Viral Video : డ్రైనేజీ అనుకున్నాడు.. కానీ మరో లోకంలోకి వెళ్లిపోయాడు.. అదో భయానక ప్రపంచం

Viral Video :ప్రపంచంలో ఇంకా చాలా రహస్యమైన, బయటపడని ప్రదేశాలు ఉన్నాయి. వాటిని ఎవరైనా కనుగొని, ఫోటోలు, వీడియోల ద్వారా ప్రపంచానికి చూపిస్తే అది కేవలం థ్రిల్లింగ్‌గా ఉండటమే కాదు, మనుషుల్లోని జిజ్ఞాసను కూడా పెంచుతుంది. జర్మన్ కంటెంట్ క్రియేటర్ కార్స్టెన్ రాబర్ట్ ఇలాంటి ఆసక్తికరమైన అన్వేషణలకు పేరుగాంచారు. ఇటీవల ఆయన ఒక సీవర్ లైన్ లోపల ఉన్న రహస్య ప్రపంచాన్ని బయటపెట్టి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు.
రహస్యమైన గుహలు, బంకర్లు లేదా పాత నిర్మాణాలను కనుగొనడం వల్ల మనకు గతం గురించి తెలియడమే కాకుండా కాలంతో పాటు విషయాలు ఎంతగా మారాయి, ఏం మిగిలిపోయాయో కూడా తెలుస్తుంది. కార్స్టెన్ తన కెమెరాతో రెండవ ప్రపంచ యుద్ధం నాటి ఒక దాగి ఉన్న భూగర్భ ఆసుపత్రిని చిత్రీకరించాడు.
Also Read : Honda : క్రెటా కన్నా ఖరీదైన స్కూటర్ లాంచ్.. ధర ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు తిరగడం ఖాయం
ఆస్పత్రి లోపల మసక వెలుతురుతో నిండిన గదులు, గోడలపై భయంకరమైన చిత్రాలు… ఆపరేటింగ్ లైట్ కింద ఒంటరిగా ఉన్న స్ట్రెచర్, లెక్కలేనన్ని గదులు, నేలపై చెల్లాచెదురుగా పడి ఉన్న భయంకరమైన గతం అవశేషాలు. కార్స్టెన్ చేసిన ఈ భయంకరమైన అన్వేషణ ఇంటర్నెట్‌ను షేక్ చేసింది!
View this post on Instagram
@losthistorie అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి షేర్ అయిన ఈ రీల్ వీడియోను ఇప్పటివరకు 18 లక్షలకు పైగా సార్లు చూశారు. కొంతమంది నెటిజన్లు దీనిని భయానక వీడియో గేమ్ లా ఉందని చెప్పగా మరికొంతమంది ఒళ్లు గగుర్పొడిచేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : WiFi Speed Increase : మోడీ సర్కార్ నిర్ణయంతో మీ ఇంటి వైఫై స్పీడ్ ఇక రాకెట్ లా దూసుకెళ్తుంది
ఒక నెటిజన్ “ఈ స్థలం నమ్మశక్యం కాని విధంగా భయంకరంగా ఉంది” అని కామెంట్ చేశారు. ఇంకొకరు, “ఇది నిజంగా ఆసుపత్రి అయితే, బాధితులను గటర్ చీకటిలోకి ఎలా దించి ఉంటారు?” అని ప్రశ్నించారు. మరో నెటిజన్.. “ఆసుపత్రి లోపలి దృశ్యం నాకు ‘లాస్ట్ ఆఫ్ అస్’ వెబ్‌సిరీస్‌ను గుర్తుచేస్తోంది” అని రాశారు. ఈ వీడియో నిజంగానే షాకింగ్‌గా ఉంది.
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు