Ram Charan And NTR: పెళ్లి తర్వాత పవన్, రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన మొదటి సినిమా ఏదో తెలుసా.. హిట్టా లేదా ఫ్లాపా..

Ram Charan And NTR:
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు త్వరగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఆ హీరోలు చేసిన మొదటి సినిమా పైన చాలామంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు చిన్నవయసులోనే త్వరగా పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రేక్షకులు తమకు ఇష్టమైన హీరోలు పెళ్లి తర్వాత చేసిన మొదటి సినిమా ఏంటో ఆ సినిమా విజయం సాధించిందో లేదో అనే దానిమీద ఫుల్ ఫోకస్ చేస్తారు. మనం ఇప్పుడు టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి తర్వాత చేసిన మొదటి సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు సినిమాలతో మరియు ఏపీ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను నెరవేరుస్తూ బిజీగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ హీరోయిన్ రేణు దేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని సంగతి అందరికీ తెలిసిందే.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్ రేణు దేశాయిని పెళ్లి చేసుకున్న తర్వాత కొమరం పులి అనే సినిమాలో నటించారు.
అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అలాగే పవన్ కళ్యాణ్ అంజన లెజినోవా ను పెళ్లి చేసుకున్న తర్వాత గోపాల గోపాల అనే సినిమాలో నటించారు. గోపాల గోపాల సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయం సాధించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తర్వాత రామ్ చరణ్ పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన పెళ్లి 2012 జూన్ లో జరిగింది. పెళ్లి తర్వాత రామ్ చరణ్ నాయక్ సినిమాలో ద్విపాత్రాభినయంలో నటించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎన్టీఆర్ నిన్ను చూడాలని అనే సినిమాతో 2001లో ప్రేక్షకుల ముందుకు అయితే ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచినప్పటికీ ఆ తర్వాత జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రణతి వివాహం 2012లో జరిగింది. వీరి పెళ్లి తర్వాత ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమా రిలీజ్ అయ్యే బాక్సాఫీస్ దగ్గర హిట్ సాధించింది.