Rosemary Oil: తలకు రోజ్మెరీ ఆయిల్ అప్లై చేయవచ్చా? చేస్తే జుట్టు పెరుగుతుందా?

Rosemary Oil:
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా రోజ్మేరీ ఆయిల్ ట్రెండ్ అవుతుంది. ఇందులోని పోషకాలు జట్టు రాలకుండా చేస్తాయని అంటుంటారు. దీంతో చాలా మంది ఈ రోజ్మెరీ ఆయిల్ తలకు అప్లై చేయాలని ట్రై చేస్తున్నారు. జుట్టు కుదుళ్లకు రోజ్మెరీ ఆయిల్ అప్లై చేయడం వల్ల కురులు రాలకుండా ఆరోగ్యంగా ఉంటుందట. ఇప్పుడున్న జీవనశైలి వల్ల చాలా మంది అమ్మాయిల జుట్టు ఎక్కువగా రాలుతుంది. ఎందుకంటే పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల జట్టుకి బలం అందడం లేదు. తొందరగా రాలిపోతుంది. కురులు బలహీనమై ఇంట్లో ఎక్కడ చూసినా కూడా జుట్టు కనిపిస్తుంది. దీనికి తోడు రసాయనాలు ఉండే షాంపూలు, ప్రొడక్ట్స్ అన్ని కూడా వాడటం వల్ల జుట్టు బలహీనమై రాలిపోతుంది. దీనికి తోడు ఈ కాలం అమ్మాయిలు ఎక్కువగా ఫ్యాషన్‌కి అలవాటు పడి అసలు తలకు నూనె కూడా అప్లై చేయరు. తలకు నూనె అప్లై చేయకపోతే జుట్టు పొడిగా, బలహీనంగా మారి రాలిపోతుంది. పూర్వ కాలంలో అయితే జుట్టుకు సికాయ్, కుంకుడు కాయ వంటివి పెట్టుకునే వారు. కానీ ఇప్పుడు రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్, షాంపూలు, కండీషనర్లు వంటివి వాడటం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. అయితే ఈ జుట్టు రాలిపోకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా ఈ రోజ్మేరీ ఆయిల్ అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. మరి దీనిని ఎలా అప్లై చేస్తే జుట్టుకి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం.
రోజ్మేరీ ఆయిల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టును బలంగా ఉంచడంలో బాగా సాయపడతాయి. మీరు రోజ్మేరీ ఆకులను నీటిలో నానబెట్టి ఆ వాటర్ కూడా తలకు అప్లై చేయవచ్చు. లేదా ఆయిల్లో వేసి బాగా మరిగించిన తర్వాత కూడా తలకు అప్లై చేయడం వల్ల జుట్టుకు బాగా పోషకాలు అందుతాయి. దీంతో జుట్టు రాలిపోకుండా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు జుట్టు బలంగా, దృఢంగా పెరిగేలా చేస్తుంది. వారానికి ఒకసారి అయినా ఈ ఆయిల్‌ను తలకు అప్లై చేస్తే జుట్టు రాలే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. రోజ్మేరీ ఆయిల్లో ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ , యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి జుట్టు బలంగా పెరిగేలా చేస్తుంది. అయితే రోజ్మేరీ ఆయిల్‌ను తలకు అప్లై చేసిన తర్వాత కాస్త మసాజ్ చేయాలి. తలకు అప్లై చేసిన పది నిమిషాల వరకు మసాజ్ చేస్తే.. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో జుట్టు బలంగా ఉంటుంది. రక్త ప్రసరణ వల్ల జుట్టు రాలిపోయే సమస్య పూర్తిగా తగ్గుతుంది. అయితే మార్కెట్లో రోజ్మేరీ ఆయిల్ లభ్యమవుతుంది. దీన్ని తలకు అప్లై చేస్తే జుట్టు రాలిపోకుండా పెరుగుతుంది. ఈ ఆయిల్‌ను మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. రోజ్మేరీ ఆయిల్ ను వాటి ఆకులతో కొబ్బరి లేదా ఆముదం, ఆలివ్ ఇలా మీరు తలకు రాసుకునే ఆయిల్లో వేసి తయారు చేసుకోవచ్చు. అయితే కొందరు రోజ్మేరీ వాటర్‌ను కూడా తాగుతారు. దీన్ని తాగడం వల్ల జుట్టు బలంగా పెరగడంతో పాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావని నిపుణులు చెబుతుంటారు.
-
Laptop : లాప్ టాప్ ముందు కూర్చొని కూర్చొని భుజం నొప్పి వస్తుందా?
-
Fridge: వామ్మో ఫ్రిజ్ లోని ఆహారం తింటున్నారా?
-
Exams complete: విద్యార్థులకు పరీక్షలు ముగిశాయా.. ఓ కన్నేసి ఉంచండి
-
Salt : ఉప్పు తక్కువ అయితే ఫుడ్ తినరా? కాస్త ఎక్కువ అయినా డైరెక్ట్ అటేనట..
-
Hair: జుట్టు నివారణ చర్యలు కాదు.. జుట్టు ఎందుకు రాలుతుందో తెలుసుకోవడం ముఖ్యం
-
Weight Gain Tips: వీక్ గా ఉంటున్నారా? గుర్రంలా పరుగెత్తించేలా చేస్తాయి ఇవి.