Hyundai Venue : క్రెటా లుక్‌లో కొత్త హ్యుందాయ్ వెన్యూ.. ఏకంగా రూ.4లక్షలు ఆదా.. ఎలా అంటే ?

Hyundai Venue : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీలలో ఒకటైన హ్యుందాయ్ మోటార్స్ త్వరలో సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఎంతో ప్రజాదరణ పొందిన తమ కాంపాక్ట్ SUV ‘వెన్యూ’ (Venue) సెకండ్ జనరేషన్ మోడల్‌ను త్వరలో విడుదల చేయబోతుంది. తాజాగా టెస్టింగ్ దశలో కనిపించిన ఈ కొత్త మోడల్ డిజైన్, ఫీచర్ల పరంగా భారీ మార్పులతో రాబోతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యుందాయ్ క్రెటా (Creta) SUV మాదిరిగానే ఈ కొత్త వెన్యూకు లుక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల కస్టమర్లకు క్రెటా ఫీలింగ్‌ను తక్కువ ధరకే పొందే అవకాశం లభించనుంది. ఇది మారుతి (Maruti), టాటా (Tata) వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీనివ్వనుంది.
డిజైన్, ఫీచర్లు:
హ్యుందాయ్ వెన్యూ సెకండ్ జనరేషన్ మోడల్లో అప్డేటెడ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు.
క్రెటా లాంటి లుక్: రాబోయే జనరేషన్ వెన్యూలో హ్యుందాయ్ క్రెటా SUV మాదిరిగానే క్వాడ్-LED హెడ్‌ల్యాంప్‌లు, కనెక్టెడ్ DRLలు (డేటైమ్ రన్నింగ్ లైట్స్) ఉండవచ్చు. హెడ్‌ల్యాంప్‌ల కింద L-ఆకారపు LEDలు ఉండడం, ఇది మొదటి తరం పాలిసేడ్ (Palisade) ఫేస్‌లిఫ్ట్‌ను గుర్తు చేస్తుందని నిపుణులు అంటున్నారు.
కొత్త గ్రిల్ డిజైన్: ప్రస్తుతం ఉన్న ‘పారామెట్రిక్’ గ్రిల్‌ను రెక్టాంగ్యులర్ స్లాట్లతో కూడిన ఓపెన్ యూనిట్‌గా మార్చవచ్చు. ఇది వాహనానికి మరింత బోల్డ్ లుక్ ఇస్తుంది.
అలాయ్ వీల్స్, బ్రేకులు: 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, మందపాటి వీల్ ఆర్చ్ క్లాడింగ్, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్‌లతో కొత్త డిజైన్ ఉండవచ్చు.
వెనుక డిజైన్ : వెనుక భాగంలో రూఫ్ స్పాయిలర్, కొత్త టెయిల్-లైట్లు, బంపర్ మార్పులు ఉండే అవకాశం ఉంది.
Read Also:Milk Purity Test : ఇంట్లోనే ఈజీగా కల్తీ పాలను ఎలా గుర్తించాలో ఈ 5చిట్కాలతో తెలుసుకోండి
కొత్త హ్యుందాయ్ వెన్యూ SUV లో అధునాతన టెక్నాలజీ ఫీచర్లు యాడ్ చేయనున్నారు. ఇవి వినియోగదారులకు మరింత భద్రత, సౌకర్యాన్ని అందిస్తాయి. ఈ కొత్త మోడల్లో కొత్త ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) మాడ్యూల్ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న వెన్యూ లెవెల్ 1 ADAS తో వస్తుంది. అయితే, కొత్త మోడల్‌ను మహీంద్రా XUV 3XO మాదిరిగా లెవెల్ 2 సిస్టమ్‌కు అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఇది లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను అందించగలదు.
కొత్త వెన్యూ క్యాబిన్ గురించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే, ఇందులో కొత్త డాష్‌బోర్డ్ డిజైన్, హ్యుందాయ్ అల్కాజార్ (Alcazar), క్రెటా (Creta) మాదిరిగానే మరిన్ని ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు. వీటిలో ఇన్ఫోటైన్మెంట్, ఇన్స్ట్రుమెంటేషన్ కోసం పెద్ద డిస్ప్లేలు, పనోరమిక్ సన్‌రూఫ్ , వెంటిలేటెడ్ సీట్లు (ventilated seats) ఉండవచ్చు.
Read Also:Instagram: ఈ 5 టిప్స్ తో సైబర్ దాడుల నుంచి మీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను సేఫ్ గా ఉంచుకోండి
త్వరలో విడుదల కానున్న హ్యుందాయ్ వెన్యూ ప్రస్తుత మోడల్లోని మూడు ఇంజన్ ఆప్షన్లను కొనసాగించే అవకాశం ఉంది. అవి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటాయి. ఈ అప్డేటెడ్ మోడల్, క్రెటాకు దగ్గరైన లుక్‌తో వస్తూ రూ. 3-4 లక్షలు తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. ఇది కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో మారుతి బ్రెజా (Brezza), టాటా నెక్సాన్ (Nexon) వంటి వాటికి గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.
-
Mahindra Scorpio-N : టాటా, ఎంజీలకు షాక్.. సరికొత్త సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న మహీంద్రా స్కార్పియో-ఎన్
-
Citroen C3 : స్పోర్టీ లుక్, సరికొత్త కలర్ తో సిట్రోయెన్ C3 స్పోర్ట్ ఎడిషన్ లాంచ్
-
1000cc Cars India : 1000cc ఇంజిన్.. బెస్ట్ మైలేజ్..రూ.10 లక్షలలోపు దొరికే టాప్ 4 కార్లు ఇవే!
-
Renault : యూరప్‌లో సత్తా చాటిన డస్టర్.. ఇండియాలో రీ లాంచ్.. క్రెటా షెడ్డుకే