IPL 2025: రికార్డు సృష్టించిన సూర్య కుమార్ యాదవ్
ఐపీఎల్ 2025 సీజన్‌లో చివరి జట్టుగా ప్లేఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్ చేరింది. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు బ్యాటర్లు, బౌలర్లు అద్భుతంగా రాణించారు.

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్‌లో చివరి జట్టుగా ప్లేఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్ చేరింది. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు బ్యాటర్లు, బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అయితే చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ సీజన్‌లో వరుసగా మొత్తం 13 మ్యాచ్‌ల్లో 25 కంటే ఎక్కువ రన్స్ చేశాడు. ఇలా చేసిన ప్లేయర్‌గా సూర్య కుమార్ యాదవ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అయితే బుధవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఈ రికార్డును సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ 43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు కొట్టి 73 నాటౌట్ నిలిచాడు. అయితే రికార్డు టెంబా బవుమా పేరు మీద ఉంది. దీన్ని ఇప్పుడు సూర్య కుమార్ యాదవ్ సమం చేశాడు. అయితే వరుసగా 13 మ్యాచ్‌లలో 25 పరుగుల కంటే ఎక్కువ రన్స్ చేసిన ఆటగాడిగా టంబా రికార్డు సృష్టించాడు. అలాగే రాబిన్ ఉతప్ప వరుసగా 10 మ్యాచ్‌లు ఆడి 25 ప్లస్ రన్స్ చేశాడు. అయితే ఈ రికార్డు సాధించిన తొలి ఆసియా ఆటగాడు కూడా సూర్య కుమార్ యాదవ్. అయితే శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర రికార్డ్‌ను అధిగమించాడు. 11 మ్యాచ్‌ల్లో 25+ రన్స్ చేయగా.. సూర్యకుమార్ యాదవ్, టెంబా బవుమా 13 సార్లు వరుసగా 25+ రన్స్ చేశారు. దీంతో వీరే టాప్‌లోకి వచ్చారు.
Read Also: ముగిసిన ప్లే ఆఫ్ రేస్.. ముంబై పైకి.. ఢిల్లీ ఇంటికి.. ఇక మ్యాచ్లన్నీ నామమాత్రం!
ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ముంబై జట్టు 20 ఓవర్లలో 180 పరుగులు చేసి 5వికెట్ల లక్ష్యాన్ని ఢిల్లీ ముందు ఉంచింది. ముంబై జట్టు బ్యాటింగ్ బౌలింగ్‌లోనూ కూడా అదరగొట్టింది. దీంతో 59 పరుగులు తేడాతో ముంబై జట్టు ఢిల్లీపై గెలిచింది. ఢిల్లీ జట్టు 18.2 ఓవర్లకే ఆలౌట్ అయ్యింది. ఢిల్లీపై విజయం సాధించి ప్లేఆఫ్ రేసుకు చేరింది. ముంబై ఇండియన్స్ ఢిల్లీపై 59 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ విజయంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసులో నాలుగో ప్లేస్‌లోకి చేరింది. ముంబై జట్టు బౌలర్లు ఈ మ్యాచ్‌లో అదరగొట్టారు. మిచెల్ సాంట్నర్, బుమ్రా అయితే మూడు వికెట్లు తీసి మ్యాచ్‌లో కీలక మలుపు తిప్పారు. దీంతో ఢిల్లీ జట్టుకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఐపీఎల్ సీజన్ నుంచి నిష్క్రమించింది.
-
IPL 2025 : రాజస్థాన్ రాయల్స్‌ను వీడి CSKలోకి సంజు శాంసన్? నిజమెంత?
-
Mitchell Marsh: ఏం కొట్టుడు అదీ.. మిచెల్ మార్ష్ సెంచరీ తడాఖా చూపించాడు
-
IPL 2025 : ముగిసిన ప్లే ఆఫ్ రేస్.. ముంబై పైకి.. ఢిల్లీ ఇంటికి.. ఇక మ్యాచ్లన్నీ నామమాత్రం!
-
IPL 2025: మ్యాచ్‌కి వరుణుడు ఆటంకం.. మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి?
-
IPL 2025: ప్లే ఆఫ్స్‌కు చేరిన ఆర్సీబీకి తప్పని భయం.. ఆందోళనలో ఫ్యాన్స్
-
Shreyas Iyer: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డులు అయ్యర్ సొంతం