Viral Food Experiment: ఇదేం ప్రయోగం బాబోయ్.. పుచ్చకాయతో పరాఠానా.. మండిపడుతున్న నెటిజన్లు!

Viral Food Experiment: ఆధునిక కాలంలో ఫుడ్ ఎక్స్పెరిమెంట్ల పేరుతో జరుగుతున్న వింత పోకడలకు అంతు లేకుండా పోతోంది. ప్రజలకు సరికొత్త రుచులు పరిచయం చేయాలనే ఉద్దేశంతో మొదలైన ఈ ట్రెండ్, ఇప్పుడు తమదైన ముద్ర వేసుకోవాలని చూస్తున్న కొంతమంది స్ట్రీట్ వెండర్ల చేతిలో ఫుడ్ తినే పద్ధతులనే మార్చేస్తోంది. ఏది పడితే అది కలిపి, వింతైన వంటకాలను తయారు చేస్తున్నారు. వీటిని తినడం పక్కన పెడితే, కనీసం చూడాలన్నా అబ్బా అనిపించే స్థాయిలో తయారవుతున్నాయి. అలాంటి ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి పుచ్చకాయను ఉపయోగించి ఒక విచిత్రమైన పరాఠా తయారు చేయడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోవడమే కాకుండా, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వేసవిలో శరీరానికి చల్లదనాన్ని, పోషకాలను అందించే పుచ్చకాయను మనం అందరం ఇష్టంగా తింటాం. సాధారణంగా జ్యూస్‌లు, సలాడ్లు, లేదా పండుగా మాత్రమే దీన్ని ఆస్వాదిస్తాం. కానీ, ఎవరైనా ఎప్పుడైనా పుచ్చకాయతో చేసిన పరాఠా గురించి కలలో కూడా ఊహించి ఉండము. అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక దుకాణదారుడు ఇదే చేసి చూపించి అందరినీ నివ్వెరపరిచాడు. ఈ వీడియో చూసిన తర్వాత పండ్లు, పరాఠాలను ఇష్టపడేవారికి కోపం తారాస్థాయికి చేరుకుంది. వీరు ఆ దుకాణదారుడిని ‘ఇదేం దారుణం?’ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.
Read Also:BYD నుంచి చవకైన ఎలక్ట్రిక్ కారు.. రెనో, ఫోక్స్ వ్యాగన్లకు భారీ షాక్
View this post on Instagram
వీడియోలో ఈ వింత పరాఠా తయారీ విధానం చూస్తే ఎవరికైనా షాకింగ్ అనిపించక మానదు. మొదట, షాపు యజమాని పుచ్చకాయలోని గుండ్రటి భాగాన్ని నేరుగా వేడి తవా (పెనం) మీద ఉంచాడు. సాధారణంగా పరాఠాలను కాల్చడానికి మాత్రమే ఉపయోగించే ఈ పెనంపై పుచ్చకాయను ఉంచడం విడ్డూరంగా ఉంది. పరాఠా పిండిని సన్నని పొరగా వత్తి, ఆ పుచ్చకాయ భాగాన్ని కవర్ చేశాడు. దీనితో ఆ వింత పదార్థానికి పరాఠా ఆకారం వచ్చింది. పరాఠాను కాల్చడానికి దానిపై నూనె వేసి, మరింత విచిత్రంగా రుచి కోసం తేనెను జల్లాడు. ఈ కలయిక అస్సలు ఊహించనిది. చివరికి, ఈ విచిత్రమైన పుచ్చకాయ పరాఠా సిద్ధమైంది.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో bhookk_official అనే అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇది వేల సంఖ్యలో వ్యూస్‌ను సంపాదించుకుంది. కామెంట్ సెక్షన్లో ప్రజలు తమ ఆగ్రహాన్ని, అసహ్యాన్ని తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు. “ఇలాంటి పరాఠా అసలు ఎవరు తింటారు బాసు? ఆహారాన్ని ఎందుకు వృథా చేస్తున్నారు?” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఈ పరాఠా తయారుచేసిన వాడికి, తిన్న వాడికి నరకంలో యమరాజు గారు ప్రత్యేకంగా నూనె వేడిచేసి ఉంచుంటారు, ఖాయం!” అని కామెంట్ చేశారు.
Read Also:Viral Video : అవగాహన లోపమా? అమాయకత్వమా? .. ఎలక్ట్రిక్ కారుకు పెట్రోల్ కోసం వెతికిన అమ్మాయి
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు