Viral Video : రైలు ఎక్కబోయి మరొకరి ప్రాణాలకు ముప్పు తెచ్చిన అంకుల్.. షాకింగ్ ఘటన!

Viral Video : రైలు ప్రయాణం చాలా మందికి సౌకర్యవంతమైన ఆప్షన్. అయినప్పటికీ కొందరు ప్రయాణికులు మాత్రం తొందరపాటుతో ప్రమాదకరమైన చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా కర్ణాటకలోని దావణగెరె రైల్వే స్టేషన్లో జరిగిన ఒక ఘటన ఇందుకు నిదర్శనం. ఒక వ్యక్తి తన తొందరపాటుతో మరొకరి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడు. ఈ భయానక దృశ్యం కెమెరాలో రికార్డు కావడంతో వైరల్‌గా మారిపోయింది.
ఈ వీడియోను చిత్రీకరించిన వ్యక్తి తెలిపిన ప్రకారం.. దావణగెరెలో కదులుతున్న రైలును చిత్రీకరిస్తున్న సమయంలో తాను ఎప్పటికీ మర్చిపోలేని ఒక దృశ్యాన్ని చూశాడు. ఒక వ్యక్తి తన కళ్ల ముందే రైలు నుంచి పడిపోయాడు. అది చాలా భయానకమైన, హృదయ విదారకమైన క్షణం అని, తాను ఎప్పుడూ ఊహించలేదని అతను పేర్కొన్నాడు.
Read Also:Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫ్రీ కోచింగ్, హాస్టల్.. ఎక్కడంటే?
వీడియోలో ఒక వ్యక్తి రద్దీగా ఉన్న జనరల్ బోగీలోకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. అతనికి ఎంత తొందరగా ఉందంటే, కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించాడు. ఒకానొక సమయంలో అతను రైలు ఎక్కగలిగాడు. కానీ తన బ్యాలెన్స్ కోల్పోయాడు. అతను తనతో పాటు మరొక వ్యక్తిని కూడా కిందకు లాగేశాడు. అదృష్టవశాత్తూ, ఆ వ్యక్తికి , ఆ అంకుల్‌కు ఏమీ కాలేదు. కానీ ఆ దృశ్యం చాలా భయానకంగా ఉంది. ఎందుకంటే వారు ఇద్దరూ మృత్యువును చాలా దగ్గరగా చూసొచ్చారు. వారు పట్టాలపై పడకుండా తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని దావణగెరె స్టేషన్లో చోటు చేసుకుంది.
ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. తొందరపాటు చర్యలు తరచుగా ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తాయని అంటున్నారు. ఒక యూజర్ వీడియోపై కామెంట్ చేస్తూ, రైలు ఎక్కే ఈ పద్ధతి కొంచెం నిర్లక్ష్యంగా ఉందని రాశాడు. మరొకరు, ‘తమ తొందరపాటు వల్ల ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు’ అని ఆ వ్యక్తిని విమర్శించారు. ఇంకొకరు, ‘ఆ అంకుల్ ఈరోజు చాలా హడావిడిగా ఉన్నట్లున్నారు, కానీ కదులుతున్న రైలుతో ఆటలాడటం చాలా ప్రమాదకరం’ అని హెచ్చరించారు.
Read Also:Pan India Star: బార్బర్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా.. ఆ హీరో ఎవరంటే?
-
Dhruv Jurel: ఇండియాకు ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
-
Mohamed Muizzu Praises India: భారత్ పై మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రశంసలు
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్