Pan India Star: బార్బర్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా.. ఆ హీరో ఎవరంటే?

Pan India Star: ఇండస్ట్రీలోకి చాలా మంది నటులు ఎంతో కష్టపడి వస్తుంటారు. ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల చిన్న చిన్న పనులు చేసుకునే వారు. వారి జీవితంలో అనుకోని వచ్చిన ఒక అవకాశం వల్ల నటులుగా తమ టాలెంట్‌ను నిరూపించుకున్న వారు ఎందరో ఉన్నారు. రజనీకాంత్ నుంచి సల్మాన్ ఖాన్ వరకు అందరూ కూడా ఏవో ఉద్యోగాలు, పనులు చేసి సినిమాల్లోకి వచ్చి స్టార్ డమ్ హోదాను అనుభవిస్తున్నవారే. అయితే సినీ ఇండస్ట్రీలో ఏ పాత్రను అయినా, ఎన్ని పాత్రలు అయిన వేసే టాలెంట్ ఉన్న వ్యక్తి కమల్ హాసన్. ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఉన్నారు. ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల కమల్ హాసన్ అమ్మ బాధపడుతుండటంతో ఒక సెలూన్ షాప్‌లో పనిచేశారట.
Read Also:Viral Video : కోతిని దాని భాషలోనే ఆటపట్టించాడు.. ఆ తర్వాత సీన్ చూస్తే షాక్!
ఈ సెలూన్ షాప్ తన జీవితంలో మలుపులు తిప్పిందట. కమల్ హాసన్‌లో ఉన్న టాలెంట్‌ను బార్బర్ షాప్ యాజమాని గుర్తించాడు. ఈ క్రమంలో తనకి ఒక అవకాశం ఇచ్చారు. షాపు ఓనర్ మాట వినడం వల్ల ఈ రోజు స్టార్ హీరో హోదాలో ఉన్నట్లు గతంలో కమల్ హాసన్ తెలిపారు. ఎలాంటి పాత్రను అయినా కూడా జీవించేస్తారు. పాత్రకు న్యాయం చేస్తారు. బార్బర్ యాజమాని వల్ల తన జీవితం మలుపు తిరిగిందని కమల్ హాసన్ పలుమార్లు చెప్పారు. కమల్ హాసన్ డిఫరెంట్ స్టోరీలో ఉన్న పాత్రలు ఎక్కువగా నటిస్తుంటారు. ఒకటి, రెండు ఇలా సినిమాలో ఎన్ని పాత్రలను అయినా కూడా పోషిస్తారు. అందుకు కమల్ హాసన్‌ను లోక నాయకుడు అంటారు.
Read Also:Photo Story: ఒకప్పటి స్టార్ హీరోయిన్.. చిన్నప్పుడు ఎంత బొద్దుగా ఉందో చూశారా?
ఇదిలా ఉండగా కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం తగ్ లైఫ్. ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్, పోస్టర్లు అన్ని కూడా విడుదల అయ్యాయి. ఇవన్నీ కూడా ప్రేక్షకులను ఎంతో బాగా అలరించాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జూన్ 5వ తేదీన ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ టీం ప్రమోషన్లు స్టార్ట్ చేసింది. ఈ ప్రమోషన్లలో భాగంగా కమల్ హాసన్ ఇవన్నీ తెలిపారు. ఓ రిపోర్టర్ ప్రశ్నలు అడగ్గా గతంలో తాను పడిన కష్టాల గురించి చెప్పారు. బార్బర్‌గా కూడా వర్క్ చేసినట్లు తెలిపారు. అయితే ఇలా వర్క్ చేయడం తనకి ఇష్టం లేదని, కేవలం వాళ్ల అమ్మ కోసం మాత్రమే వర్క్ చేసినట్లు తెలిపారు. ఖాళీగా ఉంటే అమ్మకు నచ్చదని, అందుకే ఆ సమయంలో బార్బర్ షాప్‌లో వర్క్ చేసినట్లు కమల్ హాసన్ తెలిపారు. అయితే త్వరలో రిలీజ్ కాబోతున్న తగ్ లైఫ్ మూవీ హిట్ కావాలని కోరుకుందాం.