Renault : యూరప్‌లో సత్తా చాటిన డస్టర్.. ఇండియాలో రీ లాంచ్.. క్రెటా షెడ్డుకే

Renault : భారతదేశంలో ఇప్పుడు SUVలకు, 7-సీటర్ కార్లకు డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రేజ్‌కి ఒకప్పుడు కారణమైన రూ. 10 లక్షల లోపే లభించే ఒక కారు.. కొన్ని కారణాలతో మార్కెట్ నుంచి దూరమైంది.దాని స్థానాన్ని హ్యుందాయ్ క్రెటా భర్తీ చేసింది. అయితే, ఇప్పుడు ఆ కారు మళ్ళీ ఇండియాకు రాబోతోంది. అది కూడా క్రెటాతో తలపడేందుకు రెనాల్ట్ కంపెనీ రెడీగా ఉంది. ఇటీవల యూరప్‌లో కూడా తన సత్తా చాటిన ఈ కారు ఇండియన్ మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉంది.
ఆ కారు మరేదో కాదు.. రెనాల్ట్ డస్టర్. ఒకప్పుడు ఇండియన్ మార్కెట్లో రూ. 10 లక్షల లోపే లభించే ఈ కారు, తక్కువ ధరలోనే మంచి ఫీచర్లను అందించేది. ఇప్పుడు ఈసారి దీని ధర కొద్దిగా పెరగొచ్చు. 2022 వరకు భారతదేశంలో లభించిన ఈ కారు, వచ్చే ఏడాది (2026) ప్రారంభం నాటికి తిరిగి ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఈ కారును 7-సీటర్ ఆప్షన్లో కూడా లాంచ్ చేయొచ్చని తెలుస్తోంది. ఈ కారుకు యూరప్‌లో కూడా మంచి డిమాండ్ ఉంది.
యూరో NCAPలో 3-స్టార్ సేఫ్టీ రేటింగ్
కొత్త తరం రెనాల్ట్ డస్టర్‌కు యూరప్‌లో క్రాష్ సేఫ్టీ టెస్టింగ్ నిర్వహించారు. అక్కడ దీని 5-సీటర్ వెర్షన్‌ను డాసియా డస్టర్ అని పిలుస్తారు. యూరో NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 3-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ఇక దీని 7-సీటర్ వెర్షన్ డాసియా బిగ్స్టర్కు కూడా సేఫ్టీలో 3-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్ లభించింది. ఈ రేటింగ్ అడల్ట్, పిల్లల భద్రత రెండింటినీ దృష్టిలో ఉంచుకొని ఇచ్చారు.
సేఫ్టీ ఫీచర్లు అదుర్స్
రెనాల్ట్ డస్టర్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్, చైల్డ్ యాంకర్, కట్-ఆఫ్ స్విచ్ వంటి అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు, ఈ కారులో ఆటోనమస్ ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ ఫెసిలిటీ (AEB) కూడా ఉంది. ఇది పరిస్థితులకు అనుగుణంగా ఆటోమేటిక్‌గా బ్రేకులు వేయగలదు. డస్టర్‌లో స్పీడ్ అసిస్టెంట్, లేన్ అసిస్ట్, డ్రైవర్ స్లీప్ డిటెక్షన్ వంటి లెటెస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
Read Also:ITR: ఐటీఆర్ ఫైలింగ్.. జరిమానా లేకుండా ఎప్పటి లోగా రిటర్న్ దాఖలు చేయవచ్చంటే?
టాటా నెక్సాన్, కియా సెల్టోస్‌లకు గట్టి పోటీ
భారతదేశంలో హ్యుందాయ్ క్రెటా లాంచ్ అయినప్పుడు, మార్కెట్లో రెనాల్ట్ డస్టర్ నుంచి ఖాళీ అయిన స్థానాన్ని సద్వినియోగం చేసుకుంది. అయితే, ఇప్పుడు డస్టర్ తిరిగి ఇండియాకు వస్తే, క్రెటాతో పోటీ పడుతుంది. దీంతో పాటు టాటా నెక్సాన్, స్కోడా కుషాక్, కియా సెల్టోస్ వంటి కార్ల నుంచి కూడా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
డస్టర్ గతంలో ఇండియాలో ఉన్నప్పుడు ఇందులో 1.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండేది. ఇది 105 bhp పవర్‌ను, 142 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసేది. ఈ కారులో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఉండేది. అయితే, ఈసారి కొత్త ఇంజిన్ ఆప్షన్లతో రావచ్చు.