Honda : క్రెటా కన్నా ఖరీదైన స్కూటర్ లాంచ్.. ధర ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు తిరగడం ఖాయం

Honda : హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారత మార్కెట్లోకి ఓ సరికొత్త ప్రీమియం స్కూటర్‌ను రిలీజ్ చేసింది. దాని పేరు X-ADV 750. ఇది కేవలం ఒక స్కూటర్ మాత్రమే కాదు. అడ్వెంచర్ బైక్‌లకు దీటుగా వివిధ రకాల భూభాగాల్లో దూసుకెళ్లేలా డిజైన్ చేసిన ‘మ్యాక్సీ-స్కూటర్’. దీని ధర రూ. 11.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. ఇది బేస్ మోడల్ హ్యుందాయ్ క్రెటా (రూ. 11.11 లక్షలు) కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. హోండా 2022లోనే దీని పేటెంట్ కోసం దరఖాస్తు చేయగా ఇప్పుడు అనూహ్యంగా ఈ మోడల్‌ను భారత్‌లో విడుదల చేయడం బైక్ ప్రియులను ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే దీని బుకింగ్‌లు బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో ప్రారంభమయ్యాయి. ఈ బైక్ డెలివరీలు జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి.
హోండా X-ADV 750 కేవలం లుక్స్‌లో మాత్రమే కాదు, ఫీచర్స్‌లో కూడా అడ్వెంచర్ బైక్‌లను తలపిస్తుంది. ఇందులో నకల్గార్డ్స్, 5 పొజిషన్లలో అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, స్పోక్ వీల్స్, డ్యూయల్-స్పోర్ట్ టైర్లు వంటివి ఉన్నాయి. ఇది ఎలాంటి రోడ్లపై అయినా సులభంగా దూసుకెళ్లేలా రూపొందింది. ఇందులో హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC) కూడా ఉంది. ఇది వేర్వేరు రోడ్ పరిస్థితుల్లో బెస్ట్ ట్రాక్షన్ కంట్రోల్‌ను అందిస్తుంది.
Read Also:Viral Video : పిచ్చి పనికి పరాకాష్ట.. సింహం నోట్లో వేలు పెట్టిన యువకుడు.. తర్వాత ఏమైందంటే ?
దీనిలో నాలుగు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి స్టాండర్డ్ (Standard), స్పోర్ట్ (Sport), రెయిన్ (Rain), గ్రావెల్ (Gravel). ఈ మోడ్లు పవర్ డెలివరీ, ఇంజిన్ బ్రేకింగ్, ట్రాక్షన్ కంట్రోల్‌ను రోడ్డు పరిస్థితులకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేస్తాయి. వీటితో పాటు, రైడర్ తన అవసరాలకు తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకోగల యూజర్ మోడ్ (User Mode) కూడా ఉంది.
X-ADVలో 745 cc, లిక్విడ్-కూల్డ్, ట్విన్-సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఇది 6,250 rpm వద్ద 54 bhp పవర్‌ను, 4,750 rpm వద్ద 68 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను హోండా ఆఫ్రికా ట్విన్ తరహాలో 6-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. ఫీచర్ల విషయానికి వస్తే, X-ADV 750లో అడ్వాన్స్డ్ టెక్నాలజీని అందించారు. 5 అంగుళాల TFT డిస్ప్లే (బ్లూటూత్ కనెక్టివిటీతో), స్మార్ట్ కీ, హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్, సీటు కింద 22 లీటర్ల స్టోరేజ్ కంపార్ట్మెంట్ (ఒక పూర్తి సైజు అడ్వెంచర్ హెల్మెట్‌ను కూడా స్టోర్ చేయగల సామర్థ్యం), స్టెప్-అప్ సీటు, 1.2 లీటర్ల గ్లోవ్‌బాక్స్, USB ఛార్జింగ్ పోర్ట్, సెంటర్ స్టాండ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.