IPL 2025: ఆ జట్టు ఈ మ్యాచ్ గెలిస్తే.. డైరెక్ట్ ప్లేఆఫ్స్

IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025 భారత్, పాక్ యుద్ధ వాతావరణం వల్ల వాయిదా పడింది. మళ్లీ శనివారం నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్, ఆర్సీబీ తలపడాలి. కానీ టాస్ వేయకుండా వరుణుడు రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. అయితే దీంతో కేకేఆర్, ఆర్సీబీకి చెరో పాయింట్ ఇచ్చారు. అయితే నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీలో గుజరాత్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. అయితే వీటిలో గుజరాత్ ఇప్పటికే ఎలిమినేటర్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్స్ రేసులో ముందు ఉండాలని భావిస్తోంది. ఇక మరో వైపు గుజరాత్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోతే వేరేలా ఉంటుంది. అదే ఒకవేళ గుజరాత్ ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం ప్లే ఆఫ్స్‌కు చేరిన మొదటి జట్టు కూడా ఇదే అవుతుంది. అయితే మరి ఈ రోజు జరిగే మ్యాచ్‌లలో ఏయే జట్లు గెలుస్తాయో చూడాలి.
Read Also:IPL 2025: ప్లేఆఫ్ రేస్‌కు వెళ్లాలంటే.. ఏయే జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
ప్లే ఆఫ్ రేస్‌కు వెళ్లాలంటే కొన్ని జట్టు మ్యాచ్‌లు గెలవాలి. ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు గుజరాత్ మూడు మ్యాచ్‌లలో ఒకటి, ఆర్సీబీ జట్టు 3 మ్యాచులలో ఒకటి, పంజాబ్ మూడు మ్యాచ్‌లలో రెండు, ముంబై ఇండియన్ రెండు మ్యాచ్‌లలో 2, ఢిల్లీ క్యాపిటల్స్ మూడు మ్యాచ్‌లలో 2 గెలవాల్సి ఉంది. అయితే వీటితో పాటు కేకేఆర్, లక్నోకి కూడా అవకాశం ఉంది. అయితే ఇది మిగతా జట్లు గెలుపు, ఓటమి బట్టి ఉంటుంది.
Read Also:Jacqueline Fernandez : కేన్స్‌లో బాలీవుడ్ సీక్రెట్లను బయటపెట్టిన జాక్వెలిన్.. అంతా కలిసి తనను అలా చేశారట
ఐపీఎల్ 2025 సీజన్‌లో క్వాలిఫయర్ 1 మ్యాచ్ మే 29 న నిర్వహించనుంది. ఇక 30న ఎలిమినేటర్ మ్యాచ్, జూన్ 1న క్వాలిఫయర్ 2, జూన్ 3న ఫైనల్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయనే విషయాన్ని అయితే బీసీసీఐ వెల్లడించలేదు. అయితే ఐపీఎల్ ఈ సీజన్‌లో టాప్‌లో గుజరాత్ టైటాన్స్ ఉండగా.. సెకండ్ ప్లేస్‌లో రాయల్ ఛాలెంజర్స్, మూడో స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది. గుజరాత్ 11 మ్యాచ్‌లు ఆడిన 8 గెలిచి మూడు ఓడిపోయింది. ఇందులో మొత్తం 12 మ్యాచ్‌లు పంజాబ్ కింగ్స్ ఆడి 7 మాత్రమే గెలిచింది. మిగిలిన మూడు ఓడిపోయింది.
ఇదిలా ఉండగా వాయిదా తర్వాత కేకేఆర్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరగాల్సింది. కానీ వర్షం కారణంగా మ్యాచ్ అర్థాంతరంగా ఆగిపోయింది. టాస్ వేయకుండానే మ్యాచ్ ఆగిపోయింది. దీంతో రెండు జట్లుకు చేరో పాయింట్‌ను ఇచ్చారు. అయితే ఇప్పటికే ఆర్సీబీ ఫామ్‌లో ఉంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్‌లో ఆర్సీబీ అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది.
-
IPL 2025: పంజాబ్ జట్టు సరికొత్త రికార్డు
-
IPL 2025 : బీసీసీఐ నిర్ణయం పై మండిపడుతున్న అభిమానులు..కోల్‌కతా ఫ్యాన్స్ ఆగ్రహావేశాలు!
-
IPL 2025: ప్లేఆఫ్ రేస్‌కు వెళ్లాలంటే.. ఏయే జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
-
IPL new schedule: ఐపీఎల్ న్యూ షెడ్యూల్ రిలీజ్.. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే?
-
Riyan Parag: వరుసగా ఆరు సిక్స్‌లు.. ఐపీఎల్ చరిత్రలోనే రియాగ్ పరాగ్ రికార్డు
-
MS Dhoni : ఐపీఎల్‌లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?