Kitchen Hacks : వంట పనులు సులభతరం చేసే చిట్కాలు.. ఈ ఐదింటిని పాటించండి

Kitchen Hacks : మన ఇంట్లో వంటగది చాలా ముఖ్యమైన భాగం. ఇది కేవలం ఆహారం వండుకునే ప్రదేశం మాత్రమే కాదు. కుటుంబం మొత్తం ఆరోగ్యానికి సంబంధించిన చోటు. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకు ఇక్కడే తయారవుతుంది. భారతీయ ఇళ్లలో ఇప్పటికీ చాలా మంది మహిళలకు రోజు వంటగది పనులతోనే మొదలవుతుంది. అందుకే ఈ ప్రదేశం మన తల్లుల ప్రేమతో నిండి ఉంటుంది. అయితే, వంటగది చిన్నదైనా, పెద్దదైనా, లేటెస్టుగా ఉన్నా, లేదా సంప్రదాయ వస్తువులు ఉన్నా, అందులో పని చేయడం అంత సులభం కాదు. వంట పనులు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడూ కొన్ని సాధారణ సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి చిన్న చిన్న సమస్యలను ఈ సింపుల్ చిట్కాలు నిమిషాల్లో పరిష్కరిస్తాయి.
వంటగదిలో వంట చేయడం నుంచి పాత్రలు కడగడం వరకు ఎన్నో పనులు ఉంటాయి. వాటికి చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు ఊహించని సమస్యలు వచ్చి, వంటగదిలో పని చేయడం మరింత కష్టంగా అనిపిస్తుంది. ఈ చిన్న సమస్యలకు పరిష్కారం తెలిస్తే వంటగదిలో పని చేయడం చాలా సరదాగా మారుతుంది. అలాంటి కొన్ని కిచెన్ హ్యాక్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాం.
1. పప్పు / అన్నం పొంగకుండా చూసుకోండి
చాలా మందికి పప్పు లేదా అన్నం వండేటప్పుడు కుక్కర్ లేదా గిన్నె నుంచి నీరు బయటకు పొంగి, పొయ్యి చుట్టూ చిందరవందర అవుతుంది. దీనివల్ల వంటగది మురికిగా మారడమే కాకుండా, వంట రుచి కూడా తగ్గవచ్చు. దీనికి ఒక సులభమైన పరిష్కారం ఉంది. మీరు పప్పు లేదా అన్నం వండడానికి పెట్టినప్పుడు అందులో కొద్దిగా వంట నూనె వేయండి. ఒకవేళ కుక్కర్లో వండుతుంటే అందులో ఒక చిన్న స్టీల్ గిన్నెను పెట్టినా కూడా పప్పు లేదా అన్నం పొంగకుండా ఉంటుంది.
Read Also:IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్‌కు భారీ భద్రత.. షాక్ కొడుతున్న టికెట్ రేట్లు
2. మొండి జిడ్డు నిమిషాల్లో మాయం
మసాలాతో కూడిన ఆహారం కొద్దిగా అడుగున అంటుకుంటే జిడ్డు పట్టి గంటల తరబడి రుద్దాల్సి వస్తుంది. దీని నుంచి విముక్తి పొందడానికి కొద్దిగా వెనిగర్ లేదా నిమ్మరసం తీసుకోండి. అందులో బేకింగ్ సోడా, ఉప్పు కలపండి. ఈ మిశ్రమాన్ని పాత్రపై రాసి కొద్దిసేపు అలాగే ఉంచండి. కాసేపటి తర్వాత స్క్రబ్బర్‌తో శుభ్రం చేస్తే, నిమిషాల్లోనే జిడ్డు మాయమవుతుంది.
3. వెల్లుల్లి త్వరగా ఒలవండి
వెల్లుల్లిని ఒలవడానికి చాలా సమయం పడుతుంది. అలాంటి సందర్భంలో, మీరు ముందుగా వెల్లుల్లి రెబ్బలను వేడి నీటిలో వేసి ఉంచండి. ఇలా చేస్తే పొట్టు సులభంగా ఊడిపోతుంది. అలాగే, వెల్లుల్లిని 20 నుండి 25 సెకన్ల పాటు మైక్రోవేవ్‌లో వేడి చేయవచ్చు. దీనివల్ల కూడా వెల్లుల్లి త్వరగా ఒలుచుకోవచ్చు.
4. అన్నం మెత్తగా, పొడిపొడిగా రావాలంటే
వండిన అన్నం కూడా తరచుగా ఎక్కువగా మెత్తగా లేదా ముద్దగా అవుతుంటే అందులో కొద్దిగా నిమ్మరసం కలపండి. ఇలా చేయడం వల్ల అన్నం పొడిపొడిగా వస్తుంది. లేదా వండేటప్పుడు కొద్దిగా నెయ్యి కలిపితే రుచి కూడా రెట్టింపు అవుతుంది. వీటితో పాటు, ఒక చిట్కా ఉంది. మీరు ఎంత బియ్యం తీసుకున్నారో, దానికి ఒకటిన్నర రెట్లు ఎక్కువ నీటిని తీసుకోండి. ఆ నీటిని బాగా మరిగించండి. నీరు మరిగిన తర్వాత, కడిగిన బియ్యాన్ని వేసి ఉడికించండి. ఇలా చేస్తే అన్నం పొడిపొడిగా వస్తుంది.
Read Also:IPL 2025 : ఐపీఎల్ ఫైనల్ కు వరుణ గండం.. మోదీ పిచ్ ఎవరికీ కలిసొస్తుంది ?
5. కత్తి పదును నిమిషాల్లో చేయండి
వంటగదిలో కత్తి కూరగాయలు, పండ్లు కోయడం నుండి చాలా పనులకు అవసరం అవుతుంది. కత్తి పదునుగా లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. దీని కోసం, కత్తిని అల్యూమినియం ఫాయిల్‌లో (Silver Foil) కొన్ని నిమిషాల పాటు రుద్దండి. ఇదే విధంగా కత్తెర పదును కూడా పెంచుకోవచ్చు.