Mahindra Scorpio-N : టాటా, ఎంజీలకు షాక్.. సరికొత్త సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న మహీంద్రా స్కార్పియో-ఎన్

Mahindra Scorpio-N : భారత మార్కెట్లో ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు మహీంద్రా.. తన పవర్ఫుల్ ఎస్యూవీ స్కార్పియో-ఎన్ ఒక కొత్త టీజర్‌ను విడుదల చేసింది. దీన్ని చూస్తే, ఈ పాపులర్ ఎస్‌యూవీని కంపెనీ మరింత స్టైలిష్‌గా, సురక్షితంగా మార్చబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈసారి అప్డేట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ముఖ్యమైన అంశం.. ఏడీఏఎస్ లెవెల్ 2 వంటి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు రాబోతున్నాయి. ఇవి ఇంతకు ముందు మహీంద్రా ఎక్స్‌యూవీ700, ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
టీజర్లో కంపెనీ “పవర్ ఆల్వేస్ స్టేస్మ ఆన్ కోర్స్” అనే ట్యాగ్‌లైన్‌ను ఉపయోగించింది. దీని ద్వారా ఈ ఎస్‌యూవీలో ఇప్పుడు లేన్ కీపింగ్ అసిస్టెన్స్ వంటి ఫీచర్ కూడా ఉంటుందని తెలుస్తోంది. అంటే, కారు రోడ్డుపై సరైన లేన్‌లో వెళ్లేలా ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా, మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. స్కార్పియో-ఎన్లో ఇప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్ ఆప్షన్ కూడా లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీలో సింగిల్-పేన్ సన్‌రూఫ్ మాత్రమే ఉంది. ఈ పనోరమిక్ సన్‌రూఫ్ కారుకు మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
Read Also:Phone Storage : పదేపదే ఫోన్ స్టోరేజీ ఫుల్ అయి ఫోన్ స్లో అవుతుందా ? ఈ సింపుల్ టిప్స్ ఫాటించండి
మహీంద్రా స్కార్పియో-ఎన్ రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 200 బీహెచ్పీ పవర్‌ను, 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ 172 బీహెచ్పీ పవర్‌ను, 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది. ఈ రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.
ఫీచర్ల విషయానికి వస్తే, స్కార్పియో-ఎన్ ఒక ప్రీమియం క్యాబిన్ అనుభూతిని ఇస్తుంది. ఇందులో డ్యూయల్-టోన్ బ్లాక్, బ్రౌన్ ఇంటీరియర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్, 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్, 7-అంగుళాల కలర్ ఎంఐడీ, వైర్లెస్ ఛార్జర్, ఫ్రంట్ రియర్ యూఎస్బీ , టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌లు, 6-వే పవర్డ్ డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Read Also:Honda : హోండా ధమాకా ఆఫర్..కేవలం రూ.678కే 102కిమీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్
సేఫ్టీ పరంగా ఈ ఎస్‌యూవీలో ఇప్పటికే ఈ కింది ఫీచర్లు ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ డిసెంట్ కంట్రోల్, ఏబీఎస్, ఈబీడీ, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ మౌంట్లు, ఎస్ఓఎస్ కాల్, రియర్ పార్కింగ్ సెన్సర్లు, టాప్ వేరియంట్ అయిన Z8లో టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా లభిస్తుంది.
మహీంద్రా స్కార్పియో-ఎన్ ధర రూ.13.99 లక్షల నుంచి మొదలై రూ.25.15 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ ఎస్యూవీ 8 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి Z2, Z4, Z6, Z8 S, Z8, Z8 L, Z8 కార్బన్, Z8 L కార్బన్. కొత్త ADAS ఫీచర్లు, పనోరమిక్ సన్‌రూఫ్‌తో స్కార్పియో-ఎన్ ఇప్పుడు మరింత స్మార్ట్‌గా, సురక్షితంగా, ప్రీమియంగా మారబోతోంది. ఇది టాటా హారియర్, ఎంజీ హెక్టర్ వంటి కార్లకు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.