Peddi: పెద్ది’ మూవీతో రామ్ చరణ్, బుచ్చి బాబు ఆశలన్నీ ఈ సినిమాపైనే!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో చిరంజీవి సాధించిన గొప్ప విజయాలు చాలానే ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడున్న రోజుల్లో అయితే చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చే హీరోలు అయితే ఎవరూ లేరు

Peddi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో చిరంజీవి సాధించిన గొప్ప విజయాలు చాలానే ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడున్న రోజుల్లో అయితే చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చే హీరోలు అయితే ఎవరూ లేరు. ఒకప్పుడు నందమూరి తారక రామారావు సినీ ఇండస్ట్రీలో గొప్ప విజయాలు సాధించిన వారి ప్లేస్‌లో టాప్‌లో ఉండగా ఇప్పుడు చిరంజీవి ఉన్నారు. మెగాస్టార్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న రామ్ చరణ్(Ram Charan) కూడా మంచి సినిమాలు చేస్తూ తండ్రి బాటలో వెళ్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ మూవీతో ఏకంగా గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. కాకపోతే ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ పెద్దగా హిట్ కాలేదు. డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈసారి వచ్చే సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని రామ్ చరణ్ భావిస్తున్నాడు. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని బుచ్చిబాబు ఇప్పటికే చాలా మార్లు చెప్పాడు. ‘ఉప్పెన’ మూవీతో హిట్ కొట్టిన బుచ్చిబాబు రామ్ చరణ్‌తో హిట్ కొడతాడా? లేదా? అనే ఆలోచన చాలా మంది మెగా ఫ్యాన్స్‌కి సందేహం ఉంది.
Read Also: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మట్టిలో కలిసిపోవడం గ్యారెంటీ!
పెద్ది గ్లింప్స్‌తో బుచ్చిబాబు అందరి సందేహాలను కూడా తీర్చేశాడని చెప్పవచ్చు. ఎందుకంటే గ్లింప్స్‌లో ఊర మాస్‌గా రామ్ చరణ్‌ను బుచ్చిబాబు చూపించాడు. గ్లింప్స్ అయితే అదిరిపోయాయి. రామ్ చరణ్‌ను ఎప్పుడూ చూపించని ఒక పాత్రలో చూపించనున్నట్లు తెలిసింది. దీంతో సినిమా పక్కాగా హిట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే రామ్ చరణ్ పెద్ది మూవీ బ్లాక్ బస్టర్ అయితే మంచి అవకాశాలు ఇంకా వస్తాయని, చిరంజీవిలానే పేరు సంపాదించుకుంటాడని టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమా విజయం సాధిస్తే.. బుచ్చిబాబుకి కూడా మంచి అవకాశం రానుంది. తర్వాత సినిమా స్టార్ హీరోతో చేసే అవకాశం ఉన్నట్లు మూవీ వర్గాలు చెబుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బుచ్చిబాబు ఆశలన్నీ ఈ సినిమా మీదనే. కేవలం బుచ్చిబాబువి మాత్రమే కాదు.. రామ్ చరణ్ ఆశలు కూడా ఈ సినిమాపైనే. ఎందుకంటే ఇప్పటికే రామ్ చరణ్ మూవీ కాగా.. మళ్లీ ఈ సినిమా హిట్ కాకపోతే ఆఫర్లు ఎలా ఉంటాయనే ఈ సినిమా హిట్ కావాలని భావిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే రామ్ చరణ్‌తో పాటు బుచ్చిబాబుకి కూడా మంచి అవకాశాలు రానున్నాయి. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటీ కావాలంటే మాత్రం తప్పకుండా బుచిబాబుకి పెద్ది సినిమా హిట్ కావాల్సిందే. మరి ఈ సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా కనుక హిట్ అయితే బుచ్చిబాబు, రామ్ చరణ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోతుందని చెప్పడంలో అసలు సందేహం లేదు.
-
Nayanthara: మెగా 157లో నయనతార తీసుకునే రెమ్యూనరేషన్ ఇంత తక్కువనా!
-
Actress Tamanna : జాక్ పాట్ కొట్టిన తమన్నా.. ఆ బ్రాండ్ కు ఏకంగా రూ. 6.20 కోట్లు!
-
Megastar Chiranjeevi: చిరంజీవి మళ్లీ ఆశ్చర్యపరిచాడు.. అసలు ఊహించని పని చేశాడు
-
Trivikram Bumper Offer: రుక్మిణి వసంత్‌కు త్రివిక్రమ్ బంపర్ ఆఫర్?
-
War 2 Movie: ‘వార్ 2’ నుంచి ఎన్టీఆర్ డైలాగ్‌లు లీక్.. థియేటర్లలో గూస్‌బంప్సే