Alcohol Ban : 73 ఏళ్ల తర్వాత తొలిసారి.. సౌదీలో ఆల్కహాల్ అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్

Alcohol Ban : మందు తాగడం అంటే చాలామందికి ఓ సరదా. బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, స్నేహితులు కలిసినా.. ఇలా ఏ సందర్భానికైనా ఓ పెగ్గేయడం కామన్. కానీ, ప్రపంచంలో ఒక దేశంలో మాత్రం గత 73ఏళ్లుగా ఎవరూ మందు ముట్టుకోలేదు. ఆల్కహాల్‌పై నిషేధం విధించి డైమండ్ జూబ్లీ దగ్గరపడుతుందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ దేశమే సౌదీ అరేబియా. మన తెలుగు రాష్ట్రాల్లో కొందరు ఏడు గంటలు కూడా మందు లేకుండా ఉండలేరు. అలాంటిది 73 ఏళ్లుగా ఆల్కహాల్ వినియోగానికి దూరంగా ఉన్న సౌదీ ప్రజలు ఇప్పుడు ఒక పెద్ద మార్పును చూడబోతున్నారు.ఇన్నాళ్లు నిషేధం విధించి ఇప్పుడు తొలగించడం వెనుక కారణాలేంటో తెలుసుకుందాం.
సౌదీ అరేబియా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడానికి కొన్ని పెద్ద కారణాలున్నాయి. 2026 ఫిఫా వరల్డ్ కప్ సౌదీలో నిర్వహించనున్నారు. అంతేకాదు, ఎక్స్పో 2030, ఫిఫా వరల్డ్ కప్ 2034 వంటి అంతర్జాతీయ ఈవెంట్లను కూడా నిర్వహించనుంది. ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్లకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తారు. వారికి సౌకర్యంగా ఉండేలా, పర్యాటకాన్ని పెంచే లక్ష్యంతోనే ఆల్కహాల్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని ఈ ఎడారి దేశం ప్లాన్ చేస్తోంది.
Read Also:Best Mobiles at Low Prices: చీప్ అండ్ బెస్ట్.. తక్కువ ధరలో బెస్ట్ మొబైల్స్ ఇవే
ఆల్కహాల్ అమ్మకాలకు అనుమతించడం వల్ల యూఏఈ (UAE), బహ్రెయిన్ వంటి దేశాలతో పర్యాటక రంగంలో పోటీ పడేందుకు సౌదీకి ఉపయోగపడుతుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్ ఈవెంట్లు, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, వైన్, బీర్, సిడర్ వంటి మద్యాన్ని దేశవ్యాప్తంగా 600కు పైగా ప్రాంతాలలో లైసెన్స్ ఇచ్చి అమ్మకానికి అనుమతించనున్నారు. ముఖ్యంగా ఫైవ్ స్టార్ హోటల్స్, లగ్జరీ రిసార్ట్లు, నియోమ్, సిందలా ఐలండ్, రెడ్ సీ ప్రాజెక్టు వంటి ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో ఆల్కహాల్‌ను అమ్మడానికి ప్లాన్ చేస్తున్నారు.
సౌదీ అరేబియాలో అన్ని రకాల ఆల్కహాల్‌ను అమ్మడానికి అనుమతి ఇవ్వడం లేదు. ఇందులో కేవలం 20 శాతం ఆల్కహాల్ పర్సెంట్ కంటే తక్కువ ఉన్న బ్రాండ్స్‌కు మాత్రమే పర్మిషన్ ఇవ్వనున్నారు. అంటే, లైట్ బీర్, లైట్ వైన్ వంటి తక్కువ ఆల్కహాల్ శాతం ఉన్న పానీయాలను మాత్రమే అమ్మనున్నారు. అంతేకాకుండా కొన్ని కఠినమైన నియమాలు కూడా విధించారు. ఇళ్లు, షాపులు, పబ్లిక్ ప్లేస్‌లలో మద్యం తాగడం, అమ్మడం పూర్తిగా నిషేధం. వ్యక్తిగతంగా ఎవరైనా ఇంట్లో మద్యం తయారు చేయడం లేదా సేవించడం కూడా నిషేధమే. కేవలం లైసెన్స్ ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు , వాటిలో పనిచేసే సిబ్బంది మాత్రమే మద్యాన్ని సర్వ్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా నియంత్రిత పద్ధతిలో ఆల్కహాల్ వినియోగాన్ని అనుమతించాలని సౌదీ అరేబియా భావిస్తోంది. సౌదీ అరేబియా తీసుకొస్తున్న ఈ ఆల్కహాల్ పాలసీ విజన్-2030లో భాగంగానే జరుగుతున్నట్లు ఆ దేశ అధికారులు చెబుతున్నారు. ఈ నిర్ణయంతో 73 ఏళ్లుగా అనుసరిస్తున్న కఠినమైన నిషేధానికి ముగింపు పలికినట్లు అవుతుంది.
Read Also:Those two behind Punjab Kings: పంజాబ్ కింగ్స్ వెనుక ఆ ఇద్దరు.. వారి వల్లే టాప్ 2 ప్లేస్ సొంతం