Phone Storage : పదేపదే ఫోన్ స్టోరేజీ ఫుల్ అయి ఫోన్ స్లో అవుతుందా ? ఈ సింపుల్ టిప్స్ ఫాటించండి

Phone Storage : ఈ రోజుల్లో దాదాపు అందరి దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంది. మన ఫోన్లలో బోలెడన్ని ఫోటోలు, వీడియోలు, యాప్స్, ఫైల్స్ పెట్టుకుంటాం. అయితే, ఒకానొక దశలో ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. అప్పుడు ఫోన్ స్లో అవ్వడం మొదలవుతుంది. కొత్త యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఫోటోలు తీసుకోవాలన్నా కష్టం అవుతుంది.. మీరు కూడా ఈ సమస్యతో పదేపదే ఇబ్బంది పడుతున్నట్లయితే, మీ ఫోన్ స్టోరేజ్‌ను ఫుల్ అవ్వకుండా చూసుకోవడానికి కొన్ని సులువైన చిట్కాలు తెలుసుకుందాం.
ఫోన్ స్టోరేజ్ పెంచుకోవడానికి సింపుల్ టిప్స్!
1. అనవసరమైన యాప్‌లు డిలీట్ చేయాలి
మనం చాలాసార్లు కొన్ని యాప్‌లను ఒక్కసారి వాడి వదిలేస్తాం. ఆ తర్వాత వాటి అవసరం ఉండదు. పాత గేమ్‌లు, షాపింగ్ యాప్‌లు లేదా ఏదైనా ట్రయల్ కోసం డౌన్లోడ్ చేసిన యాప్‌లు అనవసరంగా స్టోరేజ్ నింపేస్తాయి. వీటిని తొలగించడానికి మీ ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. అక్కడ యాప్స్ (Apps) అనే ఆప్షన్‌ను ఎంచుకుని, ఏ యాప్ ఎంత స్టోరేజ్ తీసుకుంటుందో చూడండి. అవసరం లేని వాటిని డిలీట్ చేయాలి. అంతేకాకుండా, కొన్ని యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తూనే ఉంటాయి. ఇవి బ్యాటరీని ఖర్చు చేయడమే కాకుండా, ఫోన్‌ను స్లో చేస్తాయి. వీటిని కూడా సెట్టింగ్స్‌లో ఆపివేయాలి.
2. ప్రతీ వారం ‘క్యాచీ’ క్లియర్ చేయాలి
యాప్స్ వాడినప్పుడు, అవి కొంత డేటాను క్యాచీ రూపంలో సేవ్ చేస్తాయి. ఈ డేటా మనకు అవసరం లేనిది. ఇది కేవలం మీ ఫోన్లో స్థలాన్ని ఆక్రమిస్తుంది. దీన్ని క్లియర్ చేయడానికి సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. స్టోరేజ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు ‘Cached data’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, ‘Clear cache’ సెలక్ట్ చేసుకోవాలి. దీనివల్ల మొత్తం క్యాచీ డేటా క్లియర్ అవుతుంది.
Read Also: Honda : హోండా ధమాకా ఆఫర్..కేవలం రూ.678కే 102కిమీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్
3. ఫోటోలు, వీడియోలు గూగుల్ ఫోటోస్‌లో సేవ్ చేయాలి
ఫోన్ గ్యాలరీలో ఉండే ఫోటోలు, వీడియోలే ఫోన్ స్టోరేజ్‌ను ఎక్కువగా ఆక్రమిస్తాయి. గూగుల్ ఫోటోస్ వంటి యాప్‌లలో మీ ఫోటోలు/వీడియోలను బ్యాకప్ చేసుకోవాలి. బ్యాకప్ పూర్తయ్యాక, మీ ఫోన్ నుంచి ఆ ఫోటోలు/వీడియోలను డిలీట్ చేయవచ్చు. దీనివల్ల స్టోరేజ్ ఖాళీ అవ్వడమే కాకుండా, మీ ఫోటోలు కూడా సురక్షితంగా ఉంటాయి.
4. ‘Files by Google’ యాప్‌తో స్మార్ట్ క్లీనింగ్
గూగుల్ అందించే ‘Files by Google’ అనే యాప్ అనవసరమైన ఫైల్స్, డూప్లికేట్ ఫోటోలు, పాత స్క్రీన్షాట్లను తొలగించడానికి ప్రత్యేకంగా రూపొందించారు. ఈ యాప్ వాడటం వల్ల స్టోరేజ్ ఖాళీ అవ్వడమే కాకుండా, ఫోన్ స్పీడ్ కూడా పెరుగుతుంది. ఏది డిలీట్ చేయాలి, ఏది ఉంచాలి అనేది ఈ యాప్ చాలా స్పష్టంగా చూపిస్తుంది.
Read Also: BSNL : బీఎస్ఎన్ఎల్ ధమాకా ఆఫర్.. ఇక మీద ఇంటివద్దకే సిమ్ కార్డ్
5. ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి, ఆటో-క్లీనింగ్ ఆన్ చేయాలి
చాలా కాలం పాటు ఫోన్‌ను రీస్టార్ట్ చేయకపోతే కూడా ఫోన్ పర్ఫామెన్స్ తగ్గిపోతుంది. ప్రతీ వారం ఒక్కసారి మీ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. ఇది ఫోన్ పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, మీ ఫోన్ సెట్టింగ్స్‌లో ‘Storage management’ లేదా ‘Smart cleaning’ వంటి ఫీచర్లు ఉంటే, వాటిని ఆన్ (On) చేసి ఉంచాలి. ఇవి ఆటోమేటిక్‌గా అనవసరమైన ఫైల్స్‌ను తొలగించి, ఫోన్‌ను శుభ్రంగా ఉంచుతాయి. ఈ చిట్కాలను పాటిస్తే, మీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవ్వకుండా చూసుకోవచ్చు. మీ ఫోన్ ఎప్పుడూ ఫాస్టుగా పనిచేస్తుంది.