Saanvikaa: సాయిపల్లవికి సిస్టర్‌లా ఉంది కదా.. ముద్దుకి నో చెప్పి మూవీ స్క్రీప్ట్‌నే మార్చేసిందిగా!

Saanvikaa: సినిమాల్లో హీరోయిన్ అంటే అన్ని రకాల సన్నివేశాలు ఉంటాయి. ఎలాంటి సన్నివేశం అయినా కూడా తప్పకుండా చేయాలి. ఇప్పుడున్న రోజుల్లో అంటే ఎన్నో రకాలు సీన్లు ఉంటాయి. ముఖ్యంగా ముద్దు సీన్ లేకుండా అసలు సినిమా కూడా ఉండదేమో. సాధారణంగా అన్ని సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు ఉన్నాయనే చెప్పవచ్చు. కొందరు సినిమాల్లోకి వెళ్లిన కొత్తలో పద్ధతిగా ఉంటారు. కానీ తర్వాత మాత్రం ఫ్యాషన్‌గా మారిపోతారు. ఇప్పుడున్న ఎందరో హీరోయిన్లు అంతే. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం ఇప్పటికి లిప్ లాక్, అందాలు కనిపించే దుస్తులు ధరించరు. వీరిలో చాలా మందికి సాయి పల్లవి పేరు వినిపిస్తుంది. కానీ నటి శాన్విక గురించి ఎవరికి తెలియదు. ఈ హీరోయిన్ ముద్దు సీన్‌కి నో చెప్పడంతో ఏకంగా మూవీ స్క్రీప్ట్ మార్చేశారు. ఇంతకీ ఎవరీ శాన్విక? ఎందుకు నో చెప్పింది? అనే విషయం చూద్దాం.
ఇటీవల ప్రేక్షకుల ముందుకు ‘పంచాయత్ సీజన్ 4’ వచ్చింది. ప్రేక్షకులకు కామెడీని పంచిన ఈ సిరీస్‌లో నటి శాన్విక రింకి అనే పాత్రలో కనిపించింది. శాన్విక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సిరీస్‌కు సంబంధించిన కొన్ని విషయాలను తెలియజేసింది. ఈ క్రమంలోనే ముద్దు సీన్ గురించి తెలిపింది. సిరీస్‌లో శాన్వి ముద్దు సీన్‌కి నో చెప్పిందట. దీంతో ఏకంగా మూవీ స్క్రీప్ట్‌ను మార్చినట్లు తెలిపింది. అయితే స్టోరీ చెప్పినప్పుడు ఎలాంటి ముద్దు సీను లేదట. కానీ షూటింగ్ సమయంలో ఉండటంతో తాను నో చెప్పింది. దీంతో వెంటనే మేకర్స్ స్క్రిప్ట్‌లో మార్పులు చేశారని తెలిపింది. ఇలా వారు మార్పులు చేయడంతో ఆమె ప్రశంసించారు. తన మాటను గౌరవించి ఇలా చేయడం చాలా హ్యాపీగా ఉందని, తనని గౌరవించారని ఆమె పొగిడారు. సిరీస్‌ను ఎక్కువగా కుటుంబంతో కలిసి చూస్తారు. ఇలాంటివి చూస్తే కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఈ కారణాల వల్లనే ఆమె ముద్దు సీన్‌కు నో చెప్పినట్లు తెలిపారు. చెప్పిన వెంటనే దర్శకుడు కూడా అర్థం చేసుకుని స్క్రీప్ట్‌ను కాస్త మార్పులు చేయడం కాస్త రిలాక్స్ అనిపించిందని ఆమె అన్నారు. ఇలాంటి గొప్ప టీమ్‌తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు.
శాన్విక ఎలాంటి ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే ఇండస్ట్రీకి వచ్చి తన కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అయితే పంచాయతీ 4 ఓటీటీ వేదికగా రిలీజ్ అయ్యింది. అయితే ఇది ప్రేక్షకులను ఎంతో బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే ఇది మూడు సీజన్లు వచ్చాయి. తాజాగా వచ్చిన నాలుగో సీజన్ కూడా ప్రేక్షకులను ఎంతో బాగా ఆకట్టుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా రిలీజ్ అయిన ఈ సిరీస్‌లో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్ ముఖ్య పాత్రల్లో నటించారు. కామెడీగా వచ్చిన ఈ సిరీస్ బాగుందని ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చింది.
Also Read: Pawan Kalyan : పాకీజాపై పవన్ పెద్ద మనసు.. ఏం చేశాడంటే?