Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Ntr Neel Movie Action Scene Set Up

NTR Neel Movie: భారీ యాక్షన్ సీక్వెన్స్.. ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ ఇంత ప్లాన్ చేశాడా?

NTR Neel Movie: భారీ యాక్షన్ సీక్వెన్స్.. ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ ఇంత ప్లాన్ చేశాడా?
  • Edited By: kusuma,
  • Updated on June 5, 2025 / 04:01 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

NTR Neel Movie: ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో మూవీ త్వరలోనే రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీలో ఒక భారీ యాక్షన్ సీన్ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను త్వరలోనే చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. వంద లేదా రెండు వందల మంది కాదు.. ఏకంగా 2 వేల మంది కంటే ఎక్కువ మందితో సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో అద్భుతమైన సెట్‌ను రూపొందించినట్లు సమాచారం. అయితే మూవీలో ఈ సీన్ హైలైట్‌గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడంలో ఎప్పుడూ ముందుంటారు. అయితే ఈ సీన్ కూడా అలాగే నిలుస్తుందట. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి సినిమాల్లో ప్రశాంత్ నీల్ సృష్టించిన యాక్షన్ విజువల్స్ ఫ్యాన్స్‌ను అబ్బురపరిచాయి. ఇప్పుడు ఎన్టీఆర్‌తో కలిసి ఇంకెంత భారీ స్థాయిలో యాక్షన్ సీన్లు ఉంటాయో చూడాలి. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా కొత్త లుక్‌లోకి మారినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ మరింత ఫిట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా దాదాపుగా రూ.360 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై ఈ మూవీ రాబోతుంది. దీన్ని కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Thug Life Movie : భారీ అంచనాలతో ‘థగ్ లైఫ్’ విడుదల.. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే

వచ్చే ఏడాది జూన్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, భువన్ గౌడ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ప్రణవ్ శ్రీ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. పీరియడ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో హీరోయిన్ ఎవరనే విషయం ఇంకా మూవీ టీం ప్రకటన చేయలేదు. మలయాళ నటుడు టోవినో థామస్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ దేవరలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. మరి వీరిద్దరి కాంబోలో మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

Tag

  • Cinema news
  • Latest Movie
  • Movie Action Scenes
  • Neel
  • NTR
Related News
  • War 2 Movie: ‘వార్ 2’ నుంచి ఎన్టీఆర్ డైలాగ్‌లు లీక్.. థియేటర్లలో గూస్‌బంప్సే

  • NTR : ‘వార్ 2’ మాత్రమే కాదు.. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో ఎన్టీఆర్

  • Rashmika Mandanna: రష్మిక ఆస్తులు తెలిస్తే.. షాక్ కావాల్సిందే

  • Ram Charan And NTR: పెళ్లి తర్వాత పవన్, రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన మొదటి సినిమా ఏదో తెలుసా.. హిట్టా లేదా ఫ్లాపా..

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us