Hair: జుట్టు పెరగాలంటే ఇది ఒక్కటి రాస్తే చాలు

Hair: ప్రస్తుతం రోజుల్లో కాలుష్యం వల్ల చాలా మంది జట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం, జుట్టు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎక్కువగా రాలిపోతుంది. పూర్వం రోజుల్లో తలకు నూనె అప్లై చేయడం, సహజంగా ఉండే కుంకుడు కాయ వంటివి అప్లై చేసేశారు. వీటివల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండేది. కానీ ప్రస్తుతం రోజుల్లో అయితే స్టైల్‌కి బాగా అలవాటు పడి జుట్టుకు ఏం పెట్టడం లేదు. దీంతో జుట్టు బాగా బలహీనం అవుతుంది. నూనె లేకపోవడం వల్ల జుట్టుకి ఏం అప్లై చేయకపోవడం వల్ల జుట్టు బలహీనంగా మారి.. రాలిపోతుంది. దీనికి తోడు రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడటం, అసలు సహజంగా ఉండే చిట్కాలు పాటించకపోవడం వల్ల జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే మాత్రం తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలి. ముఖ్యంగా ఒక్క ఆయిల్ తలకు అప్లై చేస్తే జుట్టు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి జుట్టుకు అప్లై చేయాల్సిన ఆ నూనె ఏంటి? దీన్ని ఎలా అప్లై చేయాలి? చేస్తే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరగాలంటే ఆవ నూనె రాయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆవనూనె వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. తలపై ఉన్న ఇన్ఫెక్షన్లు అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. ఆవ నూనె చుండ్రు, తెల్ల జుట్టును కూడా తగ్గిస్తుంది. ఇందులోని పోషకాలు జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి. అయితే చాలా మందికి ఈ ఆవ నూనె గురించి పెద్దగా తెలియదు. ఈ ఆవ నూనె వాడటం వల్ల జుట్టు దృఢంగా పెరుగుతుంది. ఈ ఆవ నూనెను తలపై అప్లై చేసి కాస్త మసాజ్ చేయాలి. ఒక పది నిమిషాల పాటు మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ జరుగుతుంది. దీంతో జుట్టు పెరుగుదల తొందరగా ఉంటుంది. జుట్టు కుదుళ్లు నుంచి అప్లై చేయడం వల్ల బలంగా పెరుగుతుంది. ముఖ్యంగా పొడి జుట్టు ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆవ నూనెలోని పోషకాలు జుట్టు సమస్యలను తగ్గిస్తుంది.
ఆవనూనె వల్ల కేవలం జుట్టు మాత్రమే ఆరోగ్యంగా ఉండకుండా.. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని పోషకాలు చర్మాన్ని మెరిపిస్తాయి. దీంతో చర్మానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. మెరిసిపోతుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు అన్ని కూడా తొలగిపోతాయి. ఫేస్ గ్లోగా ఉంటుంది. వేసవిలో ఈ ఆవ నూనె సన్ స్క్రీన్ లా కూడా పనిచేస్తుంది. బయటకు వెళ్లేటప్పుడు చర్మానికి అప్లై చేస్తే మెరిసిసోతుంది. ట్యాన్ నుంచి కూడా విముక్తి కలుగుతుంది. ఈ ఆవ నూనెలో కలబంద, శనగపిండి, పాలు, పసుపు కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుంటే ఫేస్ మెరిసిపోతుంది. వారానికొకసారి ఇలా చేస్తే ముఖం అంతా కూడా మెరిసిపోతుందని నిపుణులు అంటున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Concentration: ఏకాగ్రత ఉన్నవారిలో కనిపించే లక్షణాలివే
-
Health Tips: నెయ్యి, వెన్న, నూనెలో ఏది బెటర్?
-
Oil: ఈ టిప్స్ పాటిస్తే.. కల్తీ నూనెను గుర్తించడం ఈజీ
-
Rosemary Oil: తలకు రోజ్మెరీ ఆయిల్ అప్లై చేయవచ్చా? చేస్తే జుట్టు పెరుగుతుందా?
-
Hair: చికెన్‌కి, జుట్టుకి లింక్ ఏంటి.. దీనివల్ల జుట్టు పెరుగుతుందా.. ఇందులో నిజమెంత?