Rashmika Mandanna: రష్మిక ఆస్తులు తెలిస్తే.. షాక్ కావాల్సిందే

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ కాలంలోనే సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. కన్నడ భామ అయిన రష్మిక కిరాక్ పార్టీ సినిమాతో ఆ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఒక్క భాషలోనే నటించే రష్మిక ఇప్పుడు అన్ని భాషల్లోనూ నటిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్‌ను ఏలుతుంది. ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు రష్మిక చేతుల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం రష్మిక ఫుల్ బిజీగా ఉంది. గతేడాది పుష్ప 2 సినిమాతో హిట్ కొట్టింది. పుష్ప సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. పుష్ప సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన పుష్ప 2 మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. శ్రీవల్లి పాత్రలో రష్మిక జీవించేసింది. ఆమె రోల్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. ఇటీవల బాలీవుడ్‌లో చావా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కడ మంచి టాక్ రావడంతో తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా మంచి హిట్ టాక్ సంపాదించుకోవడంతో పాటు కలెక్షన్లు రాబట్టింది. ఇలా ప్రతీ మూవీలో తనకి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంది. అయితే రష్మికకి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఎంతో కష్టపడి పైకి వచ్చిన రష్మికకు ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. అసలు రష్మికకు ఉన్న ఆస్తులు ఎంతో తెలిస్తే షాక్ అవుారు.
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రష్మికకు వరుస ఆఫర్లు ఉన్నాయి. ఆమె రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే తీసుకుంటుంది. అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక ఒకరు. అయితే ఈమె మొత్తం ఆస్తుల విలువ దాదాపుగా రూ.66 కోట్లు ఉంటుందట. రష్మిక ఒక్కో సినిమాకు రూ.4 నుంచి 8 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాకి మాత్రం ఎక్కువగానే ఒక రూ.10 కోట్ల వరకు తీసుకుందట. కేవలం సినిమాలే కాకుండా యాడ్స్, ప్రమోషన్స్ చేస్తుంది. వీటితో పాటు కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తోంది. వీటి ద్వారా ఈమెకు బాగానే డబ్బులు వస్తున్నాయి. రష్మికకు బెంగళూరులో 8 కోట్ల విలువ చేసే బంగ్లా కూడా ఉంది. అక్కడే కాకుండా హైదరాబాద్, ముంబై, గోవాలో కూడా భారీగా ఆస్తులు ఉన్నాయి. వీటితో పాటు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఏలుతుంది. వరుస సినిమాలు, హిట్‌లతో రాణిస్తోంది. ప్రస్తుతం రష్మిక తెలుగులో కుబేరలో నటిస్తోంది.
సోషల్ మీడియాలో రష్మికకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అన్ని ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా రష్మికకు డబ్బులు వస్తాయి. ప్రస్తుతం బాగా బిజీ ఉన్న హీరోయిన్లలో రష్మిక ఒకరు. అన్ని ఇండస్ట్రీలలో నటిస్తోంది. మంచి స్టోరీలను సెలక్షన్ చేసుకుంటుంది. తెలుగు హీరోయిన్ కాకపోయినా.. తెలుగు ఇండస్ట్రీని ఏలుతుంది. అలాగే బాలీవుడ్‌ను కూడా ఏలుతుంది. వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది.
-
Exams complete: విద్యార్థులకు పరీక్షలు ముగిశాయా.. ఓ కన్నేసి ఉంచండి
-
Concentration: ఏకాగ్రత ఉన్నవారిలో కనిపించే లక్షణాలివే
-
Motorola: రూ.6999 కే 50MP కెమెరా ప్రీమియం లుక్ ఫోన్..!
-
Indian Post: GDS రిజల్ట్స్ వచ్చేసాయ్.. ఇలా చెక్ చేసుకోండి!
-
TVS Jupiter: చీపెస్ట్ స్కూటీ.. ప్రారంభ ధర రూ.53వేలు.. 226కి.మీ గరిష్ట మైలేజ్.. !
-
Lord shiva: సోమవారం ఈ మంత్రం జపిస్తే కష్టాలన్నీ మాయం