Parenting: కూతురికి తప్పకుండా నేర్పించాల్సినవి ఇవే!

Parenting:ప్రతీ తండ్రి కూతుళ్లను కొన్ని లక్షణాలతో పెంచాలి. అప్పుడే వారు ధైర్యంగా ఎలాంటి సమస్యలను అయినా కూడా ఎదుర్కోగలరు. ఈ రోజుల్లో అమ్మాయిలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి భయపడి కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లలను బయటకు పంపించడం లేదు. ఒకవేళ పంపించినా కూడా భయంతోనే గడుపుతున్నారు. ఆడపిల్లలు సమాజంలో ధైర్యంగా ఉండాలంటే మాత్రం తల్లిదండ్రులు వారిని సరైన విధంగా పెంచాలి. చిన్నప్పటి నుంచే అన్ని విషయాలను నేర్పించాలి. ముఖ్యంగా వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అయితే ప్రతీ తండ్రి ఆడపిల్లను పెంచేటప్పుడు కొన్ని విషయాలను అయితే తప్పకుండా చెప్పాలి. అప్పుడే వారు సమాజంలో ధైర్యంగా జీవించగలరు. ఎలాంటి సమస్యలను అయినా కూడా ఈజీగా ఎదుర్కోగలరు. అయితే అమ్మాయిలను తల్లిదండ్రులు ఎలా పెంచాలో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: వీరంతా అదృష్టవంతులు లేరు.. జీవితాంతం సుఖమయమే
ఆత్మ విశ్వాసం
ఆత్మ విశ్వాసంతో ఏ పనిని అయిన చేసే విధంగా మార్చాలి. ఆడపిల్లను ఇలా పెంచడం వల్ల వారు భయపడకుండా పెరుగుతారు. ఎలాంటి సమస్యలు వచ్చిన కూడా ధైర్యంగా ముందుకు వెళ్తారు. చిన్న విషయాలకు బయపడటం, ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా సమస్యలను సాల్వ్ చేసేలా ఆడపిల్లలను పెంచాలి.
ఇది కూడా చూడండి: Young Directors: ఈ యంగ్ డైరెక్టర్లకే మెగాస్టార్ ఛాన్స్.. వాళ్లు ఎవరంటే?
నాయకత్వ లక్షణాలు
కొందరు ఆడపిల్లకి ఎందుకు నాయకత్వ లక్షణాలు అని అనుకుంటారు. ఆడపిల్ల ఇంట్లోనే ఉండాలని భావిస్తారు. కానీ ఆడపిల్లలు ధైర్యంగా ఉండేలా నాయకత్వ లక్షణాలతో పెంచాలి. అప్పుడే వారు లైఫ్ లో ఏదయినా సాధించగలరు.
కష్టాలను తట్టుకునేలా
లైఫ్ లో కష్టాలు అనేవి సహజం. ఎలాంటి కష్టాలొచ్చిన తట్టుకొని నిలబడే లాగా ఆడపిల్లలను తల్లిదండ్రులు పెంచాలి. అప్పుడు వారు పెద్ద అయిన తర్వాత ఎలాంటి సమస్యలు నైనా తట్టుకుని నిలబడగలరు. కొందరు తల్లితండ్రులు పిల్లలను గారాబం చేసి పెంచుతారు. దీనివల్ల పిల్లలు పెద్ద అయ్యాక కూడా వాటికే అలవాటు పడతారు. కాబట్టి వారికి చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు తెలిసేలా పెంచండి.
ఇది కూడా చూడండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఆ రోజే వార్ 2 టీజర్ రిలీజ్
కలిసి మెలసి ఉండేలా
ఆడపిల్లలు కుటుంబ సభ్యులతో కలిసి మెలసి ఉండేలా పెంచండి. ఇంట్లో ఎవరికీ ఏ సమస్య వచ్చిన వెంటనే తీర్చ గలిగే విధంగా పెంచండి. కొందరు అమ్మాయిలు ఎవరితోనో కలవకుండా ఒంటరిగా ఇంట్లో ఉంటారు. ఇలా ఉంటే వారు మానసికంగా ఇబ్బంది పడతారు. చిన్నప్పుడు నుంచి అందరితోనే కలిసి మెలిసి ఉండేలా పిల్లలను పెంచండి. ఇంటికి ఎవరైనా వస్తే వారిని పలకరించడం వంటివి చేసేలా పిల్లలకు నేర్పించండి. ఇలా చేయడం వల్ల పిల్లలు స్ట్రాంగ్ గా ఉంటారు.
ఇది కూడా చూడండి: Kangana Ranaut : ట్రంప్‌పై పోస్ట్… పార్టీ ఆదేశాలతో తొలగించిన కంగనా రనౌత్
-
Pan India Star: బార్బర్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా.. ఆ హీరో ఎవరంటే?
-
Parrots: చిలుకలతో మీ పంట పండినట్లే.. ఇంట్లో ఉంచితే అదృష్టమే
-
Zodiac signs: బుధుడు మార్పులతో దశ తిరగబోతున్న రాశులివే
-
Mother’s Day Wishes: మదర్స్ డే స్పెషల్ విషెష్.. ఇలా అమ్మలకు విష్ చేయండి
-
Parenting Tips: పిల్లలకు నిద్రపోయే ముందు ఈ విషయాలు చెబుతున్నారా?
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు ఈ చిన్న పని చేస్తే.. డబ్బే డబ్బు