Pawan Kalyan : పాకీజాపై పవన్ పెద్ద మనసు.. ఏం చేశాడంటే?

Pawan Kalyan : సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఎంతోమంది కళాకారులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు, ఒకప్పటి నటి వాసుకి. ‘పాకీజా’ అనే సినిమాతో ఆమె బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆమె దీన స్థితిని తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పెద్ద మనసు చాటుకున్నారు. వెంటనే స్పందించి రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని వాసుకి (పాకీజా)కి అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్, పి. గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా వాసుకి ఈ ఆర్థిక సాయాన్ని అందుకున్నారు.\
Read Also:UPI Circle : ఇక నుంచి పిల్లలు కూడా యూపీఐ చేయొచ్చు.. కొత్త ఫీచర్ వచ్చేసింది
*సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సాయం*
•నటి దీనస్థితికి చలించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు
•శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున రూ.2 లక్షలు సాయం అందించిన శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, శాసన సభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ… pic.twitter.com/8RhBQJJAQr— L.VENUGOPAL🌞 (@venupro) July 1, 2025
పవన్ కళ్యాణ్ చేసిన ఈ సాయానికి నటి వాసుకి (పాకీజా) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “పవన్ కళ్యాణ్ చిన్నవాడైనా, ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతాను” అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఆర్థిక పరిస్థితి గురించి జూన్ 30న పవన్ కళ్యాణ్ కార్యాలయానికి తెలియజేశానని, ఆయన అంత త్వరగా స్పందించి, వెంటనే సహాయం అందించడం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని పాకీజా అన్నారు.
పవన్ కళ్యాణ్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఎంతోమంది పేద కళాకారులకు, కష్టాల్లో ఉన్నవారికి ఆయన వ్యక్తిగతంగా అండగా నిలిచారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే, తన మానవత్వాన్ని చాటుకోవడం పట్ల సినీ వర్గాల్లో, ప్రజల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా, సినీ పరిశ్రమలో అవకాశాలు తగ్గిపోయిన తర్వాత చాలామంది కళాకారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారి కష్టాలను అర్థం చేసుకుని, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద మనసున్న వారు ముందుకు వచ్చి సహాయం చేయడం అభినందనీయం. ఈ సంఘటన ఇతర సినీ ప్రముఖులకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.
Read Also:Walking Tips: డైలీ ఇలా వాకింగ్ చేస్తే.. ఆరోగ్యానికి లక్షలకొద్ది లాభాలు!
-
Pawan Kalyan : హరిహర వీరమల్లు పూర్తి చేసింది త్రివిక్రమ్.. పవన్ కోసం హెల్ప్.. వీడియో లీక్
-
Hari Hara Veera Mallu : ఆ ట్రైలర్ వస్తే థియేటర్లు బద్దలే.. ‘పీకే’ చివరి డైలాగ్ మామూలుగా ఉండదంట!
-
Pawan Kalyan leaves Cabinet Meeting: క్యాబినెట్ భేటీ నుంచి పవన్ బయటకు.. హుటాహుటిన హైదరాబాద్ కు!
-
Pawan Kalyan : పంచెకట్టులో పవర్ స్టార్..అదిరిపోయిన పవన్ కళ్యాణ్ కొత్త లుక్
-
Pawan Kalyan : ఎట్టకేలకు రిలీజ్ డేట్ కన్ఫాం చేసుకున్న ‘హరి హర వీర మల్లు’.. ఎప్పుడంటే ?
-
Dhanush : పవన్ కళ్యాణ్ హీరోగా ధనుష్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే ?