Pressure Cooker : పొరపాటున కూడా ప్రెషర్ కుక్కర్లో ఈ 5 వస్తువులను వండకండి

Pressure Cooker : ప్రతి భారతీయ వంటగదిలో ప్రెషర్ కుక్కర్ లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు. తక్కువ సమయంలో ఈజీగా వంటలు చేసే కుక్కర్ వంటింటిలో చాలా ముఖ్యమైన వస్తువు. దీన్ని వంట చేయడంతో పాటు, ఆవిరి పట్టడానికి (స్టీమింగ్), బేకింగ్‌కు కూడా ఎక్కువగా వాడుతుంటారు. కేక్ కూడా ఇందులో బేక్ చేస్తుంటారు. అయితే, ప్రెషర్ కుక్కర్లో కొన్ని వస్తువులు వండడం వల్ల ఆరోగ్యానికి అనేక నష్టాలు కలుగుతాయి. కొన్ని ఆహార పదార్థాలను కుక్కర్లో వండినప్పుడు వచ్చే నురుగు శరీరంలోకి చేరి జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. అంతేకాదు, కొన్ని వస్తువులను ప్రెషర్ కుక్కర్లో వండడం వల్ల వాటి రుచి పాడైపోతుంది. అంతేకాకుండా అవి శరీరానికి హాని కలిగిస్తాయి. ప్రెషర్ కుక్కర్లో కొన్ని వస్తువులు వండడం వల్ల వాటిలోని పోషకాలు కూడా తగ్గిపోతాయి.
ప్రెషర్ కుక్కర్లో పొరపాటున కూడా వండకూడని 5 వస్తువులు ఇవే
పాలను ప్రెషర్ కుక్కర్లో మరగబెట్టవచ్చు
పాలు, క్రీమ్ వంటి డెయిరీ ఉత్పత్తులను ప్రెషర్ కుక్కర్లో అస్సలు వండకూడదు. ఇలా చేయడం వల్ల వాటి రుచి పాడైపోతుంది. పోషకాలు తగ్గిపోతాయి. ఇది ఆరోగ్యానికి హానికరం. మార్కెట్లో పాలు వేడి చేయడానికి ప్రత్యేకంగా కొన్ని కుక్కర్లు వస్తున్నా వాటిని ఇలా ఉపయోగించడం ప్రమాదకరంగా మారవచ్చు.
Read Also:Uber : క్యాబ్ బుక్ చేసుకుంటే టిప్ ఇవ్వొద్దు.. ఊబర్‌పై కేంద్రం సీరియస్
వేయించిన వస్తువులు వండవద్దు
ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీలు వంటి వేయించిన ఆహార పదార్థాలను కుక్కర్లో వండకూడదు. ఇలా చేయడం వల్ల వాటికి మంచి రుచి రాదు. ఎందుకంటే, కుక్కర్లో ఈ వస్తువులు డీప్ ఫ్రై అవ్వవు. అందుకే వీటిని ఎప్పుడూ కడాయిలో (పాన్) మాత్రమే వండాలి.
పాస్తా, నూడుల్స్ ప్రెషర్ కుక్కర్లో చేయవద్దు
పాస్తా, నూడుల్స్ ఉడకబెట్టిన తర్వాత మెత్తగా మారతాయి. కాబట్టి వీటిని ఎప్పుడూ ప్రెషర్ కుక్కర్లో వండకూడదు. ఒకవేళ అవి ఓవర్కుక్ అయితే, ముద్దగా మారిపోతాయి. అందుకే వీటిని ప్రెషర్ కుక్కర్లో వండకుండా ఉండడం మంచిది.
Read Also:Viral Video : డ్రైనేజీ అనుకున్నాడు.. కానీ మరో లోకంలోకి వెళ్లిపోయాడు.. అదో భయానక ప్రపంచం
ఆకుకూరలను కుక్కర్లో వండవద్దు
పాలకూర, కేల్ వంటి ఆకుకూరలను ఎప్పుడూ కుక్కర్లో వండకూడదు. ఎందుకంటే ఆకుకూరలలో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ వంటి అనేక పోషకాలు ఉంటాయి. కానీ వాటిని కుక్కర్లో వండడం వల్ల ఈ ముఖ్యమైన పోషకాలు తగ్గిపోతాయి. ఇది ఆరోగ్యానికి హానికరం.
కేక్‌ను ప్రెషర్ కుక్కర్లో బేక్ చేయకూడదు
ఓవెన్ లేకపోతే చాలా మంది కేక్‌ను ప్రెషర్ కుక్కర్లో బేక్ చేస్తుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పు. ప్రెషర్ కుక్కర్‌ను వస్తువులను వండటానికి తయారు చేశారు. బేక్ చేయడానికి కాదు. అందుకే ఇందులో కేక్‌ను ఎప్పుడూ బేక్ చేయకూడదు.