Liver Infections: లివర్‌కు ఎన్ని రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి? అవి ఎలా మొదలవుతాయి?

Liver Infections: మన శరీరంలో లివర్ (కాలేయం) చాలా ముఖ్యమైన అవయవం. దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా అవసరం. లివర్‌కు చాలా రకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అయితే, ముఖ్యంగా వచ్చే ఇన్ఫెక్షన్లు రెండే. ఈ ఇన్ఫెక్షన్లు కొన్నిసార్లు మనిషి ప్రాణానికే ప్రమాదం కలిగించవచ్చు. ఇన్ఫెక్షన్లు మొదలైనప్పుడు చికిత్స చేయడం సులువుగా ఉంటుంది. కానీ, అవి తీవ్రంగా మారితే చికిత్స చాలా కష్టంగా, ఎక్కువ సమయం పట్టేదిగా మారుతుంది. లివర్‌లో ఎన్ని రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి. అవి ఎలా మొదలవుతాయి అనే విషయాల గురించి నిపుణులైన డాక్టర్లు ఏం చెబుతున్నారో ఈ వార్తలో తెలుసుకుందాం.
లివర్‌లో ప్రధానంగా రెండు రకాల ఇన్ఫెక్షన్లు:
లివర్‌కు వచ్చే ఇన్ఫెక్షన్లు ప్రధానంగా రెండు రకాలు: ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్, రెండోది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్.
వైరల్ ఇన్ఫెక్షన్: దీనినే హెపటైటిస్ అంటారు. హెపటైటిస్‌లో A, B, C, D, E అనే ఐదు రకాలు ఉంటాయి. ఈ వైరస్ లివర్‌పై వాపును కలిగించి, తీవ్రంగా దెబ్బతీస్తుంది. సాధారణంగా దీనిని పచ్చ కామెర్లు (పీలియా) అని కూడా అంటారు. హెపటైటిస్ A, E వైరస్లు కలుషితమైన నీరు లేదా ఆహారం ద్వారా వ్యాపిస్తాయి. హెపటైటిస్ B, C రక్త మార్పిడి, శారీరక ద్రవాలు (రక్తం, వీర్యం, ఇతర శరీర స్రావాలు) ద్వారా వ్యాపిస్తాయి. హెపటైటిస్ D అనేది హెపటైటిస్ B ఉన్నవారికి మాత్రమే వస్తుంది.
Read Also:Alcohol Ban : 73 ఏళ్ల తర్వాత తొలిసారి.. సౌదీలో ఆల్కహాల్ అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్: ఈ ఇన్ఫెక్షన్ వల్ల లివర్‌లో ఫోరం (abscess) లేదా సిస్ట్ (cyst) ఏర్పడవచ్చు. ఇవి కూడా రక్తం ద్వారా శరీరంలోకి చేరే బ్యాక్టీరియా వల్ల రావచ్చు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో కూడా చాలా రకాలు ఉంటాయి.
ఈ రెండు రకాల ఇన్ఫెక్షన్లూ చాలా తీవ్రమైనవి. అయితే, అవి మొదలైన ప్రారంభ దశలోనే చికిత్స చేసుకుంటే సులభంగా నయం చేయవచ్చు. కొన్ని హెపటైటిస్ రకాలు పూర్తిగా నయం అవుతాయి, కానీ కొన్ని మాత్రం దీర్ఘకాలికంగా ఉండిపోతాయి, వాటికి చికిత్స కష్టంగా ఉంటుంది.
లివర్ ఇన్ఫెక్షన్ల లక్షణాలు
లివర్ ఇన్ఫెక్షన్లు మొదలైనప్పుడు కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. తగినంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ, ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఆకలి తగ్గడం లేదా అసలు ఆకలి వేయకపోవడం, కడుపులో నొప్పి రావడం, చర్మం కళ్లు పసుపు రంగులోకి మారడం (కామెర్లు), జ్వరం వస్తుంది. లివర్‌పై వాపు వచ్చి తీవ్రమైన నష్టం జరుగుతుంది. దీర్ఘకాలిక హెపటైటిస్ కొన్నిసార్లు లివర్ సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు.
Read Also:Those two behind Punjab Kings: పంజాబ్ కింగ్స్ వెనుక ఆ ఇద్దరు.. వారి వల్లే టాప్ 2 ప్లేస్ సొంతం
ఈ లక్షణాలలో ఏవి కనిపించినా, వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. ఇన్ఫెక్షన్ రకాన్ని బట్టి చికిత్స మొదలుపెడతారు. ప్రారంభ దశలో లివర్ ఇన్ఫెక్షన్లన్నింటికీ చికిత్స సాధ్యమే. కానీ, ఆలస్యం చేస్తే ఇన్ఫెక్షన్ తీవ్రంగా మారి, చికిత్స కూడా కష్టంగా మారుతుంది. మీ లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.