Hari Hara Veera Mallu Movie Postponed: పవన్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. మరోసారి సినిమా వాయిదా

Hari Hara Veera Mallu Movie Postponed: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీర మల్లు సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. ఎప్పటి నుంచో పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ‘హరి హర వీర మల్లు’ విడుదల మరోసారి వాయిదా పడటంతో నిరాశ చెందారు. జూన్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకున్న సమయానికి థియేటర్లలోకి రావడం లేదని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2020లో షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి, కరోనా మహమ్మారి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ పనుల వల్ల అనేక సార్లు షూటింగ్ ఆగిపోయింది. దీనివల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ వాయిదా పడటానికి ప్రధాన కారణాలు గ్రాఫిక్స్ (VFX) పనులు, అలాగే ఆర్థిక సమస్యలు అని తెలుస్తోంది. సినిమా గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదని, వాటికి సంబంధించిన చెల్లింపులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. దీనివల్ల పోస్ట్-ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా వల్ల నిర్మాత ఏ.ఎం. రత్నంకు ఆర్థికంగా భారం అవుతోంది. ఈ సినిమాపై బజ్ కూడా తక్కువగా ఉండటం, గతంలో ఏ.ఎం. రత్నం సినిమాలకు సంబంధించిన బకాయిలు ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లు సినిమాను కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. జూన్ 12 లోపు సినిమా విడుదల కాకపోతే డీల్ విలువలో రూ.20 కోట్లు తగ్గించాలని అమెజాన్ కోరుతోందని సమాచారం. తమ శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, జూన్ 12న సినిమాను విడుదల చేయలేకపోతున్నామని, పవన్ కళ్యాణ్ స్థాయికి తగినట్లుగా సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు మరికొంత సమయం కావాలని మేకర్స్ కోరారు.
‘హరి హర వీర మల్లు’ గ్రాండ్ థియేట్రికల్ ట్రైలర్ త్వరలోనే రాబోతుంది. దీంతో పాటు కొత్త విడుదల తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. ఈ ట్రైలర్ సినిమా స్థాయిని, కథను చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి, ఏ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. బాబీ డియోల్ ప్రధాన విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా జ్ఞాన శేఖర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏ.ఎం. రత్నం సమర్పణలో ఏ. దయాకర్ రావు ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘హరి హర వీర మల్లు’ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. ఇకనైనా రిలీజ్ అవుతుందా? లేదా? అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చూడండి: ENG vs IND: త్వరలోనే ఇంగ్లాండ్ సిరీస్.. ఫైనల్ జట్టు ఇదే
-
Hari Hara Veera Mallu Review: హరి హర వీరమల్లు రివ్యూ.. ఎలా ఉందంటే..
-
Hari Hara Veera Mallu Kannada: ‘హరిహరవీరమల్లు’’సినిమాకు కర్ణాటకలో షాక్
-
Hari Hara Veera Mallu Facts: పవన్ కళ్యాణ్ హిట్ కొడతాడా.. హరిహర వీరమల్లు మూవీ గురించి ఆసక్తికర విషయాలు
-
Hari Hara Veera Mallu Pre Release Event: మనల్నెవడ్రా ఆపేది.. పవన్ కళ్యాణ్ స్పీచ్ వీడియో వైరల్
-
Ustaad Bhagat Singh Shooting Video: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ వీడియో లీక్.. పవన్ కళ్యాణ్ లుక్స్ వైరల్
-
Pawan Kalyan AP CM: ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్?!