Trivikram Bumper Offer: రుక్మిణి వసంత్‌కు త్రివిక్రమ్ బంపర్ ఆఫర్?
టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే హీరోయిన్ రుక్మిణి వసంత్. 'సలార్' వంటి భారీ హిట్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'డ్రాగన్'లో హీరోయిన్‌గా ఎంపికైన రుక్మిణి, ఇప్పుడు మరికొన్ని పెద్ద ప్రాజెక్టుల ఆఫర్‌లతో వార్తల్లో నిలుస్తోంది.

Trivikram Bumper Offer: టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే హీరోయిన్ రుక్మిణి వసంత్. ‘సలార్’ వంటి భారీ హిట్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘డ్రాగన్’లో హీరోయిన్‌గా ఎంపికైన రుక్మిణి, ఇప్పుడు మరికొన్ని పెద్ద ప్రాజెక్టుల ఆఫర్‌లతో వార్తల్లో నిలుస్తోంది. రుక్మిణి వసంత్ ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్ – జూనియర్ ఎన్టీఆర్ చిత్రంలో ( ‘డ్రాగన్’) నటిస్తోంది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండటం, అలాగే రుక్మిణి కీలక పాత్రలో నటిస్తుండటంతో నిర్మాతలు ఆమెతో ఒక ‘ఎక్స్‌క్లూజివ్ కాంట్రాక్ట్’ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే, ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నంత కాలం, ఆమె ఇతర చిత్రాలకు సంతకం చేయడానికి అనుమతి లేదు.
సాధారణంగా, ఇలాంటి ప్రత్యేక ఒప్పందాలు (exclusive contracts) నటీనటులు ఇతర సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ పాడుచేస్తుంటాయి. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ‘డ్రాగన్’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నప్పటికీ, రుక్మిణి వసంత్ ఇప్పుడు మరికొన్ని పెద్ద చిత్రాల కోసం పరిశీలనలో ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వెంకటేష్ తదుపరి చిత్రం. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు. త్రివిక్రమ్ ఇప్పటికే రుక్మిణికి కథను వినిపించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Read Also: MBBS చదవాలంటే ఎంత రుణం గరిష్టంగా పొందవచ్చంటే?
అంతేకాకుండా, సోషల్ మీడియాలో మరో పుకారు కూడా బాగా ప్రచారంలో ఉంది. ‘యాని
మల్’ వంటి సంచలన చిత్రం తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న ‘స్పిరిట్’ సినిమాలో కూడా రుక్మిణితో సంప్రదింపులు జరుగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు కూడా భారీ చిత్రాలు, తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నవి.
ఇక్కడ తలెత్తే అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే – ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమాతో ‘ఎక్స్‌క్లూజివ్ కాంట్రాక్ట్’ పై సంతకం చేసిన రుక్మిణి, ఈ కొత్త ప్రాజెక్టులను ఒప్పుకుంటుందా ? ఆమె కాంట్రాక్ట్ షరతులు ఏమిటి? ఈ ఆఫర్లపై ‘డ్రాగన్’ నిర్మాతలు, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలా స్పందిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: వర్షం పడినట్లు కలలో వస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో నిర్మాణ సంస్థలు రుక్మిణి ఇతర ప్రాజెక్టులు చేసేందుకు అనుమతిస్తాయి. అయితే, ఆయా సినిమాల షూటింగ్ షెడ్యూల్స్‌కు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అలాగే, నిర్మాణ సంస్థలకు నష్టాలు వాటిల్లకుండా కొన్ని నిబంధనలు ఉంటాయి. ‘డ్రాగన్’ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఏప్రిల్ 22, 2025న కర్ణాటకలో ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నారు. వాస్తవానికి, ఈ చిత్రం మొదటి గ్లింప్స్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజున విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ‘వార్ 2’కి సంబంధించిన ప్రకటన రావడంతో అది వాయిదా పడింది. రుక్మిణి వసంత్ కెరీర్‌లో ఇది ఒక కీలక దశ. ఆమె ఈ భారీ ఆఫర్లను ఎలా డీల్ చేస్తుందో చూడాలి.
-
Nayanthara: మెగా 157లో నయనతార తీసుకునే రెమ్యూనరేషన్ ఇంత తక్కువనా!
-
Actress Tamanna : జాక్ పాట్ కొట్టిన తమన్నా.. ఆ బ్రాండ్ కు ఏకంగా రూ. 6.20 కోట్లు!
-
Megastar Chiranjeevi: చిరంజీవి మళ్లీ ఆశ్చర్యపరిచాడు.. అసలు ఊహించని పని చేశాడు
-
Trivikram-Poonam Kaur: త్రివిక్రమ్‌పై మరోసారి మండిపడ్డ పూనమ్.. నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ..!
-
Peddi: పెద్ది’ మూవీతో రామ్ చరణ్, బుచ్చి బాబు ఆశలన్నీ ఈ సినిమాపైనే!
-
Sitara Zameen Par Trailer: వచ్చేసిన సితారే జమీన్ పర్ ట్రైలర్.. చూసేయండి!