Nayanthara: మెగా 157లో నయనతార తీసుకునే రెమ్యూనరేషన్ ఇంత తక్కువనా!
అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి కాంబోలో మెగా 157 మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నయనతార హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్టు అనిల్ రావిపూడి ఇటీవల తెలిపారు. మూవీ ప్రమోషన్‌ను స్టార్ట్ చేసి సరికొత్తగా వీడియోతో హీరోయిన్ ను పరిచయం చేశారు.

Nayanthara: అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి కాంబోలో మెగా 157 మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నయనతార హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్టు అనిల్ రావిపూడి ఇటీవల తెలిపారు. మూవీ ప్రమోషన్‌ను స్టార్ట్ చేసి సరికొత్తగా వీడియోతో హీరోయిన్ ను పరిచయం చేశారు. అయితే ఈ మూవీకి నయనతార చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల జాబితాలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో కూడా నయనతార వరుస సినిమాలు చేస్తోంది. అయితే ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకు రూ.12 కోట్లు తీసుకుంటుంది. కానీ ఈ మెగా 157 మూవీకి అయితే కేవలం రూ.6 కోట్లుకు ఓకే చేసినట్లు తెలుస్తోంది. మొదటి నయనతార ఒప్పుకోలేదు. కానీ ఒక్క ఫ్లాప్ లేని అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో సినిమా చేస్తే కెరీర్‌కు బాగా ఉపయోగపడుతుందని భావించి రూ.6 కోట్లుకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నయనతార తీసుకునే రెమ్యూనరేషన్‌లో ఇదే తక్కువని టాక్ వినిపిస్తోంది.
Read Also: జాక్ పాట్ కొట్టిన తమన్నా.. ఆ బ్రాండ్ కు ఏకంగా రూ. 6.20 కోట్లు!
ఇదిలా ఉండగా నయనతార, చిరంజీవి సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ లో నటించారు. మళ్లీ ఈ కాంబోలో హిట్ పడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఈసారి మళ్లీ హ్యాట్రిక్ కొట్టడానికే నయనతారను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అనిల్ రావిపూడి మూవీ ప్రమోషన్ అయితే అదుర్స్. హలో మాస్టారు.. కెమెరా కొద్దిగా రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా అని ఆమెను టీమ్‌లో ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఇలా ఎంట్రీ వీడియోనే ఇలా ఉంటే ఇంకా సినిమా ఎలా ఉంటుందని నెటిజన్లు అంటున్నారు. అనిల్ రావిపూడి, చిరంజీవి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి సాహు గారపాటి, చిరంజీవి తనయ సుస్మిత నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ఇద్దరు కథానాయికలు కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఓ పాత్ర కోసం అదితిరావు హైదరిని కూడా సంప్రదించారని టాక్ వినిపిస్తోంది. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది. అనిల్ రావిపూడి ప్రతీ ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ చేస్తారు. ప్రతీ సారి హిట్ కొడుతుంటారు. ఇప్పటి వరకు అనిల్ రావిపూడికి సినిమా ఫ్లాప్ అయిన టాక్ అయితే లేదు. తీసిన అన్ని సినిమాలు కూడా హిట్ అయ్యాయి. అన్ని మంచి కలెక్షన్లను రాబట్టాయి. ఈ సంక్రాంతికి కూడా సినిమా హిట్ పడటం ఖాయం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
-
Actress Tamanna : జాక్ పాట్ కొట్టిన తమన్నా.. ఆ బ్రాండ్ కు ఏకంగా రూ. 6.20 కోట్లు!
-
Megastar Chiranjeevi: చిరంజీవి మళ్లీ ఆశ్చర్యపరిచాడు.. అసలు ఊహించని పని చేశాడు
-
Trivikram Bumper Offer: రుక్మిణి వసంత్‌కు త్రివిక్రమ్ బంపర్ ఆఫర్?
-
Peddi: పెద్ది’ మూవీతో రామ్ చరణ్, బుచ్చి బాబు ఆశలన్నీ ఈ సినిమాపైనే!
-
TEST Movie Review Telugu: టెస్ట్ మూవీ రివ్యూ.. మ్యాచ్ ఫిక్సింగ్ స్టోరీతో మెప్పించారా?
-
Tollywood Heroine: డాక్టర్ గా చేస్తూనే హీరోయిన్ గా కూడా ఫుల్ క్రేజ్.. ఫోటోలో బొద్దుగా ఉన్న ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే..