Pregnant Women : గర్భిణులు పారాసెటమాల్, ఐబుప్రోఫెన్ వాడొచ్చా? డాక్టర్లు ఏమంటున్నారంటే ?

Pregnant Women : గర్భం అనేది ప్రతి మహిళ జీవితంలో చాలా కీలకమైన సమయం. ఈ సమయంలో చేసే ప్రతి పని కడుపులోని బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే, గర్భధారణ సమయంలో డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులు తీసుకోకూడదు. చాలామందికి సాధారణంగా వాడే కొన్ని మందుల విషయంలో డాక్టర్ సలహా తీసుకోవాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. కానీ, గర్భధారణ సమయంలో అలాంటి తప్పులు తల్లి, బిడ్డ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. పారాసెటమాల్, ఐబుప్రోఫెన్ వంటి మందులు ఈ సమయంలో ఎలా ప్రభావం చూపుతాయో నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
గర్భధారణ సమయంలో మహిళలకు తరచుగా జ్వరం లేదా శరీర నొప్పులు వస్తుంటాయి. ఇవి ఏ కారణం చేతైనా ఉండవచ్చు. కానీ, చాలా సార్లు తెలియకుండానే మహిళలు డాక్టర్ సలహా తీసుకోకుండా మందులు వాడేస్తుంటారు. కొన్నిసార్లు కుటుంబ సభ్యులు కూడా ఒంటి నొప్పి లేదా జ్వరం కోసం పారాసెటమాల్ లేదా ఐబుప్రోఫెన్ వంటి మందులను ఇస్తుంటారు. అయితే, ఈ మందులు తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. గర్భధారణ సమయంలో డాక్టర్ సలహా లేకుండా ఈ మందులు తీసుకోవడం ఎంతవరకు సురక్షితం అనే దానిపై గైనకాలజిస్ట్ కొన్ని సూచనలు చేశారు.
Read Also:Viral Video : రైలులో సీటు కోసం రచ్చ.. ప్రయాణీకుల మధ్య వాగ్వాదం
గర్భధారణ సమయంలో పారాసెటమాల్‌ను తేలికపాటి జ్వరం లేదా శరీర నొప్పిలకు మాత్రమే సురక్షితమైనదిగా చెబుతున్నారు. అయితే, దీనిని తీసుకునే ముందు డాక్టర్ సలహా తప్పనిసరి. సూచించిన మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటే దీనికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు. అంతేకాకుండా, గర్భధారణ సమయంలో ఐబుప్రోఫెన్ తీసుకోవడం వల్ల బిడ్డ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడవచ్చు. ముఖ్యంగా మూడవ త్రైమాసికంలో ఈ మందును తీసుకుంటే బిడ్డ కిడ్నీలపై ప్రభావం చూపవచ్చు. బిడ్డ రక్త ప్రవాహాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. గర్భధారణ సమయంలో ఎదురయ్యే అన్ని అనుభవాలను డాక్టర్‌కు తప్పకుండా చెప్పాలని సూచిస్తున్నారు.
గర్భధారణ సమయంలో చాలా రకాల సమస్యలు వస్తుంటాయి. అన్ని సమస్యలను డాక్టర్‌కు తెలియజేయాలి. ఇష్టం వచ్చినట్లు ఎలాంటి మందులూ తీసుకోకూడదు. కొన్నిసార్లు సాధారణ మందులు కూడా తల్లి, బిడ్డకు మంచివి కావు. అందుకే, ఏ మందు తీసుకునే ముందు అయినా డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు. గర్భధారణ సమయంలో ఐబుప్రోఫెన్, నాప్రోక్సెన్ వంటి మందులను తీసుకోకూడదు. డాక్టర్ సలహా లేకుండా ఏ ఇతర మందులను కూడా తీసుకోరాదు.
Read Also:Feel Shocked: టచ్ చేసినప్పుడు షాక్ కొట్టిన ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే?