Mahindra Bolero : టయోటా ఫార్చ్యూనర్‌కు పోటీగా మహీంద్రా బొలెరో బోల్డ్.. ప్రత్యేకతలు ఇవే!

Mahindra Bolero : మేడ్ ఇన్ ఇండియా SUVల గురించి మాట్లాడుకుంటే టాటా, మహీంద్రా పేర్లు ముందు వరుసలో ఉంటాయి. ప్రత్యేకించి ల్యాడర్ ఫ్రేమ్ రగ్డ్ SUVల విషయానికి వస్తే, మహీంద్రాకు తిరుగులేదు. మహీంద్రా థార్, మహీంద్రా బొలెరో లేదా మహీంద్రా బొలెరో నియో వంటి 4 సీటర్ SUVలకు పోటీగా వేరే వాహనాలు కనిపించవు. ఇప్పుడు మహీంద్రా తన వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించడానికి టయోటా ఫార్చ్యూనర్‌కు కూడా గట్టి పోటీనిచ్చే ఒక SUVని తీసుకురాబోతుంది.
మహీంద్రా బొలెరో, మహీంద్రా బొలెరో నియో SUVలు మల్టి పర్పస్ SUVలుగా పరిగణిస్తారు. వీటిని కచ్చా రోడ్ల మీద కూడా నడపవచ్చు. పికప్ ట్రక్కుగా కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మహీంద్రా బొలెరో, బొలెరో నియో కొత్త ఎడిషన్ అయిన మహీంద్రా బొలెరో బోల్డ్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. మహీంద్రా బొలెరో బోల్డ్ స్పెషల్ ఎడిషన్ ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ యాక్సెసరీస్ చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. దీనితో పాటు మహీంద్రా దాని మెకానికల్ భాగాల్లో కాకుండా పూర్తిగా కాస్మెటిక్ మార్పులు చేసింది. ఈ మార్పుల వల్ల ఈ SUV ప్రస్తుత సెగ్మెంట్‌లో అత్యంత స్టైలిష్‌గా నిలుస్తుంది.
Read Also:Viral Video : రైలు ఎక్కబోయి మరొకరి ప్రాణాలకు ముప్పు తెచ్చిన అంకుల్.. షాకింగ్ ఘటన!
బొలెరో బోల్డ్ ఎడిషన్
మహీంద్రా బొలెరో బోల్డ్ ఎడిషన్ కోసం కంపెనీ అద్భుతమైన ట్యాగ్‌లైన్‌ను ఇచ్చింది. అది “బేమిసాల్ జజ్బే కి షాన్ బోల్డ్ కి నయీ పెహచాన్”(అసాధారణమైన తెగువకు నిదర్శనం, బోల్డ్ సరికొత్త గుర్తింపు ). బోల్డ్ ఎడిషన్‌తో బొలెరోకు కొత్త స్టైలిష్ లుక్ వచ్చింది. ఎందుకంటే ఇందులో డార్క్ క్రోమ్ థీమ్‌తో కూడిన ఎక్స్‌టీరియర్, ప్రీమియం బ్లాక్ ఇంటీరియర్ ఉన్నాయి. దీనికి స్పోర్టీ బ్లాక్ ఫ్రంట్ బంపర్ కూడా ఉంది. ఇది దీనికి కొంచెం దూకుడు రూపాన్ని ఇస్తుంది. మరోవైపు, బొలెరో నియో బోల్డ్ ఎడిషన్‌లో ఆంగ్లంలో “బోర్న్ బోల్డ్, బిల్ట్ అన్‌స్టాపబుల్” అనే ట్యాగ్‌లైన్ ఉంది. స్టాండర్డ్ బొలెరో వలె, మహీంద్రా బొలెరో నియో బోల్డ్ ఎడిషన్‌లో డార్క్ క్రోమ్ థీమ్‌తో కూడిన ఎక్స్‌టీరియర్, ప్రీమియం బ్లాక్ ఇంటీరియర్ ఉన్నాయి. రూఫ్ రెయిల్, రియర్-వ్యూ కెమెరా బొలెరో నియో బోల్డ్ ఎడిషన్‌లో మాత్రమే ఉన్న ముఖ్యమైన అదనపు ఫీచర్లు.
బొలెరో బోల్డ్ ఎడిషన్‌లో కొత్తగా ఏమి ఉంది?
బొలెరో నియో బోల్డ్ ఎడిషన్‌లో కంఫర్ట్ కిట్ అనే ఒక ప్రత్యేకమైన ఫీచర్ ఉంది.ఇది ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచుతుంది. నెక్ పిల్లో , ఇతర యాక్సెసరీలు ఈ ప్యాకేజీలో భాగం కావచ్చు. మహీంద్రా ఇంకా ఈ రెండు వాహనాల ధరలను ప్రకటించలేదు. దీనితో పాటు బొలెరో, బొలెరో నియో రెండూ ధర, ఇంజిన్ సెగ్మెంట్‌లో బెస్ట్ గా నిరూపిస్తాయి. బొలెరోలో 1.5L 3-సిలిండర్ mHawk75 టర్బో డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 75 bhp పవర్, 210 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే బొలెరో నియోలో 1.5L 3-సిలిండర్ mHawk100 టర్బో డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 100 bhp పవర్, 260 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Read Also:Vitamin D: విటమిన్ డి లోపం ఉందా.. ఈ చిట్కాలు పాటించండి
-
Gmail : టైమ్ సేవింగ్ ట్రిక్స్.. Gmailలోని ఈ 4 అద్భుతమైన ఫీచర్లను తెలుసుకోండి
-
Viral Video : రైలు ఎక్కబోయి మరొకరి ప్రాణాలకు ముప్పు తెచ్చిన అంకుల్.. షాకింగ్ ఘటన!
-
Viral Video : పెళ్లి పందిట్లో ఎద్దు వీరంగం.. మ్యూజిక్‌కు రెచ్చిపోయి వేసిన డ్యాన్స్ చూస్తే షాకే
-
Obesity in India : పిల్లలను కూడా వదలని ఊబకాయం.. వచ్చే 25 ఏళ్లలో అందరికీ పొట్టలుంటాయట
-
Jyoti Malhotra : ప్రియుడితో వేషాలు.. పాకిస్తాన్ కు భారత రహస్యాలు..యూట్యూబర్ అరెస్ట్
-
Smart Phone : డిజిటల్ ఇండియా ఎఫెక్ట్.. దాని వినియోగంలో అమెరికాను దాటేసిన భారత్