BYD నుంచి చవకైన ఎలక్ట్రిక్ కారు.. రెనో, ఫోక్స్ వ్యాగన్లకు భారీ షాక్

BYD : ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలలో ఒకటైన చైనాకు చెందిన BYD, జర్మనీలో తన కొత్త, తక్కువ ధర ఎలక్ట్రిక్ కారు డాల్ఫిన్ సర్ఫ్‌ను (Dolphin Surf) విడుదల చేసింది. యూరోపియన్ మార్కెట్లో కంపెనీ నుంచి విడుదలైన 10వ మోడల్ ఇది. ఈ కారు మార్కెట్లోకి రావడంతో యూరోపియన్ వాహన తయారీదారులకు పెద్ద సవాల్ ఎదురైంది. చైనా కంపెనీతో పోటీ పడేందుకు చవకైన ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే రేసులో ఉన్న వారికి ఇది మరింత ఒత్తిడిని పెంచుతోంది.
తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లు!
కొత్త డాల్ఫిన్ సర్ఫ్ ధర 22,990 యూరోలు (సుమారు రూ.22.32 లక్షలు)గా ఉంది. ఇది BYD సీగల్ హ్యాచ్‌బ్యాక్ (Seagull hatchback) కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్, ఇది చైనాలో బాగా ప్రాచుర్యం పొందింది.
డాల్ఫిన్ సర్ఫ్ ఫీచర్లు, రేంజ్:
డాల్ఫిన్ సర్ఫ్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 322 కిలోమీటర్ల వరకు, టాప్ మోడల్ 507 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. డాల్ఫిన్ సర్ఫ్‌లో రొటేటింగ్ 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్లు, వాయిస్ కమాండ్, ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటి అనేక లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.ఈ కారు 30 నిమిషాల్లో 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.
Read Also:Viral Video : అవగాహన లోపమా? అమాయకత్వమా? .. ఎలక్ట్రిక్ కారుకు పెట్రోల్ కోసం వెతికిన అమ్మాయి
యూరప్‌లో BYD డాల్ఫిన్ సర్ఫ్ డెలివరీలు జూన్ 2025లో ప్రారంభం కానున్నాయి. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ భారత్‌లోకి కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. మొదట్లో BYD భారత్‌లో చైనా మోడల్ సీగల్‌ను విడుదల చేస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు అప్డేటెడ్ డాల్ఫిన్ సర్ఫ్ భారత మార్కెట్‌కు మరింత అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే, BYD ఇప్పటివరకు భారత్‌లో సీగల్ లేదా డాల్ఫిన్ సర్ఫ్ విడుదలపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
భారత్‌లో ధర
భారత్‌లో కూడా ఈ కారు దాదాపు రూ.20-25 లక్షల రేంజ్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ధరలో టాటా నెక్సాన్ EV (Nexon EV), మహీంద్రా XUV400 (XUV400) వంటి కార్లతో పాటు, రాబోయే మారుతి eVX (eVX) వంటి వాటికి ఇది గట్టి పోటీనివ్వగలదు.
యూరోపియన్ కంపెనీలకు పెరిగిన పోటీ
యూరోపియన్ దేశాలు చైనా కంపెనీల ఎలక్ట్రిక్ కార్లపై భారీ టారిఫ్‌లను (పన్నులను) విధిస్తున్నాయి. గతంలో 27 శాతం టారిఫ్ ఉండగా, అక్టోబర్ 2024లో యూరోపియన్ యూనియన్ చైనాలో తయారైన EVలపై టారిఫ్‌ను 45.3 శాతానికి పెంచింది. ప్రస్తుతం BYD తన కార్లను ఆసియాలో తయారు చేస్తోంది. అయితే, భవిష్యత్తులో ఈ టారిఫ్‌లను నివారించడానికి టర్కీ, హంగరీలో రెండు కొత్త ప్లాంట్లను నిర్మిస్తోంది.
Read Also:Milk Purity Test : ఇంట్లోనే ఈజీగా కల్తీ పాలను ఎలా గుర్తించాలో ఈ 5చిట్కాలతో తెలుసుకోండి
ఇదిలా ఉండగా యూరోపియన్ ఆటోమొబైల్ తయారీదారులు ఈవీ ధరల పోటీలో చైనా కంపెనీల నుంచి సవాళ్లను ఎదుర్కొంటున్నారు. యూరోపియన్ యూనియన్, చైనా ప్రస్తుతం చైనాలో తయారైన ఈవీల కోసం టారిఫ్‌లను మార్చడంపై చర్చలు జరుపుతున్నాయి.
యూరోపియన్ కంపెనీల స్పందన
యూరోపియన్ ఆటోమేకర్లు ఇప్పుడు సామాన్య ప్రజల కోసం అందుబాటు ధరల్లో EV మోడల్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఒక్కటే ఈ విభాగంలో 25,000 యూరోల (సుమారు రూ.25 లక్షలు) లోపు ధరతో 11 కొత్త మోడల్‌లు విడుదల కానున్నాయి. వీటిలో స్టెల్లాంటిస్ (Stellantis), రెనో (Renault), ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. రెనో ఎలక్ట్రిక్ R5 (Electric R5), ఇటీవల విడుదలైన ట్వింగో ఇ-టెక్ (Twingo E-Tech) ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఫోక్స్‌వ్యాగన్ తన ID.2 కాంపాక్ట్ EV (ID.2 Compact EV) ను విడుదల చేస్తుంది. ఈ మోడల్లన్నింటి ధర సుమారు 25,000 యూరోల వరకు ఉంటుందని అంచనా. BYD డాల్ఫిన్ సర్ఫ్ రాకతో ఈ కంపెనీల మధ్య పోటీ మరింత తీవ్రం కానుంది.
-
Viral Video : అవగాహన లోపమా? అమాయకత్వమా? .. ఎలక్ట్రిక్ కారుకు పెట్రోల్ కోసం వెతికిన అమ్మాయి
-
MG Windsor EV: వావ్! రూ.13 లక్షలకే అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు.. క్రెటా, కర్వ్‌కు షాక్!
-
Electric Car: 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు అదిరిపోయింది.. చూస్తే కొనకుండా ఉండలేరు
-
BYD Car: ఎలక్ట్రిక్ కారు సంచలనం.. 5 నిమిషాల్లో 470 కి.మీ.అన్ని కార్లకు చెక్