IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్‌కు భారీ భద్రత.. షాక్ కొడుతున్న టికెట్ రేట్లు

IPL 2025 Final: ఐపీఎల్ 2025 (IPL 2025) ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరగనుంది. రెండు పాపులర్ టీమ్స్ ఫైనల్‌కు చేరడంతో స్టేడియం పూర్తిగా నిండిపోవడం ఖాయం. దీనికి తగ్గట్టే ఈ మ్యాచ్ టికెట్లు బ్లాక్ మార్కెట్లో భారీ ధరకు అమ్ముడవుతున్నాయి. రిపోర్ట్ ప్రకారం.. ఐపీఎల్ 2025 ఫైనల్ అత్యంత చవకైన టికెట్ రూ.1500 కాగా, అత్యంత ఖరీదైన టికెట్ రూ.30,000 వరకు ఉంది.
భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ కోసం 80,000 కంటే ఎక్కువ టికెట్లు ఆన్లైన్లో అమ్ముడయ్యాయి. ఇందులో 25,000 టికెట్లు ఉచితంగా ఉంటాయి. వీటిని క్రికెట్ బోర్డుతో పాటు ఇతర సంస్థలకు ఇస్తారు. అంతేకాదు, సైనిక సిబ్బందికి కూడా కొన్ని సీట్లు కేటాయించారు. నరేంద్ర మోదీ స్టేడియంలో కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అత్యధిక సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు. దీనితో పాటు, మ్యాచ్ చూసే అభిమానులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, జూన్ 3న, మెట్రో సేవలు సాధారణ సమయం కంటే ఎక్కువసేపు అంటే రాత్రి 12:30 గంటల వరకు నడుస్తాయి.
Read Also:IPL 2025 : ఐపీఎల్ ఫైనల్ కు వరుణ గండం.. మోదీ పిచ్ ఎవరికీ కలిసొస్తుంది ?
విమాన టికెట్ల ధరలు ఆకాశాన్నంటాయి!
నేడు, అంటే జూన్ 2న, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చండీగఢ్ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చే విమాన టికెట్ల ధరలు రూ.25,000కు చేరాయి. సాధారణ రోజుల్లో ఈ ధరలు రూ.3500 నుండి రూ.5000 వరకు ఉంటాయి. అంతేకాదు, జూన్ 4న ముంబై, ఢిల్లీ, బెంగళూరుకు ఉదయం విమాన ప్రయాణ ధర రూ.30,000 వరకు ఉంది. మధ్యాహ్నం 12 గంటల లోపు బెంగళూరుకు మొత్తం ఐదు విమానాలు బయలుదేరనున్నాయి. వాటిలో కేవలం రెండు విమానాల్లో మాత్రమే కొన్ని సీట్లు మిగిలి ఉన్నాయి.
జూన్ 3న చరిత్ర సృష్టించనున్న టీమ్
ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ లేదా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలవలేదు. 2025 ఐపీఎల్‌ను ఏ జట్టు గెలిచినా అది మొదటిసారి ఈ గొప్ప టోర్నమెంట్ ట్రోఫీని గెలుచుకుంటుంది. రాబోయే మ్యాచ్‌లో రెండు జట్ల ఆటగాళ్లు తమ వంద శాతం ప్రదర్శన ఇవ్వడం ఇప్పుడు చాలా ముఖ్యం.
Read Also:NEET PG Exam Postponed : సుప్రీంకోర్టు ఆదేశాలతో కీలక నిర్ణయం.. నీట్ పీజీ పరీక్ష వాయిదా!
-
RCB Stampede: ఆర్సీబీ తొక్కిసలాట.. రిపోర్టు లో సంచలన విషయాలు
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
IND vs ENG : ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేసి ఇంగ్లాండ్ వెన్ను విరిచిన తెలుగు కుర్రాడు
-
Pat Cummins : శుభ్‌మన్ గిల్ సేనను చూసి కమ్మిన్స్ భయపడ్డారా? ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2025 : ఐపీఎల్ వేలంలో రూ. 20 కోట్ల బిడ్..వాష్ రూంలోకి పరిగెత్తిన శ్రేయాస్ అయ్యర్!
-
Bengaluru Stampede : విరాట్ కోహ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.. పోలీసులకు స్థానికుల ఫిర్యాదు