War 2 Movie: ‘వార్ 2’ నుంచి ఎన్టీఆర్ డైలాగ్‌లు లీక్.. థియేటర్లలో గూస్‌బంప్సే
వార్ 2 మూవీ కోసం అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఎంతగానో ఎదురు చూస్తోంది. బాలీవుడ్ కంటే టాలీవుడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. ఎన్టీఆర్ పుట్టిన రోజున వార్ 2కి సంబంధించి టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఇటీవల హృతిక్ రోషన్ ట్విట్టర్‌లో ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్ చేశాడు.

War 2 Movie: వార్ 2 మూవీ కోసం అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఎంతగానో ఎదురు చూస్తోంది. బాలీవుడ్ కంటే టాలీవుడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. ఎన్టీఆర్ పుట్టిన రోజున వార్ 2కి సంబంధించి టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఇటీవల హృతిక్ రోషన్ ట్విట్టర్‌లో ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్ చేశాడు. షూటింగ్ అన్ని ప్రారంభమయ్యాయి. కానీ ఈ సినిమా గురించి ఫ్యాన్స్‌కు మాత్రం మూవీ టీం ఎలాంటి అప్టేట్ కూడా ఇవ్వలేదు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల హృతిక్ రోషన్ ట్వీట్టర్‌లో.. ఎన్టీఆర్ ఈ నెల 20వ తేదీన ఏం జరగబోతుందో తెలుసా? నువ్వు కలలో కూడా ఊహించనది నా దగ్గర ఉంది. రెడీగా ఉన్నావా? అని ట్వీట్ చేశారు. దీనికి ఎన్టీఆర్ కౌంటర్ ఇస్తూ ‘రిటర్న్ గిఫ్ట్ కోసం సిద్ధంగా ఉండు బ్రదర్’ అని డైలాగ్ వేస్తాడు. అయితే టీజర్‌లో కూడా ఇలాంటి డైలాగ్‌లు ఉంటాయని సమాచారం. ఈ మూవీలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమా మొత్తం నెగిటివ్ పాత్ర లేకపోతే కొంతవరకు మాత్రమే అనే విషయంపై క్లారిటీ లేదు.
Read Also: వీరంతా అదృష్టవంతులు లేరు.. జీవితాంతం సుఖమయమే
ఎన్టీఆర్ క్యారక్టర్‌పై ఈ స్పై యూనివర్స్ నుంచి కూడా ఓ స్పెషల్ మూవీ వస్తున్నట్లు తెలుస్తోంది. అంటే స్పై యూనివర్స్ మొత్తానికి విలన్‌గా ఉంటాడా? లేకపోతే క్యారక్టర్‌లో ఏమైనా ఛేంజస్ ఉంటాయా? అనే విషయాలు అనేవి క్లారిటీగా తెలియదు. అయితే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య కొన్ని సన్నివేశాలు తప్పకుండా గూస్ బంప్స్ వస్తాయని అంటున్నారు. వీరిద్దరి కాంబోలో సినిమా అయితే అదిరిపోతుందని నెటిజన్లు అంటున్నారు. ఈ సినిమా యాష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌లో వస్తోంది. హృతిక్ రోషన్, RRR స్టార్ జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీన మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ పుట్టిన రోజున ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి కూడా అప్డే్ట్ రానుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Read Also: తవ్వకాల్లో బయటపడ్డ వింత… కూర్చున్న భంగిమలో 1000ఏళ్ల నాటి సమాధి బాబా
ఇదిలా ఉండగా వార్ మూవీ సిద్ధార్థ్ ఆనంద్, హృతిక్ రోషన్ కాంబోలో 2019లో వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ ఏడాది రిలీజ్ అయిన మూవీస్‌లో వార్ మూవీ బిగ్గెస్ట్ హిట్ సాధించింది. అయితే ఈ మూవీలో టైగర్ ష్రాఫ్, వాణి కపూర్ నటించారు. అయితే ఈ సినిమా హిట్ కావడంతో దీనికి సీక్వెల్ తీయాలని నిర్మాతలు ప్రకటించారు. ఈ క్రమంలో అప్పటి నుంచి ఫ్యాన్స్ ఎంతగానో ఈ వార్ 2 మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వార్ 2 మూవీని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. వార్ 2 మూవీ గురించి అప్డేట్ ఎప్పుడు వస్తుందో? చూడాలి.