Actress Tamanna : జాక్ పాట్ కొట్టిన తమన్నా.. ఆ బ్రాండ్ కు ఏకంగా రూ. 6.20 కోట్లు!
సౌత్ నుంచి నార్త్ వరకు తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ తమన్నా భాటియా. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Actress Tamanna : సౌత్ నుంచి నార్త్ వరకు తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ తమన్నా భాటియా. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి ఆమెకు ఒక భారీ డీల్ దక్కింది. కర్ణాటక ప్రభుత్వం తమన్నాను ఎంతో చరిత్ర కలిగిన ‘మైసూర్ సాండల్ సోప్’ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా నియమించింది. ఈ డీల్ విలువ దాని చుట్టూ జరుగుతున్న చర్చలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మైసూర్ సాండల్ సోప్ అనేది ఈనాటిది కాదు, శతాబ్దాల చరిత్ర కలిగిన ఒక ప్రతిష్టాత్మక బ్రాండ్. మీడియా నివేదికల ప్రకారం, ఈ సబ్బును 1916 నుండి ఉత్పత్తి చేస్తున్నారు. 1900ల ప్రారంభంలో మైసూర్ మహారాజు కృష్ణ రాజ వడియార్ IV బెంగళూరులో ఒక ప్రభుత్వ సబ్బు కర్మాగారాన్ని స్థాపించారు. అప్పటి నుంచి ఈ సబ్బును కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ (KSDL) ఉత్పత్తి చేస్తోంది. కర్ణాటక సంస్కృతిలో ఈ సబ్బుకు విశేష ప్రాధాన్యత ఉంది.
Read Also: చిరంజీవి మళ్లీ ఆశ్చర్యపరిచాడు.. అసలు ఊహించని పని చేశాడు
అలాంటి గొప్ప చరిత్ర కలిగిన బ్రాండ్‌కు తమన్నా భాటియాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం విశేషం. ఈ ఒప్పందం రెండు సంవత్సరాల రెండు రోజుల కాలానికి కుదిరింది. దీని మొత్తం విలువ రూ. 6.20 కోట్లు. ఈ ఒప్పందానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 1999 నాటి కామర్స్ ఇండస్ట్రీ చట్టంలోని సెక్షన్ 4(g) కింద ఈ ఒప్పందానికి మినహాయింపు ఇవ్వబడినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. తద్వారా తమన్నా భాటియాను కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించవచ్చు అని తెలిపారు.
అయితే, ఈ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై ప్రశ్నలు తలెత్తాయి. చాలా మంది నెటిజన్లు, సినీ అభిమానులు ఈ డీల్ కోసం కన్నడ నటులను కూడా ఎంపిక చేయవచ్చుగా అని అభిప్రాయపడ్డారు. ఈ విమర్శలపై కర్ణాటక ప్రభుత్వ పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బి. పాటిల్ స్పందించారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ కన్నడ పరిశ్రమను గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కొన్ని కన్నడ సినిమాలు బాలీవుడ్ చిత్రాలకు గట్టి పోటీ ఇస్తున్నాయని కూడా ఆయన ప్రస్తావించారు.
Read Also: భగవద్గీత శ్లోకంతో రెడ్ కార్పెట్‌పై ప్రత్యేక ముద్ర.. కేన్స్‌లో మెరిసిన అందాల తార ఐశ్వర్య
మైసూర్ సాండల్ సోప్ లక్ష్యం కర్ణాటక వెలుపలి మార్కెట్‌లలో కూడా విస్తరించాలని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. మార్కెట్ నిపుణులు ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. ఏదైనా బ్రాండ్‌కు అంబాసిడర్‌ను ఎంపిక చేయడానికి, వారి బ్రాండ్ వ్యాల్యూ, విస్తృత గుర్తింపు ప్రధాన ప్రమాణాలుగా ఉంటాయి. KSDL 2028 నాటికి రూ.5,000 కోట్ల వార్షిక ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి తమన్నా భాటియా వంటి పాన్-ఇండియా స్టార్‌ను ఎంపిక చేయడం సరైన నిర్ణయం అని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.