Viral Video : స్టైల్ కొట్టబోయి చతికిల పడ్డ బైకర్.. డివైడర్‌పై భయంకర బైక్ ప్రమాదం

Viral Video : ప్రభుత్వాలు రహదారి భద్రతా నియమాలను పాటించాలని ప్రజలను కోరుతూ ఉంటాయి. ప్రజలు తమ వాహనాలను సురక్షితంగా నడపాలని సూచిస్తుంటాయి. రోడ్డు మీద చిన్న పాటి పొరపాటు కూడా ప్రమాదకరంగా మారుతుంది. అయితే, నేటి యువత ఈ విషయాన్ని అస్సలు అర్థం చేసుకోవడం లేదు. వారికి కేవలం తమ గమ్యస్థానానికి తొందరగా చేరుకోవాలనే ఆత్రం తప్ప, భద్రత పట్ల శ్రద్ధ ఉండడం లేదు. ఈ తొందరపాటు వల్ల కొన్నిసార్లు ఎవరూ ఊహించని భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి ఒక ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also:Pawan Kalyan: ఒక్క వార్నింగ్‌తో టాలీవుడ్‌ను కాళ్ల బేరానికి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కొందరు తమ ప్రత్యేకతను చాటుకోవడానికి రకరకాల వీడియోలు పంచుకుంటారు. మరికొందరు తమ ధైర్యాన్ని నిరూపించుకోవడానికి ప్రాణాలను పణంగా పెడతారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోనే చూడండి. ఇందులో ఒక వ్యక్తి బైక్‌పై స్టంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని వెనకాల వస్తున్న స్నేహితుడు కెమెరాలో రికార్డ్ చేస్తున్నాడు. ఇంతలో ఊహించని ప్రమాదం జరిగింది. దాన్ని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.
Read Also:Viral Food Experiment: ఇదేం ప్రయోగం బాబోయ్.. పుచ్చకాయతో పరాఠానా.. మండిపడుతున్న నెటిజన్లు!
వీడియోలో ఒక వ్యక్తి తన బైక్‌ను చాలా వేగంగా నిర్లక్ష్యంగా నడుపుతున్నట్లు కనిపిస్తున్నాడు. ఆశ్చర్యకరంగా, అతనికి రోడ్డుపై ఉన్న కట్ (క్రాసింగ్) కూడా కనిపించలేదు. అతను అదే వేగంతో దూసుకెళ్లాడు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి, భయంకరంగా డివైడర్‌పైకి దూసుకెళ్లి కింద పడిపోయాడు. ఈ మొత్తం దృశ్యాన్ని వెనకాల వస్తున్న మరో బైకర్ తన కెమెరాలో రికార్డ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ప్రజల మధ్య వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ranjeetraiderr15 అనే అకౌంట్ ద్వారా షేర్ చేశారు. దీన్ని వేల మంది లైక్ చేయగా, లక్షల మంది చూశారు. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా, సీరియస్‌గా కామెంట్స్ చేస్తున్నారు.
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు