యాధికి ప్రధాన కారణం లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన ఆహారం. ఈ వ్యాధి పిల్లలను కూడా బాధిస్తోంది.
Read Also:Dark Spots : ఈ 5 ఇంటి చిట్కాలు ట్రై చేయండి..వేసవిలో నల్ల మచ్చలకు చెక్ పెట్టండి
ఈ వ్యాధిని ఊబకాయం లేదా ఒబేసిటీ అంటారు. ‘ది లాన్సెట్’లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. 2050 నాటికి భారతదేశంలో దాదాపు మూడింట ఒక వంతు మంది ప్రజలు, అంటే 44.9 కోట్ల మంది ఊబకాయం బారిన పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎయిమ్స్‌లోని మెడిసిన్ విభాగపు అదనపు ప్రొఫెసర్ డాక్టర్ నీరజ్ నిశ్చల్ ప్రకారం.. 20 – 30 సంవత్సరాల వయస్సు గల వారిలో నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఊబకాయం. అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, డీన్ డాక్టర్ రాజేష్ ఉపాధ్యాయ అభిప్రాయం ప్రకారం.. ఊబకాయానికి వెంటనే పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. ఇది దేశంలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, ఆర్థిక ఉత్పాదకత మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. మహమ్మారిలా పెరుగుతున్న ఈ ఊబకాయం వ్యాధిని నివారించడానికి విస్తృత స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ వ్యాధి నేరుగా జీవనశైలితో ముడిపడి ఉంటుంది. చిన్న వయస్సులోనే పిల్లలు దీని బారిన పడుతున్నారు. దీని నివారణ కోసం పాఠశాల స్థాయి నుండే అవగాహన కల్పించే ప్రయత్నాలు చేయాలి. పిల్లలకు వారి ఆరోగ్యం కోసం ఏమి మంచిది . ఏమి చెడ్డది అని చెప్పాలి. అంతేకాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవలసిన అవసరం ఉంది. ఇప్పుడే దీని కోసం ప్రయత్నించకపోతే.. రెండు దశాబ్దాల తర్వాత దేశ ఆరోగ్యం పూర్తిగా క్షీణించవచ్చు.
Read Also:IPL 2025: ఆ జట్టు ఈ మ్యాచ్ గెలిస్తే.. డైరెక్ట్ ప్లేఆఫ్స్
-
Mahindra Bolero : టయోటా ఫార్చ్యూనర్‌కు పోటీగా మహీంద్రా బొలెరో బోల్డ్.. ప్రత్యేకతలు ఇవే!
-
Viral Video : రైలు ఎక్కబోయి మరొకరి ప్రాణాలకు ముప్పు తెచ్చిన అంకుల్.. షాకింగ్ ఘటన!
-
Viral Video : పెళ్లి పందిట్లో ఎద్దు వీరంగం.. మ్యూజిక్‌కు రెచ్చిపోయి వేసిన డ్యాన్స్ చూస్తే షాకే
-
Jyoti Malhotra : ప్రియుడితో వేషాలు.. పాకిస్తాన్ కు భారత రహస్యాలు..యూట్యూబర్ అరెస్ట్
-
Smart Phone : డిజిటల్ ఇండియా ఎఫెక్ట్.. దాని వినియోగంలో అమెరికాను దాటేసిన భారత్
-
IPL 2025 : బీసీసీఐ నిర్ణయం పై మండిపడుతున్న అభిమానులు..కోల్‌కతా ఫ్యాన్స్ ఆగ్రహావేశాలు!