Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫ్రీ కోచింగ్, హాస్టల్.. ఎక్కడంటే?

Jobs: ఉద్యోగాలు తక్కువై నిరుద్యోగులు ఎక్కువయ్యారు. ప్రస్తుతం రోజుల్లో చదువుకుని ఉద్యోగాలు లేక వెయిట్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా చిన్న ఉద్యగం కూడా దొరకడం కష్టమవుతుంది. పట్టణాల్లో ఉండేవారు ఏదో ఒక ఉద్యోగం చేసుకుని జీవిస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు అయితే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. డిగ్రీ పూర్తి అయిన తర్వాత ప్రభుత్వం, ప్రైవేట్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది మంచి అవకాశం. డిగ్రీ పూర్తి అయి ఉద్యోగం కోసం ఎవరైతే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారో వారికి ఇది ఒక సువర్ణావకాశం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న గ్రామీణ నిరుద్యోగులకు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. నిరుద్యోగులగా ఉన్న యువతకి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్‌మెంట్ కూడా ఇస్తారు. అయితే ఇంతకీ ఎవరు ఏ ట్రైనింగ్ ఇస్తారు? యవతకు ఇది ఎలా ఉపయోగపడనుందో చూద్దాం.
Read Also:Photo Story: ఒకప్పటి స్టార్ హీరోయిన్.. చిన్నప్పుడు ఎంత బొద్దుగా ఉందో చూశారా?
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏలూరు నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలను ఇవ్వనుంది. ప్రతీ ఏడాది ఎందరో విద్యార్థులు డిగ్రీ పూర్తి చేస్తారు. వీరు ఉద్యోగాల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి యూనియన్ బ్యాంక్ శిక్షణ ఇచ్చి ఉద్యోగాన్ని ఇస్తుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏలూరు ఈ నెల 26వ తేదీ నుంచి 31 రోజుల పాటు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోర్స్ నిర్వహించనుంది. మే 27వ తేదీన జ్యూట్ బ్యాగ్స్ తయారు చేయడానికి 15 రోజుల కోర్స్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ఏదో విధంగా లైఫ్‌లో సెటిల్ కావాలనుకునే వారు తప్పకుండా ఈ కోర్సుల్లో శిక్షణ తీసుకోవడం ఉత్తమం. నిరుద్యోగ యువతకు కేవలం శిక్షణతో పాటు ఉచిత హాస్టల్ భోజన వసతి కూడా ఇవ్వనున్నారు.
Read Also:Viral Video : కోతిని దాని భాషలోనే ఆటపట్టించాడు.. ఆ తర్వాత సీన్ చూస్తే షాక్!
కోర్సు పూర్తి అయిన తర్వాత ఉద్యోగం కూడా కల్పిస్తారు. అయితే ఇక్కడ ఫ్రీ శిక్షణ తీసుకోవాలంటే తప్పకుండా పదో తరగతి అయిన పాస్ అయి ఉండాలి. అన్నింటి కంటే ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల వారు అయి ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో జాయిన్ కావాలి. అయితే వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నవారికే ఇందులో ఉచిత శిక్షణ ఇస్తారు. https://forms.gle/zEo6eqFqKMEKB2iS8 లింక్ ఓపెన్ చేసి ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు వారే కాల్ చేసి పిలుస్తారు.
-
Goodbye to Your Job: జాబ్‌కి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా.. ఒక్క నిమిషం ఆగండి
-
Getting Good Job: కలలో ఇవి కనిపిస్తే.. కోరుకున్న ఉద్యోగం రావడం ఖాయం
-
Jobs: నేడే చివరి తేదీ.. పరీక్ష రాయకుండానే ఉద్యోగం మీ సొంతం
-
Jobs: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు జీతం లక్షా
-
APPSC : ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలు వెల్లడి
-
Jobs: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.60 వేలకు పైగా జీతం