Pregnant Women : ప్రసవం సమయంలో తల్లి.. బిడ్డ.. ఇద్దరిలో ఎవరో ఒకరే బతుకుతారు అన్నప్పుడు వైద్యులు ఎవరిని బతికించాలి?

Pregnant Women :
తల్లి కావడం అనేది ఒక గొప్ప అనుభూతి. ప్రతి మహిళ జీవితంలో పెళ్లి తర్వాత పిల్లలు చాలా ముఖ్యమైన ఘట్టం. సంవత్సరం ఆలస్యం అయితే టెన్షన్ అవుతుంది కదా. మారుతున్న జీవన శైలి, బిజీ లైఫ్ వల్ల పిల్లలు పుట్టడం కూడా చాలా కష్టమే. పిల్లలు పుట్టడం అనేది పెద్ద టాస్క్ అవుతుంది. అందుకే గల్లీకి ఒక పిల్లల ఆస్పత్రి వచ్చి టెస్ట్ ట్యూబ్ బేబీలను కూడా పుట్టిస్తున్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే ఓ మహిళ తల్లి కాబోతుంది అనే వార్తు ఆమెను మాత్రమే కాదు. భర్త, కుటుంబం మొత్తాన్ని సంతోషపెడుతుంది.
ఆమె తొమ్మిది నెలలు చాలా ఇష్టంగా, బాధ్యతగా లోపల పెరుగుతున్న బిడ్డను చూసుకుంటుంది. ఎంతో ఆనందిస్తుంది. ప్రతి క్షణాన్ని ఆనందంగా స్వీకరిస్తుంది. వాంతులు, హార్మోన్ ఇంబాలెన్స్, కళ్లు తిరగడం వంటి ప్రతి సమస్యను కూడా ఇష్టంగానే ఎదుర్కుంటుంది. అయితే చివరి సమయంలో బిడ్డ, తల్లి ఇద్దరిలో ఎవరో ఒకరిని మాత్రమే కాపాడగలం అంటే? ఆ తల్లి, కుంటుంబం ఎంత బాధను అనుభవిస్తుంది కదా. అయితే ఈ సమయంలో ఎవరిని కాపాడాలో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం.
వైద్య పరంగా, గర్భం ఏ త్రైమాసికంలోనైనా తల్లి లేదా బిడ్డ జీవితం ప్రమాదంలో పడవచ్చు. కానీ అలాంటి స్థితిలో వైద్యుడు తల్లి ప్రాణాలను కాపాడతాడు. ఈ సమయంలో, వైద్యుడు తల్లి ప్రాణానికి ప్రమాదం కలిగించకుండా బిడ్డ ప్రాణాన్ని కాపాడగలిగితే, ఆ బిడ్డ ప్రాణం కూడా కాపాడవచ్చు. కానీ తల్లి ప్రాణమే ప్రధానంగా చూస్తారు.
గర్భధారణ సమయంలో తల్లి ప్రాణానికి ప్రమాదం ఉంటే, దానికి కారణం బిడ్డే. ఎందుకంటే తల్లి చనిపోతే, బిడ్డ నిమిషాల్లోనే చనిపోతాడు. ఎందుకంటే పిండం గర్భాశయం లోపల లేకుండా గర్భాశయం బయటి గోడపై ఉంటే, మనం తల్లి ప్రాణాన్ని మాత్రమే కాపాడుతాము. లేకుంటే NICUలో ఉన్న బిడ్డతో పాటు తల్లి ప్రాణాన్ని కూడా కాపాడవచ్చు.
పుట్టబోయే బిడ్డ కంటే తల్లి జీవితం చాలా ముఖ్యం. పని అనుభవం, కట్టుబాట్లు, కుటుంబ ప్రేమ అన్ని ఉన్నాయి. ఇక పుట్టబోయే బిడ్డ మరణం శారీరక, మానసిక ఆరోగ్యంపై బాధాకరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ ఈ సందర్భంలో కూడా, తల్లినే రక్షిస్తారు. నవజాత శిశువు తల్లి లేకుండా జీవించడం చాలా కష్టం. ఎందుకంటే ఒక చిన్న బిడ్డకు సంరక్షణ, పోషణ అవసరం. ఇవన్నీ తల్లి లేకుండా పొందడం చాలా కష్టం. కాస్త ఎమోషన్స్ ను పక్కన పెట్టి మాట్లాడితే.. తల్లి లేకుండా తండ్రి కూడా అంత మెరుగ్గా బిడ్డను చూసుకోలేరు.
ఇక తల్లిలేని బిడ్డను సమాజం కూడా పెద్దగా పట్టించుకోదు. వారి ఆలనా పాలనా అన్ని చూసేది అమ్మే. అయినా బాల్యం నుంచి అమ్మ లేకుండా బతకడం అంటే చాలా కష్టం. నాన్న ప్రేమ ముఖ్యమే కానీ. తల్లి ప్రేమ చాలా అవసరం. ఇక ఇంట్లో వాళ్లు చూసుకుంటారు లే అనుకున్నా సరే.. తల్లిని మించి ఏ వ్యక్తి ఆ ప్రేమను అందించలేరు. ఇవన్నింటి గురించి చూసినా సరే బిడ్డ కంటే తల్లిని కాపాడటమే ముఖ్యం అంటారు ప్రజలు కూడా. తల్లి మరో బిడ్డను కనడానికి అవకాశం ఉంటుంది. కానీ తల్లే చనిపోతే ఆ ఇల్లే చీకటి అవుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Pan India Star: బార్బర్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా.. ఆ హీరో ఎవరంటే?
-
Parenting: కూతురికి తప్పకుండా నేర్పించాల్సినవి ఇవే!
-
Anchor Anasuya: ఈ ఫీల్డ్‌లో అయితే మా ఆయన సక్సెస్ కాలేరు.. భర్తపై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన అనసూయ
-
Mother’s Day Wishes: మదర్స్ డే స్పెషల్ విషెష్.. ఇలా అమ్మలకు విష్ చేయండి
-
Electricity Bill: కరెంట్ బిల్ తక్కువగా రావాలా.. ఈ ఫ్యాన్‌లు వాడండి
-
Pregnant Women: గర్భిణులు పైనాపిల్ తింటే.. ఏమవుతుందో మీకు తెలుసా?