Hair Tips: జుట్టు పెరుగుదలకు ఏ నూనె అప్లై చేయాలంటే?

Hair Tips: అమ్మాయిలకు జుట్టు అనేది అందం. జుట్టు అందంగా కనిపించాలని ఎన్నో చిట్కాలు పాటిస్తారు. ముఖ్యంగా ఆయిల్స్, షాంపులు కండీషనర్లు, సీరమ్‌లు ఇలా కొత్తవి వాడుతుంటారు. వీటిని వాడటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తారు. కానీ వీటివల్ల ఎక్కువగా జుట్టు రాలిపోతుంది. ఎందుకంటే వీటిలో ఎన్ని సప్లిమెంట్‌లు ఉన్నప్పటికీ కూడా రసాయనాలు ఎక్కువగా ఉండటం వల్ల రాలిపోతుంది. జట్టు అసలు రాలకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం తప్పకుండా కొన్ని ఆయిల్స్‌ను తలకు అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని సహజంగా తయారు చేస్తారు. ఎలాంటి కెమికల్స్ కూడా ఈ ఆయిల్‌లో ఉండవు. వీటివల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండటంతో పాటు బలంగా పెరుగుతుంది. జుట్టు చిట్లిపోవడం, రాలిపోవడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే ఎలాంటి జుట్టు సమస్యలు ఉండకూడదంటే.. తలకు రాయాల్సిన ఆయిల్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
రోజ్మేరీ ఆయిల్
ఈ ఆయిల్ తలకు అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది జుట్టు రాలే సమస్యలు అన్నింటిని కూడా తగ్గిస్తుంది. తలకు రోజ్మెరీ ఆయిల్ అప్లై చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో జుట్టు బలంగా పెరుగుతుంది. జుట్టుకు కుదుళ్ల నుంచి బలం తగిలి బాగా పెరుగుతుంది. సన్నగా ఉన్న జుట్టు కూడా దృఢంగా పెరుగుతుంది. ఈ ఆయిల్ మార్కెట్‌లో లభ్యమవుతుంది. దీని కంటే రోజ్మేరీ ఆకులను తీసుకుని మీరే స్వయంగా ఆయిల్ తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న ఆయిల్ వల్ల జట్టు సమస్యలు పెద్దగా రావు.
పిప్పరమింట్ ఆయిల్
ఈ ఆయిల్ వల్ల కూడా జుట్టు బలంగా పెరుగుతుంది. ఆ ఆయిల్‌ను స్కాల్ప్‌కి అప్లై చేయడం వల్ల రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. అలాగే జుట్టు సమస్యలు అన్ని కూడా తగ్గుతాయి. చుండ్రు వంటివి లేకుండా జుట్టు బలంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ నిద్రపోయే ముందు ఈ ఆయిల్‌ను తలకు అప్లై చేయడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.
టీట్రీ ఆయిల్
ఈ ఆయిల్‌లో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. స్కల్ప్‌కు ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. చుండ్రు వంటివి రాకుండా జుట్టు రాలే సమస్యలను క్లియర్ చేస్తాయి. అలాగే జుట్టు బలంగా ఉండేలా చేయడంలో టీట్రీ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది.
లావెండర్ ఆయిల్
ఈ ఆయిల్ వల్ల కూడా జుట్టు బలంగా పెరుగుతుంది. రాత్రిపూట ఈ ఆయిల్‌ను తలకు అప్లై చేసి ఉదయాన్నే తలస్నానం చేస్తే జుట్టు బలంగా పెరుగుతుంది. ఇందులోని పోషకాలు జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. అలాగే ఎలాంటి జుట్టు దృఢంగా ఉండేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.