Upcoming Cars: టాటా, మహీంద్రా నుంచి సంచలనాలు.. మార్కెట్లో దుమ్ములేపనున్న కార్లు ఇవే
Upcoming మహీంద్రా త్వరలోనే తన కాంపాక్ట్ SUV అయిన XUV 3XO ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఈ కారు మహీంద్రా మరొక ఎలక్ట్రిక్ SUV అయిన XUV400 కంటే చిన్నదిగా ఉంటుంది.

Upcoming Cars: భారతదేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా త్వరలోనే దేశంలో కొత్త కాంపాక్ట్ కార్లను విడుదల చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి మూడు కొత్త కాంపాక్ట్ SUVలు, ఒక హ్యాచ్‌బ్యాక్ కారు భారతీయ రోడ్లపై సందడి చేయనున్నాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే.. ఈ కార్లలో పెట్రోల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ కార్ల గురంచి వివరాలను తెలుసుకుందాం.
మహీంద్రా XUV 3XO EV
మహీంద్రా త్వరలోనే తన కాంపాక్ట్ SUV అయిన XUV 3XO ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఈ కారు మహీంద్రా మరొక ఎలక్ట్రిక్ SUV అయిన XUV400 కంటే చిన్నదిగా ఉంటుంది. నేరుగా టాటా పంచ్ EVకి పోటీనిస్తుంది. ఈ కారు ఒక్క ఛార్జ్‌పై దాదాపు 400 నుండి 450 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదు. అయితే, దీని ఫీచర్లు, ధర గురించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్
టాటా ఆల్ట్రోజ్ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ త్వరలో మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఇందులో కొత్త డిజైన్, కొత్త LED హెడ్లైట్లు, కనెక్టెడ్ LED టెయిల్ లైట్లు, ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్‌ను చూడవచ్చు. దీని లోపలి భాగంలో కూడా అనేక మార్పులు చేశారు. రెండు పెద్ద HD స్క్రీన్లు, యాంబియంట్ లైటింగ్, కొత్త సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ హైబ్రిడ్
మారుతి సుజుకి తన పాపులర్ కారు ఫ్రాంక్స్‌లో ఇప్పుడు హైబ్రిడ్ టెక్నాలజీని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. ఇది మైలేజ్‌ను పెంచడానికి సహాయపడుతుంది. దీని డిజైన్ ముందులానే ఉంటుంది. కానీ ఇంజిన్‌లో టెక్నాలజీ పరమైన మార్పులు చూడవచ్చు.
కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ
హ్యుందాయ్ పాపులర్ SUV వెన్యూ ఇప్పుడు సరికొత్త అవతారంలో రానుంది. కొత్త డిజైన్, మెరుగైన ఇంటీరియర్, లేటెస్ట్ ఫీచర్లతో ఈ కారు ఈ సంవత్సరం చివరి నాటికి విడుదల కావచ్చు. ఇంజిన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. కానీ టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లలో అప్ డేట్స్ ఉండవచ్చు.