Fahadh Faasil: లగ్జరీ కారును కొనుగోలు చేసిన ఫహద్ ఫాసిల్.. ఆ డబ్బుతో ఓ అపార్ట్ మెంట్ కొనేయొచ్చు

Fahadh Faasil: ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ కూడా అసలు ఊహించని విధంగా గోల్ఫ్ జీటీఐ కార్లకు భలే డిమాండ్ వస్తోంది. ఇండియాకు వచ్చిన 150 యూనిట్లలో, ఏకంగా 50 కార్లు కేరళలోనే అమ్ముడయ్యాయి. అది కూడా మాలీవుడ్ నటులే పోటీ పడి మరీ ఆ కార్లను కొనుగోలు చేస్తున్నారు. ముందుగా మమ్ముట్టి, జోజు జార్జ్ ఈ కార్లను బుక్ చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సురేష్ గోపి కొడుకు, కూతురు… ఇలా ప్రతి రోజూ ఒక్కొక్కరు ఈ కారును కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
ఇప్పుడు ‘పుష్ప’ సినిమాలో విలన్‌గా మెప్పించిన ఫహద్ ఫాసిల్ కూడా ఈ గోల్ఫ్ జీటీఐని సొంతం చేసుకున్నాడు. ఆయన ఈవీఎం షోరూమ్ నుంచి ఈ కారును కొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఫోక్స్‌వ్యాగన్ సంస్థ తమ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇండియన్ మార్కెట్ కోసం ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ కేటాయించిన 150 యూనిట్లలో ఫహద్ ఫాసిల్ కొన్నది కూడా ఒకటి కావడం విశేషం. కేరళ నుంచి మాత్రమే 50 గోల్ఫ్ కార్లు బుక్ అయ్యాయని వార్తలు చెబుతున్నాయి.
గోల్ఫ్ జీటీఐ అనేది ఫోక్స్‌వ్యాగన్ 4-డోర్ హాచ్బ్యాక్ కారు. ఫహద్ ఫాసిల్ కొనుగోలు చేసిన కారు గ్రెనడిల్లా బ్లాక్ మెటాలిక్ రంగులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 52.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). కారు ఇంత ఖరీదుగా ఉండటానికి ముఖ్య కారణం. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐని ఇండియాలో తయారు చేయట్లేదు. ఇది పూర్తిగా విదేశాల్లో తయారుచేసిన కారు. సీబీయు (Completely Built Unit) రూట్లో దీన్ని ఇండియాకు దిగుమతి చేసుకుంటున్నారు.
Read Also:China Ban : చైనా దెబ్బకు భారత్ లో ప్రమాదంలో 21,000ఉద్యోగాలు
ఈ కారు 2.0 లీటర్, ఫోర్ సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 265 హార్స్‌పవర్‌ను, 370 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. కేవలం 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అయితే, ఫోక్స్‌వ్యాగన్ దీని గరిష్ట వేగాన్ని 250 కిలోమీటర్లకు సెట్ చేసింది. గోల్ఫ్ జీటీఐ 4,289ఎంఎం పొడవు, 1,789ఎంఎం వెడల్పు, 1,456ఎంఎం ఎత్తు కలిగి ఉంది. దీనికి 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి.
కారులోపల 12.9 అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సన్‌రూఫ్, వైర్లెస్ ఛార్జర్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, పాడిల్ షిఫ్టర్లు, 30-రంగుల యాంబియంట్ లైటింగ్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు లాంటి అత్యాధునిక ఫీచర్లు అన్నీ ఉన్నాయి. సేఫ్టీ విషయానికొస్తే, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్-వ్యూ కెమెరా, టైర్ ప్రెషర్ మోనిటరింగ్ సిస్టమ్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్-ఛేంజ్ అసిస్ట్, లెవెల్ 2 ఏడీఏఎస్ సిస్టమ్ అందిస్తున్నారు.
Read Also:Niharika : తప్పు నాదే.. నిహారిక రెండో పెళ్లిపై నాగబాబు కీలక వ్యాఖ్యలు
ఫహద్ ఫాసిల్ గ్యారేజ్‌లో ఇప్పటికే చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిలో మినీ కంట్రీమ్యాన్, లంబోర్గిని ఉరుస్, పోర్షే 911, ల్యాండ్ రోవర్ డిఫెండర్ లాంటి మోడల్స్ ఉన్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే, గతేడాది ఏకంగా మూడు సినిమాల్లో నటించాడు ఫహద్ ఫాసిల్. ‘ఆవేశం’ సినిమాతో సోలో హీరోగా సూపర్ హిట్ కొట్టాడు. ‘పుష్ప 2’ తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అలాగే, రజనీకాంత్ నటించిన ‘వేట్టయన్’ సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం మారేసన్, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, తేవర్ మగన్ 2, ఆక్సిడెన్ పలు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నారు.