1000cc Cars India : 1000cc ఇంజిన్.. బెస్ట్ మైలేజ్..రూ.10 లక్షలలోపు దొరికే టాప్ 4 కార్లు ఇవే!

1000cc Cars India : కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా.. మైలేజ్ అదిరిపోవాలి.. ఇంజిన్ కూడా పవర్‌ఫుల్‌గా ఉండాలని అనుకుంటున్నారా.. అయితే సాధారణంగా 1000cc ఇంజిన్ ఉన్న కార్లు 60 నుంచి 75 హెచ్‌పీ (HP) మాక్స్ పవర్‌ను, 95 న్యూటన్ మీటర్ల పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఒకవేళ ఇదే ఇంజిన్‌కు టర్బోఛార్జర్ జతచేస్తే పవర్ ఏకంగా 120 హెచ్‌పీకి, టార్క్ 175 ఎన్ఎమ్కు చేరుకుంటుంది. ఇంత పవర్ఫుల్ ఇంజిన్‌తో పాటు, అద్భుతమైన మైలేజ్‌ను అందించే కార్లు, మీ బడ్జెట్‌కు సరిపోయేలా రూ.10 లక్షల లోపు లభిస్తే ఎలా ఉంటుంది. అలాంటి 4 సూపర్ కార్ల గురించి తెలుసుకుందాం.
1. మారుతి ఆల్టో K10 (Maruti Alto K10):
దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా నుండి వచ్చిన ఈ ఆల్టో K10 ఒక ఎంట్రీ లెవల్ కారు. ఇది 998cc ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 67 బీహెచ్పీ (bhp) మాక్స్ పవర్, 89 న్యూటన్ మీటర్ల పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు అతి పెద్ద ప్రత్యేకత దాని మైలేజ్. లీటర్‌కు 24.39 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. అంతేకాదు, కంపెనీ ఈ కారును సీఎన్జీ (CNG) ఆప్షన్లో కూడా అందిస్తుంది. సీఎన్జీలో అయితే కిలోకు 33.85 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ.4.23 లక్షలు. తక్కువ ధరలో, అద్భుతమైన మైలేజ్‌తో పాటు, నగర ప్రయాణాలకు అనుకూలమైన కారు కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్.
2. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue):
హ్యుందాయ్ నుంచి వచ్చిన ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీలలో వెన్యూ ఒకటి. ఇది 998cc ఇంజిన్‌తో లభిస్తుంది. ఈ ఇంజిన్ టర్బోఛార్జ్డ్ అయి ఉండడం దీని ప్రత్యేకత. ఇది 120 పీఎస్ (PS) మాక్స్ పవర్, 172 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ వెన్యూ లీటర్‌కు 18.31 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ.7.94 లక్షలు. ఎస్యూవీ లుక్, టర్బోఛార్జ్డ్ పవర్, ఆధునిక ఫీచర్లతో కూడిన కారు కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఇందులో 1.2 లీటర్, 1.5 లీటర్ ఇంజిన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
3. మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx):
మారుతి సుజుకి ఇండియా నుండి వచ్చిన ఈ కారు ప్రస్తుతం దేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అవుతున్న ఎస్‌యూవీగా నిలిచింది. ఫ్రాంక్స్ కూడా 998cc టర్బోఛార్జ్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 98 బీహెచ్పీ మాక్స్ పవర్, 147.6 న్యూటన్ మీటర్ల పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు లీటర్‌కు 20 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ.7.54 లక్షలు. స్టైలిష్ డిజైన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, మారుతి బ్రాండ్ నమ్మకంతో కూడిన ఎస్యూవీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
Read Also:Mobile Apps: అన్ఇన్స్టాల్ చేసిన యాప్స్ కూడా మీ డేటాను దొంగిలిస్తున్నాయా? ఇలా స్టాప్ చేయండి
4. రెనాల్ట్ క్విడ్ (Renault Kwid):
ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనాల్ట్ నుంచి వచ్చిన అత్యంత చిన్న కారు క్విడ్. ఇది కూడా 999cc ఇంజిన్‌తో లభిస్తుంది. ఈ ఇంజిన్ 68 బీహెచ్పీ మాక్స్ పవర్, 92.5 న్యూటన్ మీటర్ల పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెనాల్ట్ క్విడ్ లీటర్‌కు 21.7 నుండి 22 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ.4.7 లక్షలు. తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్, ఆధునిక లుక్, పట్టణ ప్రయాణాలకు అనువైన కారు కావాలనుకునే వారికి క్విడ్ ఒక అద్భుతమైన ఆప్షన్.
ఈ నాలుగు కార్లు 1000cc ఇంజిన్‌తో వస్తున్నప్పటికీ, పవర్, మైలేజ్, ఫీచర్లు, ధరలలో వాటికి వాటివే ప్రత్యేకతలు ఉన్నాయి.