Sugar Free Drinks : షుగర్-ఫ్రీ డ్రింక్స్ నిజంగా ఆరోగ్యానికే మంచివా? రీసెర్చ్‌లో బయటపడ్డ షాకింగ్ నిజం

Sugar Free Drinks : ఈ రోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. బరువు, కొవ్వు పెరగకుండా ఉండటానికి తిండి విషయంలో శ్రద్ధ పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళు తరచుగా షుగర్-ఫ్రీ డ్రింక్స్ లేదా డైట్ సోడా తాగడానికి ఇష్టపడుతున్నారు. ఇవి తాగడం వల్ల బరువు పెరగరు, షుగర్ కూడా రాదు అని వాళ్ళ ఆలోచన. కానీ, నిజంగా ఈ డ్రింక్స్ మన ఆరోగ్యానికి మంచివా? దీనిపై నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ఒక రీసెర్చ్ పబ్లిష్ అయింది. ఈ రీసెర్చ్ ప్రకారం ఈ డ్రింక్స్ లివర్‌కు హాని కలిగిస్తాయని తేలింది.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ రీసెర్చ్ చెప్పిన ప్రకారం.. షుగర్-ఫ్రీ డ్రింక్స్‌లో సుక్రలోజ్ అనే పదార్థం ఉంటుంది. ఎవరైనా దీన్ని రోజూ తాగుతూ ఉంటే, అది మన మెదడులో ఆకలిని కలిగించే కెమికల్స్‌ని యాక్టివ్ చేస్తుందట. దీనివల్ల తిన్నా సరే, శరీరం ఆకలిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఫలితంగా, ఆకలి పెరిగి, ఎక్కువగా తినే అలవాటు అవుతుంది. ఇలా ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కేలరీలు పేరుకుపోతాయి, లావు పెరుగుతారు. దీనివల్ల నెమ్మదిగా లివర్‌లో కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది. దీనినే నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఈ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుందని రీసెర్చ్‌లో తేలింది.
Read Also:TollyWood : టాలీవుడ్ లో కొత్త రూల్.. అవి వాడే ఆర్టిస్టులపై లైఫ్ టైం బ్యాన్
షుగర్-ఫ్రీ డ్రింక్స్, డైట్ కోలా, షుగర్-ఫ్రీ టీ-కాఫీ ప్రీమిక్స్, జీరో-కేలరీ జ్యూస్‌లు.. ఇలా వీటన్నింటిలోనూ సుక్రలోజ్ ఉంటుంది. ఈ పదార్థాలన్నీ ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయని అధ్యయనంలో తేలింది. అంతేకాదు, షుగర్-ఫ్రీ డ్రింక్స్ ఎక్కువగా వాడటం వల్ల శరీరం మెటబాలిజం కూడా దెబ్బతింటుందని, దీనివల్ల కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని కనుగొన్నారు. షుగర్-ఫ్రీ డ్రింక్స్ వాడే వాళ్ళలో లివర్‌లో వాపు, ఫైబ్రోసిస్, గ్లూకోజ్ మెటబాలిజంలో తేడాలు ఎక్కువగా కనిపించాయని రీసెర్చ్‌లో వెల్లడించారు.
షుగర్-ఫ్రీ డ్రింక్స్‌లో కొన్ని రకాల ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ కలుపుతారు, ఇవి శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ దెబ్బతీస్తాయి. ఇవి ప్రేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాకు హాని కలిగించవచ్చు, దీనివల్ల లివర్, మెటబాలిజం కూడా ప్రభావితం అవుతాయి. షుగర్-ఫ్రీ డ్రింక్స్ తరచుగా ఆకలిని పెంచుతాయి. దీనివల్ల ప్రజలు ఎక్కువగా తిని, కేలరీలు ఎక్కువ తీసుకుంటారు. ఇది బరువు పెరగడానికి, ఫ్యాటీ లివర్ సమస్యకు దారి తీయవచ్చు. కొన్ని షుగర్-ఫ్రీ డ్రింక్స్‌లో కనిపించని కార్బ్స్, ప్రిజర్వేటివ్స్, ఇతర పదార్థాలు కూడా లివర్‌కు హాని కలిగించగలవు.
Read Also: Virus Alert : వైరస్ అలర్ట్.. చైనా గబ్బిలాల్లో 20 కొత్త వైరస్లు.. మానవాళికి మరో ముప్పు తప్పదా ?
తక్కువ మోతాదులో షుగర్-ఫ్రీ డ్రింక్స్ తాగితే పెద్దగా నష్టం ఉండదు. కానీ, వీటిని రోజూ ఎక్కువ మోతాదులో వాడితే మాత్రం ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. షుగర్-ఫ్రీ డ్రింక్స్‌కి బదులుగా సాదా నీళ్లు, కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, హెర్బల్ టీ లేదా పంచదార లేని సహజ పానీయాలు తాగవచ్చు. రోజూ వ్యాయామం చేయడం, బరువును అదుపులో పెట్టుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.