Skin Tips: రోజూ తినే ఈ ఫుడ్ వాటర్ యూజ్ చేస్తే.. అందం అమాంతం పెరిగిపోవడం ఖాయం

Skin Tips: ప్రస్తుతం రోజుల్లో చాలా మంది జుట్టు, మొటిమలు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా రైస్ వాటర్ వాడాల్సిందే. ప్రతీ ఒక్కరూ రోజులో ఒక్కపూట అయినా కూడా బియ్యం వండుతారు. ఇలా బియ్యం వండే ముందు కడిగిన వాటర్‌తో చర్మం, జుట్టు సౌందర్యాన్ని పెంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా కూడా ఈ బియ్యం వాటర్‌తో పూర్తిగా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. బియ్యంలోని పోషకాలు ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తాయి. అయితే బియ్యం వాటర్‌ను చర్మానికి, జుట్టుకు ఎలా ఉపయోగిస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం.
బియ్యం కడిగిన తర్వాత ఆ వాటర్‌ను చర్మానికి లేదా జట్టుకు రాయడం వల్ల బాగుంటుంది. ఎందుకంటే బియ్యం వాటర్ జుట్టుకు సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. దీంతో జుట్టు పొడి బారే సమస్య, రాలే సమస్యను తగ్గిస్తుంది. అలాగే జుట్టు రాలిపోకుండా దృఢంగా పెరిగేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే జుట్టుకు బియ్యం వాటర్ పెట్టిన తర్వాత కాస్త్ మసాజ్ చేయాలి. అక్కడికి గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అసలు జుట్టు రాలిపోయే సమస్య ఉండదని నిపుణులు అంటున్నారు. ఈ బియ్యం వాటర్ వల్ల జుట్టు మృదువుగా ఉంటుంది. ఈ బియ్యపు నీళ్లలో విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. జుట్టు కుదళ్ల నుంచి బలంగా ఉండేలా చేస్తుంది. అలాగే రక్త ప్రసరణ జరిగేలా చేయడంతో పాటు జుట్టు పెరిగేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు.
బియ్యం వాష్ చేసిన తర్వాత నీటిని చర్మానికి అప్లై చేయడం వల్ల మెరుస్తుంది. ఈ బియ్యం వాటర్ ఒక టోనర్‌గా ఉపయోగపడుతుంది. డైలీ బియ్యం వాటర్‌ను ముఖానికి అప్లై చేస్తే ముఖంపై ఉన్న మచ్చలు, మొటిమలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయడంలో బియ్యం వాటర్ బాగా ఉపయోగపడతాయి. అయితే ముఖానికి బియ్యం వాటర్ అప్లై చేసిన తర్వాత కాస్త మర్దన చేయాలి. ఆ తర్వాతా ఫేష్ వాష్ చేస్తే ముఖం మెరిసిపోతుంది. అందరిలో మీరే కాంతి వంతంగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై ఉండే మొటిమలను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి చర్మంపై ఉండే మృత కణాలను తగ్గించి మెరిసేలా చేస్తుంది. వారానికి ఒకసారి లేదా రెండు సార్లు ఇలా చేయడం వల్ల తప్పకుండా చర్మం, జుట్టు రెండు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఎలాంటి సమస్యలు అయినా కూడా తీరిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
ఇది కూడా చూడండి: Google pixle 10 series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్.. డిజైన్, ఫీచర్స్ చూస్తే మతి పోవాల్సిందే భయ్యా