ITR: ఐటీఆర్ ఫైలింగ్.. జరిమానా లేకుండా ఎప్పటి లోగా రిటర్న్ దాఖలు చేయవచ్చంటే?

ITR: ప్రతీ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఎవరైనా పన్ను చెల్లింపుదారులు ఈ తేదీ నుంచి రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. గత ఆర్థిక సంవత్సరం 2024- 25 (అసెస్‌మెంట్ సంవత్సరం 2025-26) కోసం తమ ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్)ను పూర్తి చేసుకోవాలి. అయితే ఆదాయపు పన్ను శాఖ గురించి అందరికీ కూడా సరిగ్గా తెలియదు. అయితే పన్ను ఫారమ్‌లు ITR-1 నుంచి ITR-7 వరకు ఎప్పటి వరకు ఐటీఆర్ దాఖలు చేయవచ్చని చాలా మందికి డౌట్ ఉంది. అయితే సాధారణంగా, ఆడిట్ కాని పన్ను చెల్లింపుదారులు ఒక నిర్దిష్ట సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. అన్ని పన్ను చెల్లింపుదారులు సకాలంలో ఐటీఆర్ దాఖలు చేయడానికి తగినంత సమయం ఇవ్వడానికి పన్ను శాఖ గతంలో గడువును పొడిగించింది. కానీ ఇది అన్ని సందర్భాల్లో జరగదు. కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. అయితే మీరు ఐటీఆర్‌ను ముందుగానే దాఖలు చేయడం మంచిది. ఒకవేళ ఎవరైనా గడువును దాటితే డిసెంబర్ 31కి జరిమానా, వడ్డీతో ఆలస్యమైన రిటర్న్‌ను కూడా దాఖలు చేయవచ్చు. ఆడిట్ అవసరం అయ్యే వారు ఈ ఏడాది అక్టోబర్ 31 లోగా ఐటీఆర్‌ని దాఖలు చేయవచ్చు.
Read Also: IPL 2025: రికార్డు సృష్టించిన సూర్య కుమార్ యాదవ్
మీరు గడువు దాటిన తర్వాత పన్ను చెల్లిస్తే అప్‌ఎయిడ్ పన్ను మొత్తంపై నెలకు 1 శాతం లేదా పాక్షిక నెల చొప్పున వడ్డీని చెల్లించాలి. అలాగే ఆలస్యంగా దాఖలు చేసినందుకు జరిమానా కూడా విధిస్తారు. మొత్తం ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూ.1,000, మొత్తం ఆదాయం రూ. 5 లక్షలకు మించి ఉంటే రూ. 5,000 చెల్లించాలి. గడువు తేదీ తర్వాత కానీ డిసెంబర్ 31 లోపు రిటర్న్ దాఖలు చేస్తే కట్టాలి. ఇది ఆదాయపు పన్ను. దీన్ని సరైన సమయానికి సరిగ్గా దాఖలు చేయాలి. లేకపోతే జరిమానా విధిస్తారు. అయితే జీతం పొందే వ్యక్తులు, వ్యాపారాలు, ట్రస్టులు, NGOల వరకు, ప్రతి పన్ను చెల్లింపుదారునికి ఒక నిర్దిష్ట ఒక ఐటీఆర్ ఫారమ్ ఉంటుంది. జీతం పొందే పన్ను చెల్లింపుదారులు TDS ప్రాసెస్ చేసిన 15 రోజుల తర్వాత వారి యజమానుల నుండి ఫారమ్ 16ను అందుకుంటారు. అది ఫారమ్ 26ASలో కనిపిస్తుంది. జీతం పొందే వ్యక్తి ఐటీఆర్ దాఖలు చేయడానికి ముందు వారి యజమాని ఫారమ్ 16ను విడుదల చేయడానికి జూన్ 15 లేదా ఆ తర్వాత వరకు వేచి ఉండాలి. అయితే, ఐటీఆర్‌ను దాఖలు చేయడానికి ఫారమ్ 16 తప్పనిసరి అయితే కాదు. దీనిని ఫారమ్ 26ASతో పాటు మరో ఇతర పత్రాలను ఉపయోగించి కూడా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు.
-
Ap: గర్భిణులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ వస్తువులన్నీ ఇకపై ఫ్రీ
-
Renu Desai: ఇకపై ఆ వస్తువులు బ్యాన్ చేయండి.. దేశ ప్రజలకు రేణు దేశాయ్ రిక్వెస్ట్.. వైరల్ పోస్ట్
-
Chinnaswamy Stadium: చిన్న స్వామి స్టేడియం కాదు.. స్విమ్మింగ్ పూల్.. స్నానం చేసిన ప్లేయర్
-
Skin Care: ఉదయం లేచిన వెంటనే ముఖానికి వీటిని అప్లై చేస్తే.. మెరిసిపోవడం ఖాయం
-
Zodiac signs: బుధుడు మార్పులతో దశ తిరగబోతున్న రాశులివే
-
Operation Sindoor: ఇప్పటి వరకు పాక్‌పై భారత్ చేపట్టిన మిలిటరీ ఆపరేషన్స్ ఇవే