Viral Video : అవగాహన లోపమా? అమాయకత్వమా? .. ఎలక్ట్రిక్ కారుకు పెట్రోల్ కోసం వెతికిన అమ్మాయి

Viral Video : ఇంటర్నెట్ ప్రపంచంలో ఫన్నీ వీడియోల సందడి ఎప్పుడూ ఉంటుంది. అలాంటి వీడియోలు వైరల్ అయినప్పుడు ప్రజలు వాటిని చూడటమే కాదు తమ ప్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో పంచుకుని తెగ నవ్వుకుంటారు. అలాంటిదే ఒక తమాషా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక అమ్మాయి చేసిన పని చూసి జనం నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఆమె అమాయకత్వం చూసి ఆశ్చర్యపోతున్నారు.
కొంతమంది అబ్బాయిలకు, అమ్మాయిలు కేవలం మేకప్ చేసుకోవడం, షికార్లు తిరగడాన్ని మాత్రమే ఇష్టపడతారు. వారికి కార్ల గురించి ఏమీ తెలియదని ఒక అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోనే చూడండి. ఒక అమ్మాయి తన కారుతో చేసిన పని చూసి, “దేవుడా..ఈ అమ్మాయికి మంచి బుద్దిని ప్రసాదించు!” అని జనం అనుకుంటున్నారు.
Read Also:Hyundai Venue : క్రెటా లుక్‌లో కొత్త హ్యుందాయ్ వెన్యూ.. ఏకంగా రూ.4లక్షలు ఆదా.. ఎలా అంటే ?
how do you buy an electric car without knowing what the electric part means 💀 pic.twitter.com/3HwBwoR1Nr
— internet hall of fame (@InternetH0F) May 23, 2025
వీడియోలో ఒక అమ్మాయి తన అదిరిపోయే ఎలక్ట్రిక్ కారును తీసుకుని పెట్రోల్ బంకుకు చేరుకుంది. కారులో పెట్రోల్ నింపడానికి ఆమె పెట్రోల్ ట్యాంక్ కోసం వెతుకుతుంది. కానీ, ఆమెకు ఎక్కడా ట్యాంక్ కనబడకపోవడంతో నిరాశ చెందుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఒక విషయం స్పష్టమవుతోంది. బహుశా ఈ అమ్మాయికి ఎలక్ట్రిక్ కార్లు పెట్రోల్‌తో కాకుండా విద్యుత్‌తో నడుస్తాయని తెలిసి ఉండకపోవచ్చు. ఆమె ఆ పెట్రోల్ బంకులో పెట్రోల్ ట్యాంక్ కోసం వెతకడం అందరినీ నవ్వు తెప్పించింది.
Read Also:Milk Purity Test : ఇంట్లోనే ఈజీగా కల్తీ పాలను ఎలా గుర్తించాలో ఈ 5చిట్కాలతో తెలుసుకోండి
నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!
ఈ వీడియోను X లో @InternetH0F అనే అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఈ వార్త రాసే సమయానికి వేల మంది ఈ వీడియోను చూశారు. తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. ఒక నెటిజన్ “ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఆ అమ్మాయికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు” అని రాశారు. ఇంకా చాలా మంది నెటిజన్లు ఈ వీడియోపై తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ వీడియో ఒకవైపు నవ్వు తెప్పిస్తున్నా, మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ప్రజల్లో ఇంకా అవగాహన లోపించిందని గుర్తుచేస్తోంది.
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు