War 2 : వార్ 2 టీజర్ రివ్యూ: భీకరంగా ఎన్టీఆర్.. రా ఏజెంట్ గా బ్లాక్ బస్టర్ లోడింగ్ అంతే!
2019లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'వార్' సీక్వెల్ 'వార్ 2' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటి. యష్ రాజ్ ఫిల్మ్స్ (వైఆర్‌ఎఫ్) స్పై యూనివర్స్‌లో ఇది ఆరో చిత్రం. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ మళ్లీ కబీర్ పాత్రలో కనిపించనుండగా, జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లోకి అడుగుపెడుతున్నారు.

War 2 : 2019లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘వార్’ సీక్వెల్ ‘వార్ 2’ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటి. యష్ రాజ్ ఫిల్మ్స్ (వైఆర్‌ఎఫ్) స్పై యూనివర్స్‌లో ఇది ఆరో చిత్రం. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ మళ్లీ కబీర్ పాత్రలో కనిపించనుండగా, జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లోకి అడుగుపెడుతున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘వార్ 2’ (WAR 2) నుంచి అప్‌డేట్ వస్తుందని ప్రకటించడంతో ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడా క్షణం వచ్చేసింది. ‘వార్ 2’ టీమ్ టీజర్‌ను యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ (NTR) పవర్‌ఫుల్‌గా కనిపించారు. నా గురించి తెలియదేమో.. ఇప్పుడు తెలుసుకుంటావ్.. అంటూ ఎన్టీఆర్ డైలాగ్ ఉన్న టీజర్ ఆకట్టుకుంటోంది.
Read Also: పెళ్లిలో అల్లుడి కాళ్లు కడగడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి?
దాదాపు 150 రోజుల పాటు జరిగిన ఈ సినిమా షూటింగ్ ఇండియాలోనే కాకుండా మరో ఐదు వేర్వేరు దేశాల్లో జరిగింది. ఇందులో ఏకంగా ఆరు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయట. సినిమా యూనిట్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘వార్ 2’ చిత్రీకరణ దాదాపు 150 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగింది. దర్శకుడు అయాన్ ముఖర్జీ 2024 ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలను స్పెయిన్, ఇటలీ, అబుదాబి, జపాన్, రష్యా, భారత్ వంటి ఆరు వేర్వేరు దేశాల్లో చిత్రీకరించారు. ముంబైలో కూడా కొన్ని సీన్లు తీశారు. సినిమాలోని ఎక్కువ భాగం రియల్ లొకేషన్లలోనే షూట్ చేశారు. ప్రస్తుతం హృతిక్, జూనియర్ ఎన్టీఆర్‌లపై ఒక పాటను చిత్రీకరించాల్సి ఉంది. ఇది మరో 6-7 రోజుల్లో పూర్తి కానుంది.
https://x.com/tarak9999/
హృతిక్ రోషన్‌కు ఒక పాట కోసం రిహార్సల్ చేస్తుండగా కాలికి గాయమైందని, డాక్టర్లు ఆయనకు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో షూటింగ్ ఆగిపోయిందని తెలిసింది. అయితే, హై-ఎనర్జీతో ఉండే ఈ పాటను ఈ నెలలో చిత్రీకరిస్తారని సమాచారం. సినిమాలోని మ్యూజిక్ ఆల్బమ్‌లో రెండు పాటలు ఉండబోతున్నట్లు యూనిట్ తెలిపింది. ఈ పాటల షూటింగ్ జూన్ చివరి వారంలో ఉంటుంది. ఒక పాట హృతిక్, జూనియర్ ఎన్టీర్‌ల మధ్య వచ్చే అదిరిపోయే డాన్స్ నంబర్, దీనికి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. మరొక పాట హృతిక్, హీరోయిన్ కియారా అద్వానీ మధ్య వచ్చే ఒక మెలోడీ సాంగ్. ఈ రెండు పాటలు కూడా చార్ట్‌బస్టర్‌లుగా నిలుస్తాయని భావిస్తున్నారు.
https://www.youtube.com/watch?
ఇది ఒక యాక్షన్ మూవీ కాబట్టి, థియేటర్లలో ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్ ఖచ్చితంగా ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో ఏకంగా ఆరు పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. సముద్రంలో షిప్‌ల మధ్య యాక్షన్, కార్, బైక్ ఛేజింగ్ వంటి సీన్లు సినిమాకే హైలెట్ గా నిలవబోతున్నాయి. ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం 2025 ఆగస్టు 14న విడుదల కావడానికి రెడీగా ఉంది. హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరి పాత్రలు చాలా పవర్ఫుల్‌గా ఉండబోతున్నాయి. ప్రేక్షకులు వారిని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని లుక్ లో చూడబోతున్నారు.